< 撒迦利亞書 9 >

1 耶和華的默示應驗在哈得拉地大馬士革 -世人和以色列各支派的眼目都仰望耶和華-
హద్రాకు దేశాన్ని గూర్చి, దమస్కు పట్టణాన్ని గూర్చి వచ్చిన దేవోక్తి.
2 和靠近的哈馬,並泰爾、西頓; 因為這二城的人大有智慧。
ఎందుకంటే యెహోవా మనుషులందరినీ ఇశ్రాయేలీ గోత్రాల వారినందరినీ లక్ష్యపెట్టేవాడు గనుక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి ఆ సందేశం వచ్చింది.
3 泰爾為自己修築保障, 積蓄銀子如塵沙, 堆起精金如街上的泥土。
తూరు పట్టణం వారు ప్రాకారాలు గల కోట కట్టుకుని, ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారంగా బంగారాన్ని సమకూర్చుకున్నారు.
4 主必趕出她, 打敗她海上的權利; 她必被火燒滅。
సముద్రంలో ఉన్న దాని బలాన్ని యెహోవా నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిస్తాడు. అది తగలబడి పోతుంది.
5 亞實基倫看見必懼怕; 迦薩看見甚痛苦; 以革倫因失了盼望蒙羞。 迦薩必不再有君王; 亞實基倫也不再有居民。
అష్కెలోను దాన్ని చూసి బెదిరిపోతుంది. గాజా దాన్ని చూసి వణికిపోతుంది. ఎక్రోను పట్టణం తాను దేనిపై నమ్మకం పెట్టుకుందో దాని పరువు పోవడం చూసి భీతిల్లుతుంది. గాజాలో ఉన్న రాజు అంతరిస్తాడు. అష్కెలోను నిర్జనమై పోతుంది.
6 私生子必住在亞實突; 我必除滅非利士人的驕傲。
అష్డోదులో సంకర జాతి వారు కాపురం ఉంటారు. ఫిలిష్తీయుల గర్వ కారణాన్ని నేను నాశనం చేస్తాను.
7 我必除去他口中帶血之肉 和牙齒內可憎之物。 他必作為餘剩的人歸與我們的上帝, 必在猶大像族長; 以革倫人必如耶布斯人。
వారి నోటి నుండి రక్తాన్ని, వారు తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసాన్ని నేను తీసివేస్తాను. అప్పుడు వారు మన దేవునికి యూదా గోత్రం వలె శేషంగా ఉంటారు. ఎక్రోను వారు కూడా యెబూసీయుల్లాగా ఉంటారు.
8 我必在我家的四圍安營, 使敵軍不得任意往來, 暴虐的人也不再經過, 因為我親眼看顧我的家。
నేను కన్నులారా చూశాను గనక బాధించేవారు ఇకపై సంచరించకుండా, తిరుగులాడే సైన్యాలు నా మందిరం మీదికి రాకుండా దాన్ని కాపాడుకోడానికి నేనొక సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను.
9 錫安的民哪,應當大大喜樂; 耶路撒冷的民哪,應當歡呼。 看哪,你的王來到你這裏! 他是公義的,並且施行拯救, 謙謙和和地騎着驢, 就是騎着驢的駒子。
సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.
10 我必除滅以法蓮的戰車 和耶路撒冷的戰馬; 爭戰的弓也必除滅。 他必向列國講和平; 他的權柄必從這海管到那海, 從大河管到地極。
౧౦నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు.
11 錫安哪,我因與你立約的血, 將你中間被擄而囚的人從無水的坑中釋放出來。
౧౧నీవు చేసిన నిబంధన రక్తాన్ని బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను.
12 你們被囚而有指望的人都要轉回保障。 我今日說明,我必加倍賜福給你們。
౧౨బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గల మీరంతా మీ కోటలో మళ్ళీ ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను.
13 我拿猶大作上弦的弓; 我拿以法蓮為張弓的箭。 錫安哪,我要激發你的眾子, 攻擊希臘的眾子,使你如勇士的刀。
౧౩యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.
14 耶和華必顯現在他們以上; 他的箭必射出像閃電。 主耶和華必吹角, 乘南方的旋風而行。
౧౪యెహోవా వారికి పైగా ప్రత్యక్షమౌతాడు. ఆయన బాణాలు మెరుపువలె వెలువడుతాయి. ప్రభువగు యెహోవా శంఖం పూరిస్తూ దక్షిణ దిక్కునుండి వచ్చే గొప్ప సుడిగాలితో బయలు దేరుతాడు.
15 萬軍之耶和華必保護他們; 他們必吞滅仇敵,踐踏彈石。 他們必喝血吶喊,猶如飲酒; 他們必像盛滿血的碗, 又像壇的四角滿了血。
౧౫సేనల ప్రభువు యెహోవా వారిని కాపాడుతాడు గనక వారు భక్షిస్తూ వడిసెలరాళ్లను అణగ దొక్కుతూ వస్తారు. ద్రాక్షారసం తాగుతూ, తాగడం మూలంగా సింహనాదాలు చేస్తూ, బలిపీఠపు మూలల్లో పెట్టి ఉన్న పాత్రలు రక్తంతో నిండినట్లు నిండిపోతారు.
16 當那日,耶和華-他們的上帝 必看他的民如群羊,拯救他們; 因為他們必像冠冕上的寶石, 高舉在他的地以上。
౧౬నా ప్రజలు యెహోవా దేశంలో కిరీటంలోని రత్నాల్లా ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించినట్టు వారి దేవుడైన యెహోవా ఆ దినాన వారిని రక్షిస్తాడు.
17 他的恩慈何等大! 他的榮美何其盛! 五穀健壯少男; 新酒培養處女。
౧౭అది ఎంత రమ్యంగా మేలుగా ఉంటుంది! ధాన్యం చేత యువకులు, కొత్త ద్రాక్షారసం చేత కన్యలు పుష్టిగా ఉంటారు.

< 撒迦利亞書 9 >