< 1 యోహాను 1 >
1 ౧ ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం.
১আদিতো য আসীদ্ যস্য ৱাগ্ অস্মাভিৰশ্ৰাৱি যঞ্চ ৱযং স্ৱনেত্ৰৈ ৰ্দৃষ্টৱন্তো যঞ্চ ৱীক্ষিতৱন্তঃ স্ৱকৰৈঃ স্পৃষ্টৱন্তশ্চ তং জীৱনৱাদং ৱযং জ্ঞাপযামঃ|
2 ౨ ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. (aiōnios )
২স জীৱনস্ৱৰূপঃ প্ৰকাশত ৱযঞ্চ তং দৃষ্টৱন্তস্তমধি সাক্ষ্যং দদ্মশ্চ, যশ্চ পিতুঃ সন্নিধাৱৱৰ্ত্ততাস্মাকং সমীপে প্ৰকাশত চ তম্ অনন্তজীৱনস্ৱৰূপং ৱযং যুষ্মান্ জ্ঞাপযামঃ| (aiōnios )
3 ౩ మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది.
৩অস্মাভি ৰ্যদ্ দৃষ্টং শ্ৰুতঞ্চ তদেৱ যুষ্মান্ জ্ঞাপ্যতে তেনাস্মাভিঃ সহাংশিৎৱং যুষ্মাকং ভৱিষ্যতি| অস্মাকঞ্চ সহাংশিৎৱং পিত্ৰা তৎপুত্ৰেণ যীশুখ্ৰীষ্টেন চ সাৰ্দ্ধং ভৱতি|
4 ౪ మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.
৪অপৰঞ্চ যুষ্মাকম্ আনন্দো যৎ সম্পূৰ্ণো ভৱেদ্ তদৰ্থং ৱযম্ এতানি লিখামঃ|
5 ౫ దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం.
৫ৱযং যাং ৱাৰ্ত্তাং তস্মাৎ শ্ৰুৎৱা যুষ্মান্ জ্ঞাপযামঃ সেযম্| ঈশ্ৱৰো জ্যোতিস্তস্মিন্ অন্ধকাৰস্য লেশোঽপি নাস্তি|
6 ౬ మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.
৬ৱযং তেন সহাংশিন ইতি গদিৎৱা যদ্যন্ধাকাৰে চৰামস্তৰ্হি সত্যাচাৰিণো ন সন্তো ঽনৃতৱাদিনো ভৱামঃ|
7 ౭ అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
৭কিন্তু স যথা জ্যোতিষি ৱৰ্ত্ততে তথা ৱযমপি যদি জ্যোতিষি চৰামস্তৰ্হি পৰস্পৰং সহভাগিনো ভৱামস্তস্য পুত্ৰস্য যীশুখ্ৰীষ্টস্য ৰুধিৰঞ্চাস্মান্ সৰ্ৱ্ৱস্মাৎ পাপাৎ শুদ্ধযতি|
8 ౮ మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.
৮ৱযং নিষ্পাপা ইতি যদি ৱদামস্তৰ্হি স্ৱযমেৱ স্ৱান্ ৱঞ্চযামঃ সত্যমতঞ্চাস্মাকম্ অন্তৰে ন ৱিদ্যতে|
9 ౯ కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.
৯যদি স্ৱপাপানি স্ৱীকুৰ্ম্মহে তৰ্হি স ৱিশ্ৱাস্যো যাথাৰ্থিকশ্চাস্তি তস্মাদ্ অস্মাকং পাপানি ক্ষমিষ্যতে সৰ্ৱ্ৱস্মাদ্ অধৰ্ম্মাচ্চাস্মান্ শুদ্ধযিষ্যতি|
10 ౧౦ మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.
১০ৱযম্ অকৃতপাপা ইতি যদি ৱদামস্তৰ্হি তম্ অনৃতৱাদিনং কুৰ্ম্মস্তস্য ৱাক্যঞ্চাস্মাকম্ অন্তৰে ন ৱিদ্যতে|