< Proverbs 16 >
1 Ti ènìyàn ni ìgbèrò inú ọkàn ṣùgbọ́n láti ọ̀dọ̀ Olúwa ni ìdáhùn ahọ́n ti ń wá.
౧మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.
2 Gbogbo ọ̀nà ènìyàn ni ó dàbí i pé ó dára lójú ara rẹ̀ ṣùgbọ́n Olúwa ló ń díwọ̀n èrò inú ọkàn.
౨ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.
3 Fi ohun gbogbo tí o bá ṣe lé Olúwa lọ́wọ́, èrò rẹ yóò sì ṣe é ṣe.
౩నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.
4 Olúwa ti ṣe ohun gbogbo láti mú kí ó rí bí ó ṣe fẹ́ kódà ènìyàn búburú fún ọjọ́ ìpọ́njú.
౪యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.
5 Olúwa kórìíra gbogbo ẹni tí ń gbéraga lọ́kàn rẹ̀ mọ èyí dájú pé wọn kò ní lọ láìjìyà.
౫హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.
6 Nípasẹ̀ ìfẹ́ àti òtítọ́ a ṣe ètùtù ẹ̀ṣẹ̀ nípasẹ̀ ìbẹ̀rù Olúwa ènìyàn sá fún ibi.
౬నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.
7 Nígbà tí ọ̀nà ènìyàn bá tẹ́ Olúwa lọ́rùn, yóò mú kí àwọn ọ̀tá rẹ̀ gàn án bá a gbé ní àlàáfíà.
౭ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.
8 Ó sàn kí ó kéré pẹ̀lú òdodo ju èrè púpọ̀ pẹ̀lú èrú lọ.
౮అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం.
9 Ènìyàn a máa pète ọ̀nà ara rẹ̀ lọ́kàn an rẹ̀ ṣùgbọ́n Olúwa ní í pinnu ìgbésẹ̀ rẹ̀.
౯ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.
10 Ètè ọba a máa sọ̀rọ̀ nípa àṣẹ sí i ẹnu rẹ̀ kò gbọdọ̀ ṣèké.
౧౦రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు.
11 Òdínwọ̀n àti òsùwọ̀n òtítọ́ wá láti ọ̀dọ̀ Olúwa; gbogbo wíwúwo àpò jẹ́ láti ọwọ́ rẹ̀.
౧౧న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు.
12 Àwọn ọba kórìíra ìwà àìtọ́ nítorí òdodo ní í fi ìdí ìtẹ́ múlẹ̀.
౧౨రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే.
13 Àwọn ọba ní inú dídùn sí ètè tí ń ṣọ òtítọ́, wọ́n sì fẹ́ ẹni tí ń sọ̀rọ̀ òtítọ́.
౧౩సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.
14 Ìránṣẹ́ ikú ni ìbínú ọba jẹ́ ṣùgbọ́n ọlọ́gbọ́n ènìyàn yóò tù ú nínú.
౧౪రాజుకు కోపం వస్తే మరణం దాపురిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఆ కోపం చల్లారేలా చేస్తాడు.
15 Nígbà tí ojú ọba bá túká, ó túmọ̀ sí ìyè; ojúrere rẹ̀ dàbí i ṣíṣú òjò ní ìgbà òjò.
౧౫రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది.
16 Ó ti dára tó láti ní ọgbọ́n ju wúrà lọ àti láti yan òye dípò o fàdákà!
౧౬విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.
17 Òpópó ọ̀nà àwọn ẹni dídúró ṣinṣin yàgò fún ibi, ẹni tí ó ṣọ́ ọ̀nà rẹ̀, ṣọ́ ẹnu ara rẹ̀.
౧౭నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు.
18 Ìgbéraga ní í ṣáájú ìparun, agídí ọkàn ní í ṣáájú ìṣubú.
౧౮ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
19 Ó sàn láti jẹ́ onírẹ̀lẹ̀ ọkàn láàrín àwọn olùpọ́njú jù láti máa pín ìpín pẹ̀lú àwọn agbéraga.
౧౯దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
20 Ẹnikẹ́ni tí ó bá tẹ̀lé ẹ̀kọ́ yóò rí ìre, ìbùkún sì ni fún ẹni tí ó gbẹ́kẹ̀lé Olúwa.
౨౦ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.
21 Àwọn tí ó gbọ́n nínú ọkàn là ń pè ní olóye ọ̀rọ̀ ìtura sì ń mú ẹ̀kọ́ gbèrú.
౨౧హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి.
22 Òye jẹ́ orísun ìyè fún àwọn tí ó ní i, ṣùgbọ́n ìwà òmùgọ̀ ń kó ìyà jẹ aláìgbọ́n.
౨౨తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.
23 Ọkàn ọlọ́gbọ́n ènìyàn a máa ṣọ́ ẹnu rẹ̀ ètè rẹ̀ sì ń mú kí ẹ̀kọ́ dàgbà.
౨౩జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.
24 Ọ̀rọ̀ ìtura dàbí afárá oyin ó dùn fún ọkàn, ó sì fi ìlera fún egungun.
౨౪మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.
25 Ọ̀nà kan tí ó dàbí i pé ó dára lójú ènìyàn ṣùgbọ́n ní ìgbẹ̀yìn a ṣokùnfà ikú.
౨౫ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.
26 Ọkàn alágbàṣe ń ṣiṣẹ́ fún ara rẹ̀; nítorí ebi rẹ̀ mú kí ó máa ṣiṣẹ́ lọ.
౨౬కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.
27 Ènìyàn búburú ń pète ọ̀rọ̀ rẹ̀ sì dàbí i iná tí ń jóni.
౨౭దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది.
28 Aláyídáyidà ènìyàn dá ìjà sílẹ̀ olófòófó a sì máa pín ọ̀rẹ́ kòríkòsùn ní yà.
౨౮మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.
29 Oníjàgídíjàgan ènìyàn tan aládùúgbò rẹ̀ ó sì mú un sọ̀kalẹ̀ lọ sí ọ̀nà tí kò dára.
౨౯దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.
30 Ẹni tí ń ṣẹ́jú ń pètekéte; ẹni tí ó ṣu ẹnu jọ ń pète aburú.
౩౦కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు.
31 Adé ògo ni ewú orí jẹ́, ìgbé ayé òdodo ní í mú ni dé bẹ̀.
౩౧నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.
32 Ó sàn láti jẹ́ onísùúrù ju ajagun ènìyàn lọ, ẹni tí ó pa ìbínú mọ́ra ju ajagun ṣẹ́gun ìlú lọ.
౩౨పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
33 A ṣẹ́ kèké si ìṣẹ́po aṣọ, ṣùgbọ́n gbogbo ìdájọ́ rẹ̀ wá láti ọ̀dọ̀ Olúwa.
౩౩చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.