< కీర్తనల~ గ్రంథము 59 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
掃羅打發人窺探大衛的房屋,要殺他。那時,大衛作這金詩,交與伶長。調用休要毀壞。 我的上帝啊,求你救我脫離仇敵, 把我安置在高處,得脫那些起來攻擊我的人。
2 పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
求你救我脫離作孽的人 和喜愛流人血的人!
3 నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.
因為,他們埋伏要害我的命; 有能力的人聚集來攻擊我。 耶和華啊,這不是為我的過犯, 也不是為我的罪愆。
4 నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.
我雖然無過,他們預備整齊,跑來攻擊我。 求你興起鑒察,幫助我!
5 సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
萬軍之上帝-耶和華以色列的上帝啊! 求你興起,懲治萬邦! 不要憐憫行詭詐的惡人! (細拉)
6 సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
他們晚上轉回, 叫號如狗,圍城繞行。
7 మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.
他們口中噴吐惡言,嘴裏有刀; 他們說:有誰聽見?
8 అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.
但你-耶和華必笑話他們; 你要嗤笑萬邦。
9 దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.
我的力量啊,我必仰望你, 因為上帝是我的高臺。
10 ౧౦ నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
我的上帝要以慈愛迎接我; 上帝要叫我看見我仇敵遭報。
11 ౧౧ వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.
不要殺他們,恐怕我的民忘記。 主啊,你是我們的盾牌; 求你用你的能力使他們四散, 且降為卑。
12 ౧౨ వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
因他們口中的罪和嘴裏的言語, 並咒罵虛謊的話, 願他們在驕傲之中被纏住了。
13 ౧౩ వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.
求你發怒,使他們消滅, 以致歸於無有, 叫他們知道上帝在雅各中間掌權, 直到地極。 (細拉)
14 ౧౪ సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
到了晚上,任憑他們轉回; 任憑他們叫號如狗,圍城繞行。
15 ౧౫ తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.
他們必走來走去,尋找食物, 若不得飽就終夜在外。
16 ౧౬ నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.
但我要歌頌你的力量, 早晨要高唱你的慈愛; 因為你作過我的高臺, 在我急難的日子作過我的避難所。
17 ౧౭ దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.
我的力量啊,我要歌頌你; 因為上帝是我的高臺, 是賜恩與我的上帝。

< కీర్తనల~ గ్రంథము 59 >