< Esther 2 >

1 Therfor whanne these thingis weren doon, aftir that the indignacioun of kyng Assuerus was coold, he bithouyte of Vasthi, and what thingis sche hadde do, ethir what thingis sche suffride.
ఈ విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తరవాత అతడు వష్తిని గురించీ ఆమె చేసిన పని గురించీ ఆలోచించాడు. ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు.
2 And the children and the mynystris of the kyng seiden to `the kyng, Damyselis, virgyns `and faire, be souyt to the kyng; and `men ben sent,
రాజు కొలువులో ఉండే యువకులు ఇలా అన్నారు. “రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి.
3 that schulen biholde bi alle prouinces damesels faire and virgyns; and brynge thei hem to the citee Susa, and bitake thei in to the hows of wymmen, vndur the hond of Egei, the onest seruaunt and chast, which is the souereyn and kepere of the kyngis wymmen; and take the damesels ournement of wymmen, and other thingis nedeful to vsis.
లావణ్యవతులైన కన్యలను సమకూర్చడం కోసం రాజు తన పరిపాలన కింద ఉన్న సంస్థానాలన్నిటిలో అధికారులను నియమించాలి. అలా తీసుకు వచ్చిన కన్యలను షూషను రాజభవనంలోని రాణివాసం పర్యవేక్షకుడు హేగే ఆధీనంలో ఉంచాలి. అతడు వారికి సౌందర్య సాధనాలను ఇవ్వాలి.
4 And which euer damesele among alle plesith the iyen of the kyng, regne sche for Vasti. The word pleside the kyng; and he comaundide to be don so, as thei counceliden.
ఆ కన్యల్లో ఎవరు రాజుకు నచ్చుతారో ఆమె వష్తికి బదులుగా రాణి అవుతుంది.” ఈ మాట రాజుకు నచ్చింది. అతడు అ విధంగా చేశాడు.
5 Forsothe a man, a Jew, was in the citee Susa, Mardoche bi name, the sone of Jair, sone of Semei, sone of Cys, of the generacioun of Gemyny;
షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు.
6 that was translatid fro Jerusalem in that tyme, wherynne Nabugodonosor, kyng of Babiloyne, hadde translatid Jechonye, kyng of Juda;
బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు.
7 which Mardoche was the nurschere of Edissa, the douyter of his brothir, which douytir was clepid Hester bi anothir name, and sche hadde lost bothe fadir and modir; sche was ful fair, and semeli of face; and whanne hir fadir and modir weren deed, Mardoche `purchaside hir in to a douytir to hymsilf.
అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు.
8 And whanne the comaundement of the kyng was ofte pupplischid, and bi his comaundement many faire virgyns weren brouyt to Susa, and weren bitakun to Egey, the onest seruaunt and chast, also Hester among othere damesels was bytakun to hym, that sche schulde be kept in the noumbre of wymmen.
రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు.
9 And sche pleside hym, and foond grace in his siyt, that he hastide the ournement of wymmen, and bitook to hir her partis, and seuene the faireste damesels of the kyngis hows; and he ournede and araiede bothe hir and damesels suynge hir feet.
ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు.
10 And `sche nolde schewe to hym hir puple and hir cuntrei; for Mardoche hadde comaundid to hir, that in al maner sche schulde be stille of this thing.
౧౦తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు.
11 And he walkide ech dai bifor the porche of the dore, in which the chosun virgyns weren kept, and he dide the cure of the helthe of Hester, and wolde wite, what bifelde to hyr.
౧౧ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.
12 And whanne the tyme of alle damesels bi ordre was comun, that thei schulden entre to the kyng, whanne alle thingis weren fillid that perteyneden to wymmens atire, the tweluethe monethe was turned; so oneli that thei weren anoyntid with oile of `myrte tre bi sixe monethis, and bi othere sixe monethis `thei vsiden summe pymentis and swete-smellynge oynementis.
౧౨ఆరు నెలల పాటు గోపరస తైలంతో, ఆరు నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం పన్నెండు నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికీ వస్తుంది.
13 And thei entriden to the kyng, and what euer thing perteynynge to ournement thei axiden, thei token; and thei weren araied as it pleside hem, and passiden fro the chaumbre of wymmen to the kyngis bed.
౧౩రాణివాసం నుండి రాజు మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు.
14 And sche that hadde entrid in the euentid, yede out in the morwetid; and fro thennus thei weren led forth in to the secounde housis, that weren vndur the hond of Sagazi, onest seruaunt and chast, that was gouernour of the kyngis concubyns; and sche hadde not power to go ayen more to the kyng, no but the kyng wolde, `and had comaundid hir to come bi name.
౧౪సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడుగత్తెల బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్లకూడదు.
15 Sotheli whanne the tyme was turned aboute bi ordre, the dai neiyede, wherynne Hester, the douyter of Abiahel, brother of Mardoche, `whom he hadde purchasid in to a douyter to hym silf, ouyte entre to the kyng; and sche axide not wymmenus ournement, but what euer thingis Egei, the onest seruaunt and chast, kepere of virgyns, wolde, he yaf these thingis to hir to ournement; for sche was ful schapli, and of fairnesse that may not liytli be bileuyd, and sche semyde graciouse and amyable to the iyen of alle men.
౧౫మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది.
16 Therfor sche was lad to the bed of kyng Assuerus, in the tenthe monethe, which is clepid Cebeth, in the seuenthe yeer of his rewme.
౧౬ఆ విధంగా అహష్వేరోషు రాజు పరిపాలనలో ఏడో సంవత్సరం టెబేతు అనే పదో నెలలో ఎస్తేరు రాజ మందిరంలో అతని దగ్గరికి పోయింది.
17 And the kyng feruentli louyde hir more than alle wymmen, and sche hadde grace and mercy bifor hym ouer alle wymmen; and he settide the diademe of rewme `on hir heed, and he made hir to regne in the stide of Vasthi.
౧౭స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. కన్యలందరి కంటే అతనికి ఎస్తేరు అంటే ఇష్టం, ఆకాంక్ష కలిగాయి. అతడు రాజ్యకిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించాడు.
18 And he comaundide a ful worschipful feeste to be maad redi to alle hise princes and seruauntis, for the ioynyng togidere and the weddyngis of Hester; and he yaf rest to alle prouynces, and yaf yiftis aftir the worschipful doyng of a prynce.
౧౮అప్పుడు రాజు తన అధికారులందరికి, సేవకులందరికి ఎస్తేరు విషయమై గొప్పవిందు చేయించాడు. సంస్థానాలన్నిటిలో సెలవు ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు.
19 And whanne virgyns weren souyt also the secounde tyme, and weren gaderid togidere, Mardochee dwellide at the yate of the kyng.
౧౯రెండవసారి కన్యలను సమకూర్చినప్పుడు మొర్దెకై రాజు భవనం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.
20 Hester hadde not yit schewid hir cuntrei and puple, bi comaundement of hym; for whi what euer thing he comaundide, Hester kepte, and sche dide so alle thingis, as sche was wont in that tyme, in which he nurschide hir a litil child.
౨౦ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్న కాలంలో చేసినట్టే ఇప్పుడు కూడా అతని మాటకు లోబడుతూ ఉంది. అందువలన మొర్దెకై తనకు ఆజ్ఞాపించినట్టే ఎస్తేరు తన జాతి ఏమిటో తన వంశమేమిటో ఎవరికీ చెప్పలేదు.
21 Therfor in that tyme, wherynne Mardochee dwellide at the `yate of the king, Bagathan and Thares, twei seruauntis of the kyng, weren wrothe, `that weren porteris, and saten in the first threisfold of the paleis; and thei wolden rise ayens the kyng, and sle hym.
౨౧ఆ రోజుల్లో మొర్దెకై రాజ భవన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజుగారి కొలువులో ఉన్న ఇద్దరు నపుంసకులు బిగ్తాను, తెరెషు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతనిని చంపాలని కుట్ర పన్నారు.
22 Which thing was not hid fro Mardochee, and anoon he telde to the queen Hester, and sche to the kyng, bi the name of Mardochee, that hadde teld the thing to hir.
౨౨ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరురాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది.
23 It was souyt, and it was foundun, and ech of hem was hangid in a iebat; and `it was sent to storyes, and was bitakun to bookis of yeeris, `bifor the kyng.
౨౩ఈ సంగతిని గూర్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరినీ ఒక చెట్టుకు ఉరి తీశారు. రాజు సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు.

< Esther 2 >