< 2 కొరింథీయులకు 4 >
1 ౧ కనికరం ఎలా పొందామో అలానే ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము.
Ezért tehát, mivel ilyen szolgálatban vagyunk, és kegyelmet nyertünk, nem csüggedünk,
2 ౨ అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాడి మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.
hanem lemondunk a szégyenletes titkos bűnökről, nem járunk ravaszságban, és nem is hamisítjuk meg Isten igéjét, hanem nyíltan hirdetjük az igazságot, és rábízzuk magunkat minden ember lelkiismeretére, az Isten előtt.
3 ౩ ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే.
Ha mégis leplezett a mi evangéliumunk, csak azoknak leplezett, akik elvesznek,
4 ౪ దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. (aiōn )
ezeknek a hitetleneknek gondolkodását e világ istene elvakította, hogy ne lássák Krisztusnak, Isten képének dicsőségéről szóló evangéliumnak világosságát. (aiōn )
5 ౫ కాబట్టి మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా క్రీస్తు యేసును మా ప్రభువుగా, యేసు కోసం మీ పనివాళ్ళంగా ప్రకటిస్తున్నాము.
Mert nem magunkat prédikáljuk, hanem az Úr Jézus Krisztust, magunkat pedig, mint a ti szolgáitokat a Jézusért.
6 ౬ “చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.
Mert Isten, aki szólt, hogy a sötétségből világosság ragyogjon, ő gyújtott világosságot a mi szívünkben, hogy fölragyogjon előttünk Isten dicsőségének ismerete Jézus Krisztus arcán.
7 ౭ అయితే ఈ సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
Ez a kincsünk pedig cserépedényekben van, hogy az erőnek rendkívüli nagysága Istené legyen, és nem tőlünk való.
8 ౮ అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు.
Mindenütt szorongatnak, de el nem nyomnak. Kétségeskedünk, de nem esünk kétségbe.
9 ౯ చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు.
Üldöztetünk, de el nem hagyatunk. Tiportatunk, de el nem veszünk.
10 ౧౦ యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము.
Mindenkor testünkben hordozzuk az Úr Jézus halálát, hogy Jézusnak élete is látható legyen a mi testünkben.
11 ౧౧ యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాము.
Mert mi, akik élünk, mindenkor halálra adatunk Jézusért, hogy Jézus élete is látható legyen a mi halandó testünkben.
12 ౧౨ ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి.
A halál tehát bennünk munkálkodik, az élet pedig tibennetek.
13 ౧౩ కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.
Mivel pedig a hitnek bennünk is ugyanaz a Lelke van, amint meg van írva: „Hittem és azért szóltam, “hiszünk mi is és azért szólunk.
14 ౧౪ ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు.
Mert tudjuk, hogy aki feltámasztotta az Úr Jézust, Jézus által minket is feltámaszt, és veletek együtt maga elé állít.
15 ౧౫ కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి.
Mert minden értetek van, hogy a kegyelem sokasodjék, és egyre bőségesebben áradjon a hálaadás Isten dicsőségére.
16 ౧౬ అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.
Azért nem csüggedünk, sőt ha a mi külső emberünk megromlik is, a belső mégis napról-napra megújul.
17 ౧౭ మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. (aiōnios )
Mert a mi pillanatnyi, könnyű szenvedésünk igen-igen nagy örök dicsőséget szerez nekünk, (aiōnios )
18 ౧౮ కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి. (aiōnios )
mert nem a láthatókra nézünk, hanem a láthatatlanokra, mert a láthatók ideig valók, a láthatatlanok pedig örökkévalók. (aiōnios )