< కీర్తనల~ గ్రంథము 84 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. కోరహు వారసుల కీర్తన. సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం!
可拉後裔的詩,交與伶長。用迦特樂器。 萬軍之耶和華啊, 你的居所何等可愛!
2 ౨ యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.
我羨慕渴想耶和華的院宇; 我的心腸,我的肉體向永生上帝呼籲。
3 ౩ సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.
萬軍之耶和華-我的王,我的上帝啊, 在你祭壇那裏,麻雀為自己找着房屋, 燕子為自己找着菢雛之窩。
4 ౪ నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. (సెలా)
如此住在你殿中的便為有福! 他們仍要讚美你。 (細拉)
5 ౫ ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు.
靠你有力量、心中想往錫安大道的, 這人便為有福!
6 ౬ వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది.
他們經過「流淚谷」,叫這谷變為泉源之地; 並有秋雨之福蓋滿了全谷。
7 ౭ వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.
他們行走,力上加力, 各人到錫安朝見上帝。
8 ౮ యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. (సెలా)
耶和華-萬軍之上帝啊,求你聽我的禱告! 雅各的上帝啊,求你留心聽! (細拉)
9 ౯ దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.
上帝啊,你是我們的盾牌; 求你垂顧觀看你受膏者的面!
10 ౧౦ నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.
在你的院宇住一日, 勝似在別處住千日; 寧可在我上帝殿中看門, 不願住在惡人的帳棚裏。
11 ౧౧ యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.
因為耶和華-上帝是日頭,是盾牌, 要賜下恩惠和榮耀。 他未嘗留下一樣好處不給那些行動正直的人。
12 ౧౨ సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.
萬軍之耶和華啊, 倚靠你的人便為有福!