< ప్రకటన గ్రంథము 19 >

1 ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.
Potom jsem slyšel jednohlasý sbor mohutného zástupu v nebi: „Haleluja, chvalte Boha! Jeho vítězství, sláva i moc,
2 ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.”
jeho soudy jsou jedině správné a spravedlivé. On vykonal rozsudek nad tou nevěstkou, která vínem svých neřestí přivedla do záhuby celou zemi, on pomstil své služebníky, jejich krev ulpěla na jejích rukou.“
3 రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు. (aiōn g165)
A pak ještě: „Haleluja chvalte Boha. To město chtělo vládnout na věky a věčně ho bude připomínat jenom oblak dýmu.“ (aiōn g165)
4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.
Čtyřiadvacet starců a ty čtyři bytosti padli na kolena, hluboce se klaněli Bohu sedícímu na trůnu a volali: „Je to tak, chvála Bohu!“
5 అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.
Od trůnu zazněl hlas: „Chvalte Boha všichni, kteří mu sloužíte a ctíte ho, malí i velcí!“
6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”
Pak se ozvalo mocné volání připomínající hukot vodopádu nebo hřmění bouře: „Haleluja, chvalme Boha. Náš všemocný Bůh a Pán se ujal své vlády.
7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.”
Radujme se, jásejme, vzdejme mu čest! Nadešel den Beránkovy svatby. Jeho nevěsta církev je už připravena.
8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.
Dostala běloskvoucí svatební šaty z nejjemnější látky, utkané ze svatého života vykoupených.“
9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
Anděl mi dal pokyn: „Piš! Dobře bude těm, kdo jsou pozváni na Beránkovu svatbu. To jsou slova samotného Boha.“
10 ౧౦ అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.
Přemohla mne vděčnost, padl jsem před andělem na kolena, ale on mne zvedl a řekl mi: „To nesmíš! Jsem přece pouhý služebník jako ty a tvoji bratři, kterým je svěřeno Ježíšovo poselství. Jenom Bohu se klaněj!“
11 ౧౧ తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.
Pak jsem uviděl otevřené nebe a hle, bílý kůň; a jezdec, který na něm seděl, se jmenoval Věrný a Pravý. To je ten, který vynáší spravedlivé rozsudky a vede spravedlivý boj.
12 ౧౨ ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
Jeho oči jsou jako naskrz propalující plamen, jeho hlavu zdobí mnohonásobná královská koruna. Na čele má napsané jméno, které nikdo nezná než on sám. Je ztělesněné Boží Slovo.
13 ౧౩ ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.
Oděv má zbrocený krví. Následuje ho družina jezdců na bílých koních, v pláštích z bělostného plátna.
14 ౧౪ ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
15 ౧౫ వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.
Z jeho úst vychází ostrý meč, kterým přemáhá národy. Nastolí novou vládu své spravedlnosti a jako vinař tlačí hrozny v lisu, tak ve spravedlivém hněvu vykoná soud nad bezbožnými.
16 ౧౬ ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.
Na boku svého pláště má napsáno: král králů, pán pánů.
17 ౧౭ అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.
Dále jsem viděl anděla, stojícího v plném slunci. Svolával mrchožravé ptáky, kteří létali nad ním: „Poleťte sem, budete hodovat na Božích nepřátelích, králích, vojevůdcích, bojovnících, koních i jezdcích, svobodných i otrocích, slabých i mocných!“
18 ౧౮ రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు.
19 ౧౯ క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
Tu jsem viděl, jak se pozemští vládcové a jejich armády střetli s jezdcem a jeho vojskem.
20 ౨౦ అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు. (Limnē Pyr g3041 g4442)
Šelma a lživý prorok, (který jí přisluhoval a svými zázraky mnohé svedl, aby přijali znak té šelmy a klaněli se její soše) skončili v moři plamenů. (Limnē Pyr g3041 g4442)
21 ౨౧ మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.
Jejich armády byly pobity mečem jezdce na bílém koni a ptáci se vrhli na těla mrtvých.

< ప్రకటన గ్రంథము 19 >