< 2 పేతురు 2 >
1 ౧ గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు.
১অপৰং পূৰ্ৱ্ৱকালে যথা লোকানাং মধ্যে মিথ্যাভৱিষ্যদ্ৱাদিন উপাতিষ্ঠন্ তথা যুষ্মাকং মধ্যেঽপি মিথ্যাশিক্ষকা উপস্থাস্যন্তি, তে স্ৱেষাং ক্ৰেতাৰং প্ৰভুম্ অনঙ্গীকৃত্য সৎৱৰং ৱিনাশং স্ৱেষু ৱৰ্ত্তযন্তি ৱিনাশকৱৈধৰ্ম্ম্যং গুপ্তং যুষ্মন্মধ্যম্ আনেষ্যন্তি|
2 ౨ అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది.
২ততো ঽনেকেষু তেষাং ৱিনাশকমাৰ্গং গতেষু তেভ্যঃ সত্যমাৰ্গস্য নিন্দা সম্ভৱিষ্যতি|
3 ౩ ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.
৩অপৰঞ্চ তে লোভাৎ কাপট্যৱাক্যৈ ৰ্যুষ্মত্তো লাভং কৰিষ্যন্তে কিন্তু তেষাং পুৰাতনদণ্ডাজ্ঞা ন ৱিলম্বতে তেষাং ৱিনাশশ্চ ন নিদ্ৰাতি|
4 ౪ పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు. (Tartaroō )
৪ঈশ্ৱৰঃ কৃতপাপান্ দূতান্ ন ক্ষমিৎৱা তিমিৰশৃঙ্খলৈঃ পাতালে ৰুদ্ধ্ৱা ৱিচাৰাৰ্থং সমৰ্পিতৱান্| (Tartaroō )
5 ౫ అలాగే దేవుడు పూర్వకాలపు లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా, నీతిని ప్రకటించిన నోవహును, మిగతా ఏడుగురిని కాపాడి, దైవభక్తి లేని ప్రజల మీదికి జల ప్రళయం రప్పించాడు.
৫পুৰাতনং সংসাৰমপি ন ক্ষমিৎৱা তং দুষ্টানাং সংসাৰং জলাপ্লাৱনেন মজ্জযিৎৱা সপ্তজনৈঃ সহিতং ধৰ্ম্মপ্ৰচাৰকং নোহং ৰক্ষিতৱান্|
6 ౬ దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు.
৬সিদোমম্ অমোৰা চেতিনামকে নগৰে ভৱিষ্যতাং দুষ্টানাং দৃষ্টান্তং ৱিধায ভস্মীকৃত্য ৱিনাশেন দণ্ডিতৱান্;
7 ౭ దైవభయం లేని దుర్మార్గుల లైంగిక వికార ప్రవర్తన చేత మనస్తాపానికి గురైన నీతిపరుడైన లోతును రక్షించాడు.
৭কিন্তু তৈঃ কুৎসিতৱ্যভিচাৰিভি ৰ্দুষ্টাত্মভিঃ ক্লিষ্টং ধাৰ্ম্মিকং লোটং ৰক্ষিতৱান্|
8 ౮ దినదినం ఆ దుర్మార్గుల మధ్య ఉంటూ, వారు చేసే అక్రమమైన పనులు చూస్తూ, వింటూ, నీతిగల అతని మనసు దుఃఖిస్తూ ఉండేది.
৮স ধাৰ্ম্মিকো জনস্তেষাং মধ্যে নিৱসন্ স্ৱীযদৃষ্টিশ্ৰোত্ৰগোচৰেভ্যস্তেষাম্ অধৰ্ম্মাচাৰেভ্যঃ স্ৱকীযধাৰ্ম্মিকমনসি দিনে দিনে তপ্তৱান্|
9 ౯ ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గులను ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు.
৯প্ৰভু ৰ্ভক্তান্ পৰীক্ষাদ্ উদ্ধৰ্ত্তুং ৱিচাৰদিনঞ্চ যাৱদ্ দণ্ড্যামানান্ অধাৰ্ম্মিকান্ ৰোদ্ধুং পাৰযতি,
10 ౧౦ ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం.
১০ৱিশেষতো যে ঽমেধ্যাভিলাষাৎ শাৰীৰিকসুখম্ অনুগচ্ছন্তি কৰ্তৃৎৱপদানি চাৱজানন্তি তানেৱ (ৰোদ্ধুং পাৰযতি| ) তে দুঃসাহসিনঃ প্ৰগল্ভাশ্চ|
11 ౧౧ దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వారిని దూషించి వారి మీద నేరం మోపడానికి భయపడతారు.
১১অপৰং বলগৌৰৱাভ্যাং শ্ৰেষ্ঠা দিৱ্যদূতাঃ প্ৰভোঃ সন্নিধৌ যেষাং ৱৈপৰীত্যেন নিন্দাসূচকং ৱিচাৰং ন কুৰ্ৱ্ৱন্তি তেষাম্ উচ্চপদস্থানাং নিন্দনাদ্ ইমে ন ভীতাঃ|
12 ౧౨ పశుప్రవృత్తి గల ఈ మనుషులైతే తమకు తెలియని సంగతులను గురించి దూషిస్తారు. వారు బంధకాలకు, నాశనానికి తగినవారు. వారు తమ దుర్మార్గత వల్ల పూర్తిగా నశించిపోతారు.
১২কিন্তু যে বুদ্ধিহীনাঃ প্ৰকৃতা জন্তৱো ধৰ্ত্তৱ্যতাযৈ ৱিনাশ্যতাযৈ চ জাযন্তে তৎসদৃশা ইমে যন্ন বুধ্যন্তে তৎ নিন্দন্তঃ স্ৱকীযৱিনাশ্যতযা ৱিনংক্ষ্যন্তি স্ৱীযাধৰ্ম্মস্য ফলং প্ৰাপ্স্যন্তি চ|
13 ౧౩ వారి చెడుతనానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్టపగలు సుఖభోగాల్లో ఉంటారు. మచ్చలుగా, కళంకాలుగా ఉంటారు. వారు, మీతో కూడా విందుల్లో పాల్గొంటూనే తమ భోగాల్లో సుఖిస్తూ ఉంటారు.
১৩তে দিৱা প্ৰকৃষ্টভোজনং সুখং মন্যন্তে নিজছলৈঃ সুখভোগিনঃ সন্তো যুষ্মাভিঃ সাৰ্দ্ধং ভোজনং কুৰ্ৱ্ৱন্তঃ কলঙ্কিনো দোষিণশ্চ ভৱন্তি|
14 ౧౪ వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.
১৪তেষাং লোচনানি পৰদাৰাকাঙ্ক্ষীণি পাপে চাশ্ৰান্তানি তে চঞ্চলানি মনাংসি মোহযন্তি লোভে তৎপৰমনসঃ সন্তি চ|
15 ౧౫ వారు, అవినీతి సంబంధమైన జీతం కోసం ఆశపడిన బెయోరు కుమారుడు బిలామును అనుసరించి తప్పిపోయారు. సక్రమ మార్గాన్ని వదిలిపెట్టారు.
১৫তে শাপগ্ৰস্তা ৱংশাঃ সৰলমাৰ্গং ৱিহায বিযোৰপুত্ৰস্য বিলিযমস্য ৱিপথেন ৱ্ৰজন্তো ভ্ৰান্তা অভৱন্| স বিলিযমো ঽপ্যধৰ্ম্মাৎ প্ৰাপ্যে পাৰিতোষিকেঽপ্ৰীযত,
16 ౧౬ కాని, బిలాము చేసిన అతిక్రమానికి మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా అతన్ని గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.
১৬কিন্তু নিজাপৰাধাদ্ ভৰ্ত্সনাম্ অলভত যতো ৱচনশক্তিহীনং ৱাহনং মানুষিকগিৰম্ উচ্চাৰ্য্য ভৱিষ্যদ্ৱাদিন উন্মত্ততাম্ অবাধত|
17 ౧౭ ఈ మనుషులు నీళ్ళులేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటి వారు. గాడాంధకారం వీరి కోసం సిద్ధంగా ఉంది. ()
১৭ইমে নিৰ্জলানি প্ৰস্ৰৱণানি প্ৰচণ্ডৱাযুনা চালিতা মেঘাশ্চ তেষাং কৃতে নিত্যস্থাযী ঘোৰতৰান্ধকাৰঃ সঞ্চিতো ঽস্তি| ()
18 ౧౮ వారు పనికిమాలిన గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వారు చెడు మార్గంలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని తమ శరీర సంబంధమైన చెడు కోరికలతో వెనుదిరిగేలా ప్రేరేపిస్తారు.
১৮যে চ জনা ভ্ৰান্ত্যাচাৰিগণাৎ কৃচ্ছ্ৰেণোদ্ধৃতাস্তান্ ইমে ঽপৰিমিতদৰ্পকথা ভাষমাণাঃ শাৰীৰিকসুখাভিলাষৈঃ কামক্ৰীডাভিশ্চ মোহযন্তি|
19 ౧౯ వారే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు.
১৯তেভ্যঃ স্ৱাধীনতাং প্ৰতিজ্ঞায স্ৱযং ৱিনাশ্যতাযা দাসা ভৱন্তি, যতঃ, যো যেনৈৱ পৰাজিগ্যে স জাতস্তস্য কিঙ্কৰঃ|
20 ౨౦ ఎవరైనా ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు విషయంలో అనుభవజ్ఞానం వల్ల ఈ లోకపు అపవిత్రతను తప్పించుకొన్న తరువాత దానిలో మళ్లీ ఇరుక్కుని దాని వశమైతే, వారి మొదటి స్థితి కన్నా చివరి స్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది.
২০ত্ৰাতুঃ প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য জ্ঞানেন সংসাৰস্য মলেভ্য উদ্ধৃতা যে পুনস্তেষু নিমজ্জ্য পৰাজীযন্তে তেষাং প্ৰথমদশাতঃ শেষদশা কুৎসিতা ভৱতি|
21 ౨౧ వారు, నీతి మార్గాన్ని తెలుసుకున్న తరువాత తమకు అందిన పవిత్ర ఆజ్ఞ నుండి తప్పిపోవడం కన్నా అసలు ఆ మార్గం వారికి తెలియకుండా ఉండడమే మేలు.
২১তেষাং পক্ষে ধৰ্ম্মপথস্য জ্ঞানাপ্ৰাপ্তি ৰ্ৱৰং ন চ নিৰ্দ্দিষ্টাৎ পৱিত্ৰৱিধিমাৰ্গাৎ জ্ঞানপ্ৰাপ্তানাং পৰাৱৰ্ত্তনং|
22 ౨౨ “కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్ళినట్టుగా” అని చెప్పిన సామెతలు వీళ్ళ విషయంలో నిజం.
২২কিন্তু যেযং সত্যা দৃষ্টান্তকথা সৈৱ তেষু ফলিতৱতী, যথা, কুক্কুৰঃ স্ৱীযৱান্তায ৱ্যাৱৰ্ত্ততে পুনঃ পুনঃ| লুঠিতুং কৰ্দ্দমে তদ্ৱৎ ক্ষালিতশ্চৈৱ শূকৰঃ||