< 1 Івана 2 >
1 Діточки мої, я пишу вам це, щоб ви не грішили, а якщо хтось згрішив, то перед Отцем ми маємо Заступника – праведного Ісуса Христа.
౧నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.
2 Він – жертва за наші гріхи, і не тільки за наші, але й за [гріхи] всього світу.
౨మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.
3 Якщо ми дотримуємось Його заповідей, то знаємо, що пізнали Його.
౩ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది.
4 Той, хто каже: «Я Його знаю», але не дотримується Його заповідей, є брехуном, і немає в ньому істини.
౪“నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు.
5 Але в кожному, хто дотримується Його Слова, Божа любов стала дійсно досконалою. Так ми розуміємо, що ми є в Ньому.
౫కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.
6 Хто каже, що перебуває в Ньому, повинен жити так само, як жив Ісус.
౬ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.
7 Любі [мої], я пишу вам не нову заповідь, а стару, яку ви мали від початку. Стара заповідь – це Слово, яке ви чули.
౭ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న వాక్కే.
8 Але все ж я пишу вам нову заповідь, яка є істиною в Ньому й у вас, тому що темрява відступає, і світло істини вже сяє.
౮అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది.
9 Хто каже, що перебуває у світлі, але ненавидить свого брата, [той] і досі в темряві.
౯తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు.
10 Хто любить свого брата, [той] перебуває у світлі, і немає в ньому причини для спотикання.
౧౦తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు.
11 А хто ненавидить свого брата, той перебуває в темряві, і в темряві ходить, не знаючи, куди йде, бо темрява засліпила його очі.
౧౧కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.
12 Пишу вам, діточки, тому що ваші гріхи були прощені заради Його імені.
౧౨ప్రియమైన చిన్నపిల్లలారా! క్రీస్తు నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.
13 Пишу вам, батьки, тому що ви пізнали Того, Хто є від початку. Пишу вам, юнаки, тому що ви перемогли лукавого.
౧౩తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.
14 Я написав вам, діти, тому що ви пізнали Отця. Я написав вам, батьки, тому що ви пізнали Того, Хто є від початку. Я написав вам, юнаки, тому що ви сильні, і Слово Боже перебуває у вас, і ви перемогли лукавого.
౧౪చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.
15 Не любіть світу, ні того, що у світі. Хто любить світ, у тому немає любові до Отця,
౧౫ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.
16 тому що все, що є у світі, – пожадливість тіла, пожадливість очей та життєва гордість, – не від Отця, а від світу.
౧౬ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.
17 Світ та його бажання минають, але хто виконує волю Божу, той залишається вічно. (aiōn )
౧౭ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు. (aiōn )
18 Діти, це остання година. Як ви чули, антихрист наближається, і вже з’явилося багато антихристів. Із цього розуміємо, що це остання година.
౧౮పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది.
19 Вони вийшли з-поміж нас, але [ніколи] не були нашими, бо якби вони були з наших, то лишилися б з нами. Але вони [вийшли, ] щоб показати, що не всі з наших.
౧౯వారు మన దగ్గర నుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవారు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వారు మనకు సంబంధించినవారు కాదని కనబడుతూ ఉంది.
20 Ви маєте помазання від Святого й усе знаєте.
౨౦కాని, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు.
21 Я написав вам не тому, що ви не знаєте істини, а тому, що ви її знаєте, і тому, що жодна брехня не може походити з істини.
౨౧మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యం నుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను.
22 Хто брехун, як не той, хто заперечує, що Ісус є Христос? Хто відкидає Отця і Сина, той і є антихрист.
౨౨యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి.
23 Кожен, хто зрікається Сина, не має й Отця, а хто визнає Сина, той має й Отця.
౨౩కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే.
24 Нехай у вас перебуває те, що ви чули від початку. Якщо у вас перебуватиме те, що ви чули від початку, то й ви перебуватимете в Сині й в Отці.
౨౪మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలో అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు.
25 І це є обітниця, яку Він нам дав, – вічне життя. (aiōnios )
౨౫ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. (aiōnios )
26 Я написав вам це з приводу тих, хто вводить вас в оману.
౨౬ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారిని గురించి రాశాను.
27 Помазання, яке ви отримали від Нього, залишається у вас, і ви не потребуєте, щоб хтось вас навчав, бо воно саме вчить вас усього. Воно істинне, а не брехливе. Залишайтеся в Ньому, як воно й навчило вас.
౨౭ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి.
28 Тож тепер, діточки, залишайтеся в Ньому, щоб, коли Він з’явиться, ми мали сміливість і не були осоромлені перед Ним у час Його приходу.
౨౮కాబట్టి పిల్లలూ, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఆయనలో నిలిచి ఉండండి.
29 Якщо ви знаєте, що Він праведний, ви знаєте, що кожен, хто робить праведне, народжений від Нього.
౨౯ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వారందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.