< 2 Chronicles 34 >
1 Josie was of eiyte yeer, whanne he bigan to regne, and he regnede in Jerusalem oon and thritti yeer.
౧యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు.
2 And he dide that, that was riytful in the siyt of the Lord; and yede in the waies of Dauid, his fadir, and bowide not to the riyt side nether to the left side.
౨అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు.
3 Forsothe in the eiytethe yeer of the rewme of his empire, whanne he was yit a child, he bigan to seke God of his fadir Dauid; and in the tweluethe yeer after that he bigan, he clenside Juda and Jerusalem fro hiy places, and wodis, and similacris, and grauun ymagis.
౩తన పాలన 8 వ సంవత్సరంలో తానింకా బాలుడుగా ఉండగానే అతడు తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. తన 12 వ ఏట అతడు ఉన్నత పూజాస్థలాలనూ అషేరా దేవతాస్తంభాలనూ పడగొట్టి, చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ తీసివేసి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేయడం మొదలు పెట్టాడు.
4 And thei destrieden bifor hym the auteris of Baalym, and thei destrieden the symylacris, that weren put aboue. Also he hewide doun the wodis, and grauun ymagis, and brak to smale gobetis; and scateride abrood `the smale gobetis on the birielis of hem, that weren wont to offre `to tho.
౪అతడు చూస్తుండగానే ప్రజలు బయలు దేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూప వేదికలను నరికివేశారు. అషేరా దేవత స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలనూ, పోతవిగ్రహాలనూ పగలగొట్టి పొడి చేసేశారు. వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు.
5 Ferthermore he brente the boonys of preestis in the auteris of idols, and he clenside Juda and Jerusalem.
౫ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేశాడు.
6 But also he destriede alle idols in the citees of Manasses, and of Effraym, and of Symeon, `til to Neptalym.
౬అలాగే అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టు పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు.
7 And whanne he hadde scateride the auteris, and hadde al to-broke in to gobetis the wodis, and grauun ymagis, and hadde destried alle templis of ydols fro al the lond of Israel, he turnede ayen in to Jerusalem.
౭అతడు బలిపీఠాలనూ అషేరా దేవత స్తంభాలనూ పడగొట్టి చెక్కిన విగ్రహాలను పొడి చేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న ధూపవేదికలను నరికి వేసి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
8 Therfor in the eiytenthe yeer of his rewme, whanne the lond and temple `of the Lord was clensid nowe, he sente Saphan, the sone of Helchie, and Masie, the prince of the citee, and Joa, the sone of Joachaz, chaunceler, that thei schulden reparele the hous `of his Lord God.
౮అతని పాలనలో 18 వ ఏట దేశాన్నీ మందిరాన్నీ బాగు చేయించిన తరువాత, అతడు అజల్యా కొడుకు షాఫానునూ పట్టణ అధిపతి మయశేయానునూ కార్యదర్శి యోహాహాజు కొడుకు యోవాహాజునూ తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి పంపాడు.
9 Whiche camen to Helchie, the grete preest; and whanne thei hadden take of hym the money, which was brouyt in to the hows of the Lord; and which monei the dekenes and porteris hadden gaderid of Manasses, and of Effraym, and of alle the residue men of Israel, and of al Juda and Beniamyn, and of the dwelleris of Jerusalem,
౯వారు ప్రధానయాజకుడైన హిల్కీయా దగ్గరికి వచ్చి, అంతకు ముందు దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశాల్లోని ఇశ్రాయేలు వారిలో మిగిలి ఉన్న వారందరి దగ్గరనుంచి, యూదా బెన్యామీనీయులందరి దగ్గరనుంచి ఆ డబ్బు సమకూర్చారు.
10 thei yauen it in the hondis of hem that weren souereyns of the werk men in the hows of the Lord, that thei schulden restore the temple, and reparele alle feble thingis.
౧౦వారు ఆ డబ్బుని యెహోవా మందిరపు పనిమీద ఉన్న తనిఖీదారులకు అప్పగించారు. వారు దాన్ని బాగు చేయడానికీ యూదా రాజులు నిర్లక్ష్యం చేసిన ఇళ్ళకు దూలాలను అమర్చడానికీ
11 And thei yauen that monei to the crafti men and masouns, for to bie stoonys hewid out of the `delues, ether quarreris, and trees to the ioynyngis of the bildyng, and to the coupling of housis, whiche the kingis of Juda hadden destried.
౧౧చెక్కిన రాళ్లను జోడించడానికీ మ్రానులు కొనడానికీ యెహోవా మందిరంలో పనిచేసేవారికీ శిల్పకారులకూ ఆ డబ్బులిచ్చారు.
12 Whiche men diden feithfuli alle thingis. Sotheli the souereyns of worcheris weren Jabath, and Abdie, of the sones of Merari; Zacarie, and Mosallam, of the sones of Caath; whiche hastiden the werk; alle weren dekenes, kunnynge to synge with orguns.
౧౨ఆ మనుష్యులు నమ్మకంగా ఆ పని చేశారు. వారి మీద తనిఖీదారులు ఎవరంటే, లేవీ గోత్రీకుల్లో మెరారీ వంశం వారైన యహతు, ఓబద్యా, కహాతు వంశీకులు జెకర్యా, మెషుల్లాము. పని నడిపించడానికి ఏర్పాటైన లేవీయులంతా వాయిద్యాలు వాయించడంలో ఆరితేరిన వారు.
13 Sotheli ouer them that baren birthuns to dyuerse vsis weren the scribis, and maistris of the dekenes, and porteris.
౧౩బరువులు మోసేవారి మీదా ప్రతిరకమైన పని జరిగించేవారిమీదా ఆ లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగానూ, పరిచారకులుగానూ, ద్వారపాలకులుగానూ నియమించారు.
14 And whanne thei baren out the monei, that was borun in to the temple of the Lord, Helchie, `the preest, foond the book of the lawe of the Lord bi the hond of Moises.
౧౪యెహోవా మందిరంలోకి తెచ్చిన డబ్బును బయటికి తీసుకు వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా అందించిన ధర్మశాస్త్రగ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది.
15 And he seide to Saphan, the writere, Y haue founde the book of the lawe in the hows of the Lord.
౧౫అప్పుడు హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడు.
16 And Helchie took to Saphan, and he bar in the book to the king; and telde to hym, and seide, Lo! alle thingis ben fillid, whiche thou hast youe in to the hondis of thi seruauntis.
౧౬షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుపోయి రాజుతో ఇలా అన్నాడు. “నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతా వారు చేస్తున్నారు.
17 Thei han wellyd togidere the siluere, which is foundun in the hous of the Lord; and it is youun to the souereyns of the crafti men, and makynge dyuerse werkis;
౧౭యెహోవా మందిరంలో దొరికిన డబ్బుని వారు పోగు చేసి తనిఖీదారుల చేతికీ పనివారి చేతికీ అప్పగించారు.”
18 ferthermore Helchie, the preest, took to me this book. And whanne he hadde rehersid this book in the presence of the kyng,
౧౮“యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు” అని లేఖకుడు షాఫాను, రాజుకు చెప్పి, దాన్ని రాజు ఎదుట చదివి వినిపించాడు.
19 and he hadde herd the wordis of the lawe, he to-rente hise clothis; and he comaundide to Helchie,
౧౯అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించినప్పుడు రాజు విని తన బట్టలు చించుకుని
20 and to Aichan, the sone of Saphan, and to Abdon, the sone of Mycha, and to Saphan, the scryuen, and to Asaie, the seruaunt of the kyng,
౨౦హిల్కీయాకూ, షాఫాను కొడుకు అహీకాముకూ, మీకా కొడుకు అబ్దోనుకూ, శాస్త్రి అయిన షాఫానుకూ, రాజు సేవకుడు అశాయాకూ ఇలా ఆజ్ఞాపించాడు,
21 and seide, Go ye, and preie the Lord for me, and for the resydue men of Israel and of Juda, on alle the wordis of this book, which is foundun. For greet veniaunce of the Lord hath droppid on vs, for oure fadris kepten not the wordis of the Lord, to do alle thingis that ben writun in this book.
౨౧“మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.”
22 Therfor Helchie yede, and thei that weren sent togidere of the king, to Olda, the prophetesse, the wijf of Sellum, sone of Thecuath, sone of Asra, kepere of clothis, which Olda dwellide in Jerusalem in the secounde warde; and thei spaken to hir the wordis, whiche we telden bifore.
౨౨అప్పుడు హిల్కీయా, రాజు నియమించినవారూ హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళారు. ఆమె షల్లూము భార్య. అతడు తిక్వా కొడుకు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె అప్పుడు యెరూషలేముకు చెందిన రెండవ భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.
23 And sche answeride to hem, The Lord God of Israel seith these thingis, Seie ye to the man, that sente you to me,
౨౩ఆమె వారితో ఇలా చెప్పింది. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఏంటంటే,
24 The Lord seith these thingis, Lo! Y schal brynge ynne yuels on this place, and on the dwelleris therof, and alle the cursyngis that ben writun in this book, which thei redden bifor the kyng of Juda.
౨౪‘వినండి, నేను ఈ స్థలం మీదికీ, దానిలో నివసించేవారి మీదికీ విపత్తు తీసుకు రాబోతున్నాను, యూదా రాజు ఎదుట చదివి వినిపించిన గ్రంథంలో రాసిన శాపాలన్నీ రప్పిస్తాను.
25 For thei han forsake me, and han sacrified to alien goddis, for to terre me to wrathfulnesse in alle the werkis of her hondis; therfor my strong veniaunce schal droppe on this place, and it schal not be quenchid.
౨౫వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’ అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి,
26 But speke ye thus to the kyng of Juda, that sente you to preye the Lord, The Lord God of Israel seith these thingis, For thou herdist the wordis of the book,
౨౬నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియచేసేదేంటంటే,
27 and thin herte is maad neisch, and thou art mekid in the siyt of the Lord of these thingis that ben seide ayens this place and the dwelleris of Jerusalem, and thou hast reuerensid my face, and hast to-rente thi clothis, and hast wepte bifor me; also Y haue herd thee, seith the Lord.
౨౭‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన.
28 For now Y schal gadere thee to thi fadris, and thou schalt be borun in to thi sepulcre in pees; and thin iyen schulen not se al yuel, which Y schal brynge yn on this place, and on the dwelleris therof. Therfor thei telden to the king alle thingis, whiche Olda hadde seid.
౨౮‘నేను నీ పూర్వీకుల దగ్గరికి నిన్ను చేరుస్తాను. నీవు ప్రశాంతంగా నీ సమాధికి చేరతావు. ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా నేను రప్పించే విపత్తు నీవు నీ కంటితో చూడవు.’” వారు రాజు దగ్గరికి ఈ సందేశం తీసికెళ్లారు.
29 And aftir that he hadde clepid togidere alle the eldere men of Juda and of Jerusalem,
౨౯రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు.
30 he stiede in to the hows of the Lord, and togidere alle the men of Juda, `and the dwelleris of Jerusalem, preestis, and dekenes, and al the puple, fro the leeste `til to the moste; to whiche herynge in the hows of the Lord, the kyng redde alle the wordis of the book.
౩౦రాజూ, యూదావారంతా, యెరూషలేము నివాసులంతా, యాజకులూ, లేవీయులూ, ప్రజల్లో గొప్పవారూ, సామాన్యులూ యెహోవా మందిరానికి వచ్చారు. ఆప్పుడు అతడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి చదివి వినిపించాడు.
31 And he stood in his trone, and smoot a boond of pees bifor the Lord, for to `go aftir hym, and to kepe the comaundementis, and witnessyngis, and iustifiyngis of hym, in al his herte and in al his soule; and to do tho thingis that weren writun in that book, which he hadde red.
౩౧రాజు తన స్థలం లో నిలబడి, ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలనూ శాసనాలనూ కట్టడలనూ పూర్ణమనస్సుతో పూర్ణహృదయంతో అనుసరిస్తూ ఈ గ్రంథంలో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు.
32 And he chargide greetli on this thing alle men, that weren foundun in Jerusalem and Beniamyn; and the dwellers of Jerusalem diden aftir the couenaunt of the Lord God of her fadris.
౩౨అతడు యెరూషలేములో ఉన్న వారందరినీ బెన్యామీనీయులందరినీ ఆ నిబంధనకు సమ్మతించేలా చేశాడు. యెరూషలేము నివాసులు తమ పూర్వీకుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించారు.
33 Therfor Josie dide awei alle abhomynaciouns fro alle the cuntreis of the sones of Israel; and he made alle men, that weren residue in Israel, to serue her Lord God; in alle the daies of his lijf thei yeden not awei fro the Lord God of her fadris.
౩౩యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రాంతాలన్నిటిలోనుంచి అసహ్యమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలీయులంతా తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బతికిన రోజులన్నీ వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు.