< సామెతలు 26 >

1 ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.
Mint a hó nyáron és mint eső aratáskor, úgy nem illő a tisztelet a balgához.
2 రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు.
Mint a veréb, midőn költözik, mint a fecske, midőn repül: olyan az oknélküli átok, nem következik be.
3 గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.
Ostor a lónak, kantár a szamárnak, és vessző a balgák hátának.
4 మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు.
Ne felelj a balgának az ő oktalansága szerint, nehogy hasonló légy hozzá te is.
5 వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.
Felelj a balgának oktalansága szerint, nehogy bölcs legyen a maga szemében.
6 మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం.
Levágja lábait, erőszakot iszik, a ki üzenetet küld balgával.
7 అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.
Lelógnak a lábszárak a sántáról: olyan a példabeszéd a balgák szájában.
8 బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం.
Mint a ki követ köt meg parittyában, olyan a ki a balgának tiszteletet ad.
9 మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.
Tüske akadt a részeg kezébe: olyan a példabeszéd a balgák szájában.
10 ౧౦ బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం.
Íjász, a ki mindenkit megsebesít: olyan az, ki balgát bérel föl és csavargókat bérel föl.
11 ౧౧ తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం.
Mint kutya, mely visszatér okádásához: balga, a ki megismételi oktalanságát.
12 ౧౨ తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.
Láttál valakit, a ki bölcs a maga szemében – reménye van a balgának, inkább mint neki.
13 ౧౩ సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.
Mondta a rest: fenevad van az úton, oroszlán a piaczok közt.
14 ౧౪ బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.
Az ajtó megfordul a sarkában s a rest az ő ágyában.
15 ౧౫ కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం.
Bedugta kezét a rest a tálba, restelli szájához visszavinni.
16 ౧౬ సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.
Bölcsebb a rest a maga szemében, mint heten, kik ésszel felelnek.
17 ౧౭ తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం.
Megfogja az ebnek füleit: a ki arra menve felháborodik pörön, mely nem az övé.
18 ౧౮ తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.
Mint a hóbortos, ki tüzes szereket lő, nyilakat meg halált:
19 ౧౯
olyan azon ember, ki megcsalta felebarátját és azt mondja: hiszen én tréfálok.
20 ౨౦ కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.
Fa híján elalszik a tűz, mikor nincs suttogó, elhallgat a viszály.
21 ౨౧ నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.
Szén a parázsnak és fa a tűznek és viszálykodás embere a pörnek szítására!
22 ౨౨ కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి.
A suttogó szavai akár a csemege, s azok leszálltak a testnek kamaráiba.
23 ౨౩ చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.
Salakos ezüst rávonva cserépre: forró ajkak és gonosz szív.
24 ౨౪ పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.
Ajkaival tetteti magát a gyűlölő, de belsejében cselt hány.
25 ౨౫ వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.
Midőn kedvessé teszi hangját, ne higyj ő benne, mert hét utálatosság van szívében.
26 ౨౬ వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది.
Eltakarja magát a gyűlölet ámítással: nyilvánvalóvá lesz rosszasága a gyülekezetben.
27 ౨౭ గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.
A ki vermet ás, abba beleesik és a ki követ gördít, hozzá tér az vissza.
28 ౨౮ అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.
A hazug nyelv gyűlöli a kiket összezúzott, és a sima száj elcsúszást okoz.

< సామెతలు 26 >