< Psalms 88 >

1 Orin. Saamu ti àwọn ọmọ Kora. Fún adarí orin. Gẹ́gẹ́ bí ti mahalati leannoti. Maskili ti Hemani ará Esra. Olúwa, Ọlọ́run tí ó gbà mí là, ní ọ̀sán àti ní òru, mo kígbe sókè sí Ọ.
ఒక పాట, కోరహు వారసుల కీర్తన. ప్రధాన సంగీతకారుని కోసం, మహలతు లయన్నోతు అనే రాగంతో పాడేది. ఎజ్రా వంశం వాడైన హేమాను మస్కిల్ (దైవ ధ్యానం) యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను.
2 Jẹ́ kí àdúrà mi kí ó wá sí iwájú rẹ; dẹ etí rẹ sí igbe mi.
నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు.
3 Nítorí ọkàn mi kún fún ìpọ́njú ọkàn mi sì súnmọ́ isà òkú. (Sheol h7585)
నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది. (Sheol h7585)
4 A kà mí mọ́ àwọn tí wọ́n lọ sí ọ̀gbun ilẹ̀ èmi dàbí ọkùnrin tí kò ni agbára.
సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను.
5 A yà mí sọ́tọ̀ pẹ̀lú àwọn òkú bí ẹni tí a pa tí ó dùbúlẹ̀ ní ipò ikú, ẹni tí ìwọ kò rántí mọ́, ẹni tí a gé kúrò lára àwọn tí ìwọ ń tọ́jú.
చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
6 Ìwọ tí ó fi mí sí kòtò jíjìn, ní ibi ọ̀gbun tó ṣókùnkùn.
నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు.
7 Ìbínú rẹ ṣubú lé mi gidigidi; ìwọ ti fi àwọn ìjì rẹ borí mi.
నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. (సెలా)
8 Ìwọ tí gba ọ̀rẹ́ mi tí ó súnmọ́ mi kúrò lọ́wọ́ mi ìwọ sì sọ mi di ìríra sí wọn. A há mi mọ́, èmi kò sì le è jáde;
నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను.
9 ojú mi káàánú nítorí ìpọ́njú. Mo kígbe pè ọ́, Olúwa, ní gbogbo ọjọ́; mo na ọwọ́ mi jáde sí ọ.
బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను.
10 Ìwọ ó fi iṣẹ́ ìyanu rẹ hàn fún òkú bi? Àwọn òkú yóò ha dìde láti yìn ọ́ bí?
౧౦మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? (సెలా)
11 A ó ha fi ìṣeun ìfẹ́ rẹ hàn ní ibojì bí, tàbí òtítọ́ rẹ ní ipò ìparun?
౧౧సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా?
12 A ha lè mọ iṣẹ́ ìyanu rẹ ní òkùnkùn bí àti òdodo rẹ ní ilẹ̀ ìgbàgbé?
౧౨చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా?
13 Ṣùgbọ́n mo kígbe sí ọ fún ìrànlọ́wọ́, Olúwa; ní òwúrọ̀ ni àdúrà mí wá sọ́dọ̀ rẹ.
౧౩అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది.
14 Olúwa, èéṣe tí ìwọ fi kọ̀ mí tí ìwọ fi ojú rẹ pamọ́ fún mi?
౧౪యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు?
15 Láti ìgbà èwe mi, ìṣẹ́ ń ṣẹ́ mi, èmi múra àti kú; nígbà tí ẹ̀rù rẹ bá ń bà mí, èmi di gbére-gbère.
౧౫చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి.
16 Ìbínú rẹ ti kọjá lára mi; ìbẹ̀rù rẹ ti gé mi kúrò.
౧౬నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి.
17 Ní gbogbo ọjọ́ ni wọn yí mi ká bí ìkún omi; wọ́n mù mí pátápátá.
౧౭నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి. నన్ను కమ్మేశాయి.
18 Ìwọ ti mú ọ̀rẹ́ àti olùfẹ́ mi kúrò lọ́dọ̀ mi; òkùnkùn sì jẹ́ ọ̀rẹ́ tímọ́tímọ́ mi.
౧౮నా మిత్రులనూ బంధువులనూ నువ్వు నాకు దూరం చేశావు. చీకటి ఒక్కటే నా చుట్టం.

< Psalms 88 >