< 2 Петра 1 >

1 Симон Петро, раб і апостол Ісуса Христа. Тим, хто завдяки праведності нашого Бога й Спасителя Ісуса Христа отримав таку ж дорогоцінну віру, як і ми.
యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు.
2 Нехай благодать і мир вам примножаться в пізнанні Бога та Ісуса, нашого Господа.
దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
3 Його божественна сила дала нам усе для життя й побожності через пізнання Того, Хто покликав нас Своєю славою й доброчесністю.
తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు.
4 Завдяки їм нам даровані великі та дорогоцінні обітниці, щоб через них ви стали учасниками Божественної природи, уникнувши розтління, яке існує у світі через лихі бажання.
వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.
5 Тому докладіть усіх зусиль, щоб додати до вашої віри доброчесність, до доброчесності – знання,
ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం,
6 до знання – стриманість, до стриманості – терпеливість, до терпеливості – побожність,
జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి,
7 до побожності – братолюбство, а до братолюбства – любов.
భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి.
8 Бо якщо ви все це маєте й воно примножується [серед вас], то не будете бездіяльними чи безплідними у пізнанні Господа нашого Ісуса Христа.
ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
9 А в кого цього немає, той короткозорий, [навіть] сліпий, і забув про очищення від своїх минулих гріхів.
కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు.
10 Тому, брати, усе більше намагайтеся утвердити ваше покликання та обрання, бо, роблячи так, ніколи не спіткнетесь
౧౦కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
11 і будете щедро забезпечені [правом] увійти до вічного Царства Господа й Спасителя нашого Ісуса Христа. (aiōnios g166)
౧౧దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది. (aiōnios g166)
12 Тому я постійно нагадуватиму вам про це, хоча ви це знаєте й утверджені в теперішній істині.
౧౨వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను.
13 Бо вважаю за праведне, доки я ще в цьому наметі, спонукати вас нагадуванням,
౧౩నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకూ ఇవి మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను.
14 знаючи, що зняття мого намету вже близько, як і відкрив мені наш Господь Ісус Христос.
౧౪మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు.
15 Я дбатиму, щоб і після мого відходу ви завжди про це пам’ятали.
౧౫నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
16 Адже ми сповістили вам про силу та наближення Господа нашого Ісуса Христа, не слідуючи хитромудрим міфам, але будучи очевидцями Його величі.
౧౬ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తిని, ఆయన రాకడను గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వారుగా చెప్పాం.
17 Бо Він отримав честь і славу від Бога Отця, коли до Нього пролунав від величної слави такий голос: «Це Син Мій улюблений, Якого Я вподобав».
౧౭ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు,
18 І ми почули цей голос, що пролунав із неба, коли були з Ним на святій горі.
౧౮ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం.
19 І ми маємо ще надійніше пророче слово. Ви добре робите, зважаючи на нього як на світильник, який світить у темному місці, доки не почне розвиднятися й ранкова зоря не зійде у ваших серцях.
౧౯ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.
20 Пам’ятайте насамперед про те, що в Писанні жодне пророцтво не походить від чийогось власного тлумачення.
౨౦లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి.
21 Адже пророцтво ніколи не лунало з волі людини, але від Бога говорили люди, натхнені Святим Духом.
౨౧ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.

< 2 Петра 1 >