< 撒迦利亞書 10 >

1 當春雨的時候, 你們要向發閃電的耶和華求雨。 他必為眾人降下甘霖, 使田園生長菜蔬。
కడవరి వాన కాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఆకాశంలో మెరుపులు పుట్టేలా చేసేవాడు యెహోవాయే. ఆయన ప్రతి ఒక్కరి పొలంలో పంటలు పెరిగేలా సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడు.
2 因為,家神所言的是虛空; 卜士所見的是虛假; 做夢者所說的是假夢。 他們白白地安慰人, 所以眾人如羊流離, 因無牧人就受苦。
గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.
3 我的怒氣向牧人發作; 我必懲罰公山羊; 因我-萬軍之耶和華 眷顧自己的羊群,就是猶大家, 必使他們如駿馬在陣上。
“కాపరులపై నా కోపాగ్ని మండుతున్నది. మందలో మేకలను నేను శిక్షిస్తాను” అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు. ఆయన తన మందయైన యూదా ప్రజలను దర్శించి వాళ్ళను తన యుద్ధాశ్వాలుగా మలుచుకుంటాడు.
4 房角石、釘子、爭戰的弓, 和一切掌權的都從他而出。
ఆ వంశంలో నుంచి మూలరాయి పుడుతుంది. గుడారపు మేకు, యుద్ధ ధనుస్సు వారి నుండి పుడతాయి. యుద్ధ నేర్పు గలవాడు వారిలో నుండి పుడతాడు.
5 他們必如勇士在陣上 將仇敵踐踏在街上的泥土中。 他們必爭戰,因為耶和華與他們同在; 騎馬的也必羞愧。
వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.
6 我要堅固猶大家,拯救約瑟家, 要領他們歸回。 我要憐恤他們; 他們必像未曾棄絕的一樣, 都因我是耶和華-他們的上帝, 我必應允他們的禱告。
నేను యూదా ప్రజలను బలపరుస్తాను. యోసేపు సంతానానికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇస్తాను. నేను వారిపట్ల కనికరం చూపుతాను. నేను వారి ప్రార్థన ఆలకిస్తాను కనుక నేను వాళ్ళను నిరాకరించిన విషయం మరచిపోతారు. నేను వారి దేవుడనైన యెహోవాను,
7 以法蓮人必如勇士; 他們心中暢快如同喝酒; 他們的兒女必看見而快活; 他們的心必因耶和華喜樂。
ఎఫ్రాయిము ప్రజలు మహా బలవంతులు అవుతారు. ద్రాక్షారసం తాగిన వాళ్ళు సంతోషం పొందినట్టు వాళ్ళు తమ హృదయాల్లో ఆనందిస్తారు. అది చూసిన వారి సంతానం ఆనందపడతారు. వాళ్ళు యెహోవా చేసిన దాన్నిబట్టి హృదయపూర్వకంగా సంతోషిస్తారు.
8 我要發嘶聲,聚集他們, 因我已經救贖他們。 他們的人數必加增, 如從前加增一樣。
నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు.
9 我雖然播散他們在列國中, 他們必在遠方記念我。 他們與兒女都必存活,且得歸回。
నేను వాళ్ళను ఇతర దేశాలకు చెదరగొట్టినప్పటికీ వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసికొంటారు. వారూ, వారి సంతానం సజీవులుగా తిరిగి చేరుకుంటారు.
10 我必再領他們出埃及地, 招聚他們出亞述, 領他們到基列和黎巴嫩; 這地尚且不夠他們居住。
౧౦నేను వాళ్ళను ఐగుప్తు దేశం నుండి తిరిగి తీసుకు వస్తాను. అష్షూరు దేశం నుండి వాళ్ళను సమకూరుస్తాను. గిలాదు, లెబానోను దేశాల్లో ఎక్కడా స్థలం చాలనంత విస్తారమైన జనాంగాన్ని తోడుకుని వస్తాను.
11 耶和華必經過苦海,擊打海浪, 使尼羅河的深處都枯乾。 亞述的驕傲必致卑微; 埃及的權柄必然滅沒。
౧౧వాళ్ళు దుఃఖసముద్రం దాటవలసి వచ్చినప్పుడు సముద్రపు అలలు అణగారి పోతాయి. నైలునదిలోని లోతైన స్థలాలను ఆయన ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరీయుల గర్వం అణిగి పోతుంది, ఐగుప్తీయుల నుండి రాజరికం తొలిగి పోతుంది.
12 我必使他們倚靠我,得以堅固; 一舉一動必奉我的名。 這是耶和華說的。
౧౨నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.

< 撒迦利亞書 10 >