< 2 కొరింథీయులకు 3 >
1 ౧ మళ్ళీ మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టామా? కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా?
Elkezdjük-e ismét ajánlgatni magunkat? Vagy talán szükségünk van, mint némelyeknek, ajánlólevelekre hozzátok vagy tőletek?
2 ౨ మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు.
A mi levelünk ti vagytok, szívünkbe írva, amelyet ismer és olvas minden ember.
3 ౩ అది రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు
Mert nyilvánvaló, hogy Krisztusnak a mi szolgálatunk által szerzett levele vagytok, nem tintával, hanem az élő Isten Lelkével írva, nem kőtáblákra, hanem a szívnek hústábláira.
4 ౪ క్రీస్తు ద్వారా దేవుని మీద మాకిలాంటి నమ్మకముంది.
Ilyen bizodalmunk Krisztus által van Isten iránt.
5 ౫ మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది.
Nem mintha önmagunktól volnánk alkalmasak, magunknak tulajdonítva valamit, ellenkezőleg a mi alkalmas voltunk Istentől van,
6 ౬ ఆయనే కొత్త ఒడంబడికకు సేవకులుగా మాకు అర్హత కలిగించాడు. అంటే వ్రాత రూపంలో ఉన్న దానికి కాదు, ఆత్మ మూలమైన దానికే. ఎందుకంటే అక్షరం చంపుతుంది గానీ ఆత్మ బ్రతికిస్తుంది.
aki alkalmassá tett minket arra, hogy új szövetség szolgái legyünk, nem a betűé, hanem a Léleké, mert a betű megöl, a Lélek pedig megelevenít.
7 ౭ మరణ కారణమైన సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు.
Ha pedig a halálnak betűkkel kövekbe vésett szolgálata dicsőséges volt, úgyhogy Izrael fiai nem is nézhettek Mózes arcára, arcának mulandó dicsősége miatt,
8 ౮ ఇలాగైతే ఆత్మ సంబంధమైన సేవ మరింకెంత గొప్పగా ఉంటుందో గదా!
hogyne volna még inkább dicsőséges a Lélek szolgálata?
9 ౯ శిక్షా విధికి కారణమైన సేవ ఇంత గొప్పగా ఉంటే, నీతికి కారణమైన సేవ మరింకెంతో గొప్పగా ఉంటుంది గదా!
Mert ha a kárhoztatás szolgálata dicsőséges, mennyivel inkább dicsőséges az igazság szolgálata?
10 ౧౦ అపారమైన వైభవం దీనికి ఉండడం వలన ఒకప్పుడు వైభవంగా ఉండేది, ఇప్పుడు వైభవం లేనిదయింది.
Sőt az egykor dicsőített, már nem is dicsőséges, az őt felülmúló dicsőség miatt.
11 ౧౧ గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
Mert ha dicsőséges a mulandó, sokkal inkább dicsőséges a maradandó.
12 ౧౨ తగ్గిపోయే వైభవాన్ని ఇశ్రాయేలీయులు నేరుగా చూడకుండా మోషే తన ముఖం మీద ముసుకు వేసుకున్నాడు. మేము మోషేలాంటి వాళ్ళం కాదు
Mivel tehát ilyen reménységünk van, nagy nyíltsággal szólunk.
13 ౧౩ మాకెంతో భరోసా ఉంది కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాము.
És nem úgy, mint Mózes, aki leplet borított arcára, hogy ne lássák Izrael fiai mulandó dicsőségének végét.
14 ౧౪ అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు.
De értelmük eltompult. Mert ugyanaz a lepel mind e mai napig ott van felfedetlenül az Ószövetség olvasásánál, mert az csak Krisztusban tűnik el.
15 ౧౫ అయితే ఇప్పటికీ వారు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని
Sőt mindmáig, amikor csak olvassák Mózest, lepel borul szívükre,
16 ౧౬ వారు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు.
de ha majd megtérnek az Úrhoz, akkor lehull a lepel.
17 ౧౭ ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.
Az Úr pedig Lélek, és ahol az Úr Lelke van, ott a szabadság.
18 ౧౮ మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
Mi pedig az Úr dicsőségét mindnyájan fedetlen arccal szemléljük, az Úr Lelke által ugyanarra a képre formálódunk, dicsőségről dicsőségre.