< లేవీయకాండము 16 >
1 ౧ అహరోను ఇద్దరు కొడుకులూ యెహోవా సమక్షంలోకి వెళ్ళి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
И рече Господ Мојсију пошто погибоше два сина Аронова, а погибоше кад приступише пред Господа,
2 ౨ “నువ్వు నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, అతడు పరిహార స్థానమైన నిబంధన మందసం మూత ముందున్న తెరల్లో ఉన్న అతి పవిత్ర స్థలం లోకి అన్ని సమయాల్లో ప్రవేశించకూడదు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు. ఎందుకంటే నేను నిబంధన మందసం మూత పైన మేఘంలో కనిపిస్తాను.
И каза Господ Мојсију: Реци Арону, брату свом, да не улази у свако доба у светињу за завес пред заклопац који је на ковчегу, да не погине, јер ћу се у облаку над заклопцем јављати.
3 ౩ అతడు పాపం కోసం బలిగా ఒక కోడె దూడనూ, దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకుని పవిత్ర స్థలం లోకి రావాలి.
С овим нека улази Арон у светињу: с јунцем за жртву ради греха и с овном за жртву паљеницу.
4 ౪ అతడు ప్రతిష్ట చేసిన సన్న నార చొక్కాయి వేసుకోవాలి. సన్న నారతో చేసిన లోదుస్తులు ధరించాలి. సన్న నారతో చేసిన నడికట్టు కట్టుకుని, సన్న నారతో చేసిన తలపాగా ధరించాలి. ఇవన్నీ ప్రతిష్ట చేసిన పవిత్ర వస్త్రాలు. కాబట్టి స్నానం చేసి వీటిని ధరించాలి.
Свету кошуљу ланену нека обуче, и гаће ланене нека су на телу његовом, и нека се опаше појасом ланеним и капу ланену нека метне на главу; то су хаљине свете, и нека опере тело своје водом, па онда нека их обуче.
5 ౫ అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా రెండు మేక పోతులనూ దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకురావాలి.
А од збора синова Израиљевих нека узме два јарца за жртву ради греха, и једног овна за жртву паљеницу.
6 ౬ తరువాత అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని మొదట తన కోసం అర్పించి తనకూ తన కుటుంబానికీ పరిహారం చేయాలి.
И нека принесе Арон јунца свог на жртву за грех и очисти себе и дом свој.
7 ౭ ఆ తరువాత ఆ రెండు మేకపోతులను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో ఉంచాలి.
Потом нека узме два јарца, и нека их метне пред Господа на врата шатора од састанка.
8 ౮ అప్పుడు అహరోను రెండు చీటీలు వేయాలి. ఒకటి యెహోవా కోసం రెండోది విడిచి పెట్టబోయే మేక కోసం వేయాలి. ఆరెండు చీటీలను ఆ రెండు మేకల పైన వేయాలి.
И нека Арон баци жреб за та два јарца, један жреб Господу а други жреб Азазелу.
9 ౯ యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేక పైన పడుతుందో ఆ మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి.
И нека Арон принесе на жртву јарца на ког падне жреб Господњи, нека га принесе на жртву за грех.
10 ౧౦ ఏ మేకమీద ‘విడిచి పెట్టాలి’ అనే చీటీ పడుతుందో ఆ మేకని యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి.
А јарца на ког падне жреб Азазелов нека метне жива пред Господа, да учини очишћење на њему, па нека га пусти у пустињу Азазелу.
11 ౧౧ అప్పుడు అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని తీసుకు వచ్చి తన కోసం, తన కుటుంబం కోసం పరిహారం చేసుకోవాలి. దాని కోసం అహరోను ముందు తన పాపంకోసం బలిగా ఆ కోడె దూడని వధించాలి.
И нека Арон принесе јунца свог на жртву за грех и очисти себе и дом свој, и нека закоље јунца свог на жртву за грех.
12 ౧౨ ఆ తరువాత అహరోను యెహోవా సమక్షంలో ఉన్న ధూపం వేసే పళ్ళెం తీసుకుని దాన్ని బలిపీఠం పైన ఉన్ననిప్పులతో పూర్తిగా నింపి, రెండు గుప్పిళ్ళలో పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెరల లోపలికి తీసుకురావాలి.
И нека узме кадионицу пуну жеравице с олтара, који је пред Господом, и пуне прегршти када мирисног истуцаног, и нека унесе за завес.
13 ౧౩ యెహోవా సమక్షంలో నిబంధన ఆజ్ఞల మందసం పైన ఉన్న మూత పైగా ధూమం కమ్ముకునేలా సాంబ్రాణిని నిప్పులపై వేయాలి. అతనికి మరణం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.
И нека метне кад на огањ пред Господом, да дим од када заклони заклопац који је на сведочанству; тако неће погинути.
14 ౧౪ తరువాత అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత తీసుకుని దాన్ని ఆ మూత పైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకుని తన వేలితో ఆ మూత పైన ఏడు సార్లు చిలకరించాలి.
После нека узме крви од јунца и покропи с прста свог по заклопцу према истоку, а пред заклопцем нека седам пута покропи том крвљу с прста свог.
15 ౧౫ అప్పుడు ప్రజలర్పించే పాపం కోసం బలిగా మేకని వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకు రావాలి. కోడె దూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతోనూ చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుటా దాని పైనా చిలకరించాలి.
И нека закоље јарца на жртву за грех народни, и нека учини с крвљу његовом као што је учинио с крвљу јунчијом, и покропи њом по заклопцу и пред заклопцем.
16 ౧౬ ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరి అశుద్ధమైన పనులను బట్టీ, వారి తిరుగుబాటును బట్టీ, వారందరి పాపాలన్నిటిని బట్టీ పరిశుద్ధ స్థలానికి పరిహారం చేయాలి. వారి అశుద్ధమైన పనుల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం కోసం కూడా పరిహారం చేయాలి.
И тако ће очистити светињу од нечистота синова Израиљевих и од преступа њихових у свим гресима њиховим; тако ће учинити и у шатору од састанка, који је међу њима усред нечистота њихових.
17 ౧౭ అతి పవిత్ర స్థలం లో పరిహారం చేయడానికి అహరోను ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. అతడు తన కోసం, తన కుటుంబం కోసం, ఇంకా ప్రజలందరి కోసం పరిహారం చేయడం ముగించి బయటకి వచ్చేంత వరకూ ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు.
А нико да не буде у шатору од састанка кад он уђе да чини очишћење у светињи, докле не изађе и сврши очишћење за се и за дом свој и за сав збор израиљски.
18 ౧౮ తరువాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్ములకు పూయాలి.
А нека изађе к олтару који је пред Господом, и очисти га; и узевши крви од јунца и крви од јарца нека помаже рогове олтару унаоколо;
19 ౧౯ ఆ రక్తాన్ని ఏడు సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అలా దాన్ని పవిత్ర పరచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి.
И нека га покропи одозго истом крвљу с прста свог седам пута; тако ће га очистити и посветити га од нечистота синова Израиљевих.
20 ౨౦ అతడు అతి పవిత్ర స్థలానికీ, ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేసి ముగించిన తరువాత బతికి ఉన్న మేకని తీసుకు రావాలి.
А кад очисти светињу и шатор од састанка и олтар, тада нека доведе јарца живог.
21 ౨౧ అప్పుడు అహరోను బతికి ఉన్న ఆ మేక తలపైన తన రెండు చేతులూ ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నటినీ, వారి తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా ఆ మేక పైన మోపి దాన్ని అడవిలోకి తోలుకుని వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించి వేయాలి.
И метнувши Арон обе руке своје на главу јарцу живом, нека исповеди над њим сва безакоња синова Израиљевих и све преступе њихове у свим гресима њиховим, и метнувши их на главу јарцу нека га да човеку спремном да га истера у пустињу.
22 ౨౨ ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తన పై వేసుకుని ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకు వెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి.
И јарац ће однети на себи сва безакоња њихова у пустињу; и пустиће оног јарца у пустињу.
23 ౨౩ తరువాత అహరోను ప్రత్యక్ష గుడారంలోకి తిరిగి వచ్చి అతి పవిత్ర స్థలం లోకి వెళ్లే ముందు తాను ధరించిన నార వస్త్రాలను తీసి వాటిని అక్కడే ఉంచాలి.
Потом нека опет уђе Арон у шатор од састанка и свуче хаљине ланене које је обукао када је ишао у светињу, и онде нека их остави.
24 ౨౪ అతడు పవిత్ర స్థలం లో స్నానం చేసి తిరిగి తన సాధారణ బట్టలు వేసుకుని బయటకు రావాలి. అప్పుడు తన కొరకూ, ప్రజల కొరకూ దహనబలులు అర్పించి తన కోసం, ప్రజల కోసం పరిహారం చేయాలి.
Па нека опере тело своје на светом месту и обуче своје хаљине; и изашав нека принесе своју жртву паљеницу, и очисти себе и народ.
25 ౨౫ పాపం కోసం చేసే బలి పశువు కొవ్వుని బలిపీఠం పైన దహించాలి.
А сало од жртве за грех нека запали на олтару.
26 ౨౬ విడిచిపెట్టే మేకని వదిలి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు.
А ко одведе јарца за Азазела, нека опере хаљине своје и окупа тело своје у води, па онда нека уђе у логор.
27 ౨౭ పవిత్ర స్థలం లో పాపాల కోసం బలి చేసిన ఏ కోడె దూడ రక్తం, ఏ మేక రక్తం అతి పవిత్ర స్థలం లోకి తెచ్చారో ఆ కోడె దూడ, మేకల కళేబరాలను ఒకవ్యక్తి శిబిరం బయటకు తీసుకువెళ్ళాలి. అక్కడ వాటి చర్మాలనూ, మాంసాన్నీ, పేడనూ మంట పెట్టి కాల్చి వేయాలి.
А јунца за грех и јарца за грех, од којих је крв унесена да се учини очишћење у светињи, нека изнесу напоље из логора, и нека спале огњем коже њихове и месо њихово и балегу њихову.
28 ౨౮ వాటిని కాల్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి తిరిగి శిబిరంలోకి రావచ్చు.
А ко их спали, нека опере хаљине своје и окупа тело своје у води, па онда нека дође у логор.
29 ౨౯ మీరు ఏడో నెల పదో రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పనీ చేయకూడదు. స్థానిక ప్రజలకీ, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకీ ఇది వర్తిస్తుంది. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం.
И ово нека вам буде вечна уредба: десети дан седмог месеца мучите душе своје, и не радите никакав посао, ни домородац ни дошљак који се бави међу вама.
30 ౩౦ ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికై మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీ కోసం పరిహారం జరిగింది.
Јер у тај дан бива очишћење за вас, да се очистите; бићете очишћени од свих греха својих пред Господом.
31 ౩౧ అది మీకు మహా విశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఎలాంటి పనీ చేయకూడదు. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం.
То нека вам је почивање суботно, и мучите душе своје по уредби вечној.
32 ౩౨ తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠి జరిగి యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకుని ప్రతిష్ఠి చేసిన నార బట్టలు వేసుకోవాలి.
А свештеник који буде помазан и који буде освећен да врши службу свештеничку на место оца свог, он нека очишћа обукавши се у хаљине ланене, хаљине свете.
33 ౩౩ అతడు అతి పవిత్ర స్థలానికి పరిహారం చేయాలి. ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేయాలి. యాజకుల కొరకూ, సమాజంలోని ప్రజలందరి కొరకూ పరిహారం చేయాలి.
И нека очисти светињу свету и шатор од састанка; и олтар нека очисти; и свештенике и сав народ сабрани нека очисти.
34 ౩౪ ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం.” యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేసాడు.
И ово нека вам је вечна уредба да очишћате синове Израиљеве од свих греха њихових један пут у години. И учини Мојсије како му заповеди Господ.