< ప్రకటన గ్రంథము 18 >
1 ౧ ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
Potom jsem spatřil jiného anděla sestupovat s nebe. Byla mu dána velká moc a jeho sláva ozářila celou zemi.
2 ౨ అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
Zvolal silným hlasem: „Padl, padl veliký Babylón a jeho rozvaliny budou obydleny všelijakými démony a odpornými ptáky.
3 ౩ ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”
Jeho nízké vášně posedly všechny národy a jejich vládce, takže se nezastavili před ničím. Obchodníci bohatli z jeho rozmařilého života.“
4 ౪ తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.
Pak jsem slyšel z nebe jiný hlas: „Utečte z toho města, moji věrní, neúčastněte se jeho hříchů, abyste s ním nepropadli trestu.
5 ౫ ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
Jeho hříchy se nakupily až k nebi a Bůh se chystá soudit jeho zločiny.
6 ౬ ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి.
Odplaťte mu po zásluze za jeho ohavné činy! Do číše, ve které míchal svoje ďábelské nápoje, mu nalejte dvakrát tolik.
7 ౭ ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను” అనుకుంది.
Slávu a hýření teď zaplatí trýzní a žalem. Namlouval si: Mám královskou moc a houf nápadníků, nikdy nebudu nosit smutek jako opuštěná vdova.
8 ౮ కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.”
Proto se teď na něj v jediném dni nahrne pohroma za pohromou, smrt, pláč, hlad a oheň. Tak rozhodl mocný Pán Bůh.“
9 ౯ ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు.
Mocipáni, kteří s ním smilnili a hýřili, nad ním budou plakat a naříkat, až uvidí dým hořícího města.
10 ౧౦ ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. “అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు.
Plni hrůzy se mu neodváží jít na pomoc a budou jen z povzdálí skučet: „Škoda, škoda tě, veliký a mocný Babylóne! Co se to s tebou najednou stalo?“
11 ౧౧ లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు.
I bohatí obchodníci budou toho města velice želet, protože přijde nazmar jejich zboží, sklady zlata a stříbra, drahých kamenů a perel, nejjemnějšího plátna, purpuru, hedvábí a šarlatu, vonných dřev a uměleckých předmětů ze slonoviny, vzácných dřev, mědi, oceli a mramoru.
12 ౧౨ వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాల రాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ
13 ౧౩ దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
Komu teď nabídnou skořici a jiná koření, voňavky, masti, kadidlo, víno a olej, mouku a obilí, dobytek a koně, vozy, ano i těla a duše lidí?
14 ౧౪ “నీ మనస్సు ఆశించిన ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు” అని చెబుతూ ఏడుస్తారు.
Všechno bohatství, které to město tak dychtivě shromažďovalo, přišlo vniveč, po všem jeho lesku a nádheře není už památky.
15 ౧౫ ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు.
Ti, kteří s ním obchodovali a bohatli z něho, tu stojí opodál, děsí se té zkázy
16 ౧౬ “సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, వెల గల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!” అంటారు.
a bědují: „Škoda tě, veliké město, škoda tě milovníku jemných látek, purpuru a šarlatu, zlata, drahokamů a perel. V jedné hodině vzalo za své takové bohatství!“
17 ౧౭ ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి
Ani loďaři, kapitáni lodí, námořníci a kdokoliv se zabývá mořeplavbou se neodváží přispět tomu městu na pomoc.
18 ౧౮ నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ మహా నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు.
Budou jen lamentovat a truchlit: „Tobě už se žádné město nikdy nevyrovná! Škoda tě, škoda, jak jen z tvého blahobytu těžila námořní doprava. A v jedné hodině je všechno v troskách!“
19 ౧౯ తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు.
20 ౨౦ “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”
Avšak raduj se, nebe, i ty, věrná církvi, protože se vás Bůh zastal. Dal tomu městu zakusit tvrdost soudů, které ono vynášelo nad vámi.
21 ౨౧ ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
Jeden silný anděl pak zdvihl obrovský kámen a vhodil ho do moře se slovy: „Veliké město Babylón zmizí navždy jako kámen v hlubinách.
22 ౨౨ కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
Nikdy už v něm nezazní hudba ani zpěv. Nikdy se už v něm neusadí žádný řemeslník, nikdy už v něm nezazní lomození strojů.
23 ౨౩ దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.”
Ztemní a žádné okno už se v něm nerozsvítí. Nikdy se už v něm neozve svatební veselí. Jeho obchodníci ovládali celý svět a jeho opojné nápoje mámily celé národy.
24 ౨౪ ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.
Jeho ulice jsou skropeny krví proroků a mučedníků pro víru a všech ostatních obětí.“