< Psalms 9 >

1 Fún adarí orin. Ní ti ohun orin. “Ní ti ikú ọmọ.” Saamu ti Dafidi. Èmi ó yìn ọ́, Olúwa, pẹ̀lú gbogbo ọkàn mi; èmi ó sọ ti ìyanu rẹ gbogbo.
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం. హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.
2 Inú mi yóò dùn, èmi yóò sì yọ̀ nínú rẹ; èmi ó kọrin ìyìn sí orúkọ rẹ, Ìwọ Ọ̀gá-Ògo jùlọ.
మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.
3 Àwọn ọ̀tá mi pẹ̀yìndà; wọ́n kọsẹ̀ wọn sì ṣègbé níwájú rẹ.
నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు.
4 Nítorí ìwọ ti di òtítọ́ àti ọ̀ràn mi mú; ìwọ ti jókòó lórí ìtẹ́ rẹ, láti ṣe ìdájọ́ òdodo.
ఎందుకంటే, నా న్యాయయుక్తమైన పనిని నువ్వు సమర్థించావు. నీ సింహాసనం మీద ఒక నీతిగల న్యాయమూర్తిగా నువ్వు కూర్చున్నావు.
5 Ìwọ ti bá orílẹ̀-èdè wí, Ìwọ sì ti pa ẹni búburú run; Ìwọ ti yọ orúkọ wọn kúrò láé àti láéláé.
నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు.
6 Ìparun àìlópin ti borí àwọn ọ̀tá, ìwọ ti fa àwọn ìlú wọn tu; àní ìrántí wọn sì ti ṣègbé.
తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.
7 Olúwa jẹ ọba títí láé; ó ti gbé ìtẹ́ rẹ̀ kalẹ̀ fún ìdájọ́.
కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు.
8 Òun yóò sì ṣe ìdájọ́ ayé ní òdodo; yóò ṣe àkóso ènìyàn pẹ̀lú òdodo.
యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు.
9 Olúwa ni ààbò fún àwọn tí a ni lára, ibi ìsádi ní àkókò ìpọ́njú.
పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.
10 Àwọn tí ó mọ orúkọ rẹ yóò gbẹ́kẹ̀lé ọ, nítorí, Olúwa, kò kọ àwọn tó ń wá a sílẹ̀.
౧౦యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.
11 Kọ orin ìyìn sí Olúwa, tí o ń jẹ ọba ní Sioni; kéde láàrín àwọn orílẹ̀-èdè, ohun tí ó ṣe.
౧౧సీయోనులో ఏలుతున్న యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన చేసిన వాటిని జాతులకు చెప్పండి.
12 Nítorí ẹni tí ó ń gbẹ̀san ẹ̀jẹ̀ rántí; òun kò kọ ẹkún àwọn tí a pọ́n lójú.
౧౨ఎందుకంటే, రక్తపాతానికి శాస్తి చేసే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. పీడిత ప్రజల కేకలు ఆయన మరచిపోడు.
13 Olúwa, wo bí àwọn ọ̀tá ṣe ń ṣe inúnibíni sí mi! Ṣàánú, kí o sì gbé mí sókè kúrò ní ẹnu-ọ̀nà ikú,
౧౩యెహోవా, నా మీద దయ చూపించు. నన్ను ద్వేషించేవాళ్ళు నన్ను ఎలా పీడిస్తున్నారో చూడు. మరణద్వారం నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నువ్వే.
14 kí èmi kí ó lè sọ ti ìyìn rẹ ni ẹnu-ọ̀nà àwọn ọmọbìnrin Sioni àti láti máa yọ̀ nínú ìgbàlà rẹ.
౧౪నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను!
15 Àwọn orílẹ̀-èdè ti jì sí kòtò tí wọn ti gbẹ́; ẹsẹ̀ wọn ni àwọ̀n tí wọ́n dẹ sílẹ̀ kọ́.
౧౫జాతులు తాము తవ్విన గుంటలో తామే పడిపోయారు. తాము రహస్యంగా పన్నిన వలలో వారి కాళ్ళే చిక్కాయి.
16 A mọ Olúwa nípa òdodo rẹ̀; àwọn ènìyàn búburú ni a dẹ́kun mú nípa iṣẹ́ ọwọ́ wọn.
౧౬యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. (సెలా)
17 Àwọn ènìyàn búburú ni a ó dà sí isà òkú, àti gbogbo orílẹ̀-èdè tí ó gbàgbé Ọlọ́run. (Sheol h7585)
౧౭దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి. (Sheol h7585)
18 Ṣùgbọ́n àwọn aláìní ni a kò ní gbàgbé láéláé, ìrètí àwọn ti ó tálákà ni a kì yóò gbàgbé láéláé.
౧౮అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.
19 Dìde, Olúwa, má ṣe jẹ́ kí ènìyàn borí; jẹ́ kí a ṣe ìdájọ́ àwọn orílẹ̀-èdè ni iwájú rẹ.
౧౯యెహోవా లేచి రా, మనుషులకు మా మీద జయం కలగనివ్వకు. నీ సముఖంలో జాతులకు తీర్పు వస్తుంది గాక.
20 Lù wọ́n pẹ̀lú ìpayà, Olúwa; jẹ́ kí àwọn orílẹ̀-èdè mọ̀ pé ènìyàn lásán ni wọ́n. (Sela)
౨౦యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. (సెలా)

< Psalms 9 >