< సంఖ్యాకాండము 21 >
1 ౧ ఇశ్రాయేలీయులు అతారీం మార్గంలో వస్తున్నారని దక్షిణం వైపు నివాసం ఉన్న కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు.
А кад чу Хананеј, цар арадски, који живљаше на југу, да иде Израиљ путем којим идоше уходе, он се поби с њима и зароби их неколико.
2 ౨ ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు.
Тада се Израиљ заветова Господу и рече: Ако даш овај народ мени у руке, до темеља ћу раскопати градове њихове.
3 ౩ యెహోవా ఇశ్రాయేలీయుల స్వరం విని, ఆ కనానీయుల మీద వాళ్లకు జయం ఇచ్చాడు. అప్పుడు వారు ఆ కనానీయులను, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశారు. ఆ చోటికి “హోర్మా” అని పేరు.
И услиши Господ глас Израиљев и даде му Хананеје, а он затре њих и градове њихове, и прозва оно место Орма.
4 ౪ ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు.
Потом пођоше од горе Ора к Црвеном мору обилазећи земљу едомску, и ослаби дух народу од пута.
5 ౫ అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ “ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం” అన్నారు.
И викаше народ на Бога и на Мојсија: Зашто нас изведосте из Мисира да изгинемо у овој пустињи? Јер нема ни хлеба ни воде, а овај се никакви хлеб већ огадио души нашој.
6 ౬ అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.
А Господ пусти на народ змије ватрене, које их уједаху, те помре много народа у Израиљу.
7 ౭ కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు.
Тада дође народ к Мојсију и рекоше: Згрешисмо што викасмо на Господа и на тебе; моли Бога нека уклони змије од нас. И Мојсије се помоли за народ.
8 ౮ మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా “పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు” అని మోషేకు చెప్పాడు.
И Господ рече Мојсију: Начини змију ватрену, и метни је на мотку, и кога уједе змија, нека погледа у њу, па ће оздравити.
9 ౯ కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
И начини Мојсије змију од бронзе, и метну је на мотку, и кога год уједе змија он погледа у змију од бронзе, и оздрави.
10 ౧౦ తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు.
Потом пођоше синови Израиљеви, и стадоше у логор у Овоту.
11 ౧౧ ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు.
И из Овота отишавши стадоше у логор на брдима аваримским у пустињи која је према моавској с истока.
12 ౧౨ అక్కడనుంచి వారు ప్రయాణం చేసి, జెరెదు లోయలో శిబిరం వేసుకున్నారు.
Оданде отишавши стадоше у логор у долини Зареду.
13 ౧౩ అక్కడనుంచి వారు ప్రయాణం చేసి బంజరు భూమిలో అర్నోను నది అవతల శిబిరం వేసుకున్నారు. ఆ నది అమోరీయుల దేశ సరిహద్దులనుంచి ప్రవహిస్తుంది. అర్నోను నది మోయాబుకు, అమోరీయులకు మధ్య ఉన్న మోయాబు సరిహద్దు.
И одатле отишавши стадоше у логор на брду на Арнону, који је у пустињи и излази од међе аморејске. Јер је Арнон међа моавска између Моаваца и Аморејаца.
14 ౧౪ ఆ కారణంగా యెహోవా యుద్ధాల గ్రంథంలో “సుఫాలో ఉన్న వాహేబు, అర్నోను లోయలు, ఆరు అనే స్థలం వరకూ ఉన్న అర్నోను లోయలు,
Зато се каже у књизи о ратовима Господњим: На Вајева у Суфи и на потоке арнонске.
15 ౧౫ మోయాబు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పల్లపు లోయలు” అని రాసి ఉంది.
Јер ти потоци, који допиру до места Ара, теку покрај међе моавске.
16 ౧౬ అక్కడనుంచి వారు బెయేరుకు వెళ్ళారు. అక్కడ ఉన్న బావి దగ్గర యెహోవా మోషేతో “ప్రజలను సమకూర్చు. నేను వాళ్లకు నీళ్ళు ఇస్తాను” అన్నాడు.
А отуда дођоше к Виру; то је студенац за који беше рекао Господ Мојсију: Скупи народ, и даћу им воде.
17 ౧౭ అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. “బావీ, పైకి ఉబుకు! ఆ బావిని కీర్తించండి. నాయకులు దాన్ని తవ్వారు.
Тада пева Израиљ песму ову: Дижи се, студенче; припевајте га;
18 ౧౮ వారు తమ అధికార దండంతో, చేతికర్రలతో ప్రజల నాయకులు దాన్ని తవ్వారు.”
Студенче, који копаше кнезови, који ископаше поглавари народни с оним који постави закон, палицама својим. А из пустиње отидоше у Мантанаил,
19 ౧౯ వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ,
А из Мантанаила, у Надил, а из Надила у Вамот,
20 ౨౦ మోయాబు దేశంలోని లోయలో ఉన్న బామోతు నుంచి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండ దగ్గరికి వచ్చారు.
А из Вамота у долину која је у пољу моавском код горе Фазге и гледа у пустињу.
21 ౨౧ ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపించి “మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు,
Тада посла Израиљ посланике к Сиону, цару аморејском говорећи:
22 ౨౨ మేము పొలాల్లోకైనా, ద్రాక్షతోటల్లోకైనా వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. మేము నీ సరిహద్దులు దాటే వరకూ రాజమార్గంలోనే నడిచి వెళ్తాం” అని అతనితో చెప్పించారు.
Пусти да прођемо кроз твоју земљу, нећемо свртати ни у поље ни у виноград, нити ћемо пити воде из студенаца; ићи ћемо царским путем докле не пређемо међу твоју.
23 ౨౩ కాని, సీహోను ఇశ్రాయేలీయులను తన సరిహద్దుల గుండా వెళ్ళనివ్వ లేదు. ఇంకా సీహోను తన జనమంతా సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యడానికి ఎడారిలోకి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
Али не даде Сион Израиљу да прође кроз земљу његову, него сабра Сион сав народ свој, и изађе на Израиља у пустињу, и дође у Јасу, и поби се с Израиљем.
24 ౨౪ ఇశ్రాయేలీయులు అతన్ని కత్తితో హతం చేసి, అతని దేశం అర్నోను మొదలు యబ్బోకు వరకూ, అంటే అమ్మోనీయుల దేశం వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అమ్మోనీయుల సరిహద్దు బలోపేతం అయ్యింది.
Али га исече Израиљ оштрим мачем, и освоји земљу његову од Арона па до Јавока, до синова Амонових, јер тврда беше међа синова Амонових.
25 ౨౫ ఇశ్రాయేలీయులు ఆ పట్టాణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టాణాలన్నిట్లో, హెష్బోనులో, దాని పల్లెలన్నిట్లో శిబిరం వేసుకున్నారు.
И узе Израиљ сва она места и насели се у свим градовима аморејским, у Есевону и у свим селима његовим.
26 ౨౬ హెష్బోను, అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకూ అతని దేశమంతా స్వాధీనం చేసుకున్నాడు.
Јер Есевон беше град Сиона, цара аморејског, који беше први завојштио на цара моавског и беше му узео сву земљу његову до Арнона.
27 ౨౭ కాబట్టి సామెతలు పలికే వారు “హెష్బోనుకు రండి. సీహోను పట్టణం కట్టాలి, దాన్ని స్థాపించాలి,
Зато говоре у причи: Ходите у Есевон, да се сагради и подигне град Сионов.
28 ౨౮ హెష్బోను నుంచి అగ్ని బయలువెళ్ళింది, సీహోను పట్టణంనుంచి జ్వాలలు బయలువెళ్ళాయి, అది మోయాబుకు ఆనుకున్న ఆర్ దేశాన్ని కాల్చేసింది, అర్నోను కొండ ప్రదేశాలను కాల్చేసింది.
Јер огањ изађе из Есевона, пламен из града Сионовог, и спали Ар моавски и становнике на висини арнонској.
29 ౨౯ మోయాబూ, నీకు బాధ, కెమోషు ప్రజలారా, మీరు నశించారు. తన కొడుకులను పలాయనం అయ్యేలా, తన కూతుళ్ళను అమోరీయులరాజైన సీహోనుకు బందీలుగా చేశాడు.
Тешко теби, Моаве; пропао си; народе Хемосов; дао је синове своје који утекоше и кћери своје у ропство Сиону, цару аморејском.
30 ౩౦ కాని మేము సీహోనును జయించాం. హెష్బోను దీబోను వరకూ నాశనం అయ్యింది. నోఫహు వరకూ దాన్ని పాడు చేశాం. అగ్నితో మేదెబా వరకూ తగల బెట్టాం” అంటారు.
Али их пострељасмо, пропаде Есевон до Девона, и потрсмо их до Нофе, која допире до Медеве.
31 ౩౧ కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు.
И тако живи Израиљ у земљи аморејској.
32 ౩౨ అప్పుడు, యాజెరు దేశాన్ని సంచారం చేసి చూడడానికి మోషే మనుషులను పంపినప్పుడు వారు దాని గ్రామాలు స్వాధీనం చేసుకుని అక్కడున్న అమోరీయులను తోలివేశారు.
Потом посла Мојсије да уходе Јазир, и узеше села око њега, и изагнаше Аморејце који беху онде.
33 ౩౩ వారు తిరిగి బాషాను మార్గంలో ముందుకు వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగు, అతని జనమంతా ఎద్రెయీలో యుద్ధం చెయ్యడానికి బయలుదేరారు.
Потом обративши се пођоше у Васан; и изиђе Ог, цар васански пред њих, он и сав народ његов на бој у Едрајин.
34 ౩౪ యెహోవా మోషేతో “అతనికి భయపడొద్దు. నేను అతని మీద, అతని జనం మీద, అతని దేశం మీద నీకు విజయం ఇచ్చాను. నువ్వు హెష్బోనులో నివాసం ఉన్న అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి కూడా చేస్తావు” అన్నాడు.
А Господ рече Мојсију: Не бој га се; јер сам га дао у твоје руке и сав народ његов и земљу његову; и учини му како си учинио Сиону, цару Аморејском који живљаше у Есевону.
35 ౩౫ కాబట్టి వారు అతన్ని, అతని కొడుకులను, ఒక్కడు కూడా మిగలకుండా అతని జనం అంతటినీ హతం చేసి అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
И побише га и синове његове и сав народ његов, да не оста ниједан, и освојише земљу његову.