< Numbers 16 >

1 Kora ọmọ Isari, ọmọ Kohati, ọmọ Lefi àwọn ọmọ Reubeni: Datani àti Abiramu, àwọn ọmọ Eliabu, àti Oni ọmọ Peleti mú ènìyàn mọ́ra.
లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి
2 Wọ́n sì dìde sí Mose, pẹ̀lú àádọ́ta lé nígba ọkùnrin nínú àwọn ọmọ Israẹli, ìjòyè nínú ìjọ, àwọn olórúkọ nínú àjọ, àwọn ọkùnrin olókìkí.
ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి
3 Wọ́n kó ara wọn jọ láti tako Mose àti Aaroni, wọ́n sọ fún wọn pé, “Ẹ ti kọjá ààyè yín, ó tó gẹ́ẹ́! Mímọ́ ni gbogbo ènìyàn, kò sí ẹni tí kò mọ́ láàrín wọn, Olúwa sì wà pẹ̀lú wọn, nítorí kí wá ni ẹ̀yin ṣe gbé ara yín ga ju ìjọ ènìyàn Olúwa lọ?”
మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు.
4 Nígbà tí Mose gbọ́ èyí, ó dojúbolẹ̀,
మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,
5 Ó sì sọ fún Kora àti gbogbo ẹgbẹ́ rẹ̀ pé, “Ní ọ̀la ni Olúwa yóò fi ẹni tí í ṣe tirẹ̀ àti ẹni tó mọ́ hàn, yóò sì mú kí ẹni náà súnmọ́ òun. Ẹni tí ó bá yàn ni yóò mú kí ó súnmọ́ òun.
“ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.
6 Kí Kora àti gbogbo ẹgbẹ́ rẹ̀ ṣe èyí, ẹ mú àwo tùràrí.
కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.
7 Kí ẹ sì fi iná àti tùràrí sínú rẹ̀ lọ́la níwájú Olúwa, yóò sì ṣe, ọkùnrin tí Olúwa bá yàn òun ni. Ẹ̀yin ọmọ Lefi, ẹ ti kọjá ààyè yín!”
అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు.
8 Mose sì tún sọ fún Kora pé, “Ẹ gbọ́ báyìí o, ẹ̀yin ọmọ Lefi!
ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి,
9 Kò ha tọ́ fún yín pé Ọlọ́run Israẹli ti yà yín sọ́tọ̀ lára ìjọ Israẹli yòókù, tó sì mú yín súnmọ́ ara rẹ̀ láti ṣiṣẹ́ nínú àgọ́ Olúwa àti láti dúró ṣiṣẹ́ ìsìn níwájú àwọn ènìyàn?
తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?
10 Ó ti mú àwọn ènìyàn yín tó jẹ́ ọmọ Lefi súnmọ́ ara rẹ̀, ṣùgbọ́n báyìí ẹ tún ń wá ọnà láti ṣiṣẹ́ àlùfáà.
౧౦ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.
11 Olúwa ni ìwọ àti gbogbo ẹlẹgbẹ́ rẹ takò. Ta a ni Aaroni jẹ́ tí ẹ̀yin ó fi kùn sí i?”
౧౧దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు.
12 Mose sì ránṣẹ́ sí Datani àti Abiramu àwọn ọmọ Eliabu. Ṣùgbọ́n wọ́n wí pé, “Àwa kò ní í wá!
౧౨మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.
13 Kò ha tó gẹ́ẹ́ pé o ti mú wa jáde láti ilẹ̀ tí ó ń sàn fún wàrà àti oyin láti pa wá sínú aginjù yìí? O tún wá fẹ́ sọ ara rẹ di olúwa lé wa lórí bí?
౧౩కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
14 Síbẹ̀síbẹ̀ ìwọ kò sì tí ì mú wa dé ilẹ̀ tí ó ń sàn fún wàrà àti oyin, bẹ́ẹ̀ ni o kò sì pín ilẹ̀ ìní àti ọgbà àjàrà. Ìwọ ha fẹ́ sọ wá di ẹrú bí? Rárá o, àwa kì yóò gòkè wá!”
౧౪అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు.
15 Nígbà náà ni Mose bínú gidigidi, ó sì sọ fún Olúwa pé, “Má ṣe gba ọrẹ wọn, èmi kò gba kẹ́tẹ́kẹ́tẹ́ lọ́wọ́ wọn, bẹ́ẹ̀ ni n kò sì pa ẹnikẹ́ni nínú wọn lára!”
౧౫అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు.
16 Mose sọ fún Kora pé, “Ìwọ àti ọmọ lẹ́yìn rẹ gbọdọ̀ fi ara hàn níwájú Olúwa lọ́la—gbogbo yín, ìwọ, àwọn ọmọ lẹ́yìn rẹ àti Aaroni.
౧౬అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.
17 Kí ẹnìkọ̀ọ̀kan yín mú àwo tùràrí, kí ó sì fi tùràrí sínú rẹ̀, kí gbogbo rẹ̀ jẹ́ àádọ́ta lé nígba àwo tùràrí kí ẹ sì ko wá síwájú Olúwa. Ìwọ àti Aaroni yóò mú àwo tùràrí wá pẹ̀lú.”
౧౭మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు.
18 Nígbà náà ni oníkálùkù wọn mú àwo tùràrí, wọ́n fi iná àti tùràrí sí i nínú, wọ́n sì dúró sí ẹnu-ọ̀nà àgọ́ ìpàdé, àwọn pẹ̀lú Mose àti Aaroni.
౧౮కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.
19 Nígbà tí Kora kó gbogbo àwọn ẹlẹgbẹ́ rẹ̀ jọ sí ẹnu-ọ̀nà àgọ́ ìpàdé, ògo Olúwa sì farahan gbogbo ìjọ ènìyàn.
౧౯కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.
20 Olúwa sì sọ fún Mose àti Aaroni pé,
౨౦అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.
21 “Ẹ ya ara yín sọ́tọ̀ kúrò láàrín ìjọ wọ̀nyí, kí ń ba à le pa wọ́n run lẹ́ẹ̀kan náà.”
౨౧తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,
22 Ṣùgbọ́n Mose àti Aaroni dojúbolẹ̀ wọ́n sì kígbe sókè pé, “Ọlọ́run, Ọlọ́run ẹ̀mí gbogbo ènìyàn, Ìwọ ó wa bínú sí gbogbo ìjọ ènìyàn nígbà tó jẹ́ pé ẹnìkan ló ṣẹ̀?”
౨౨వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు.
23 Olúwa tún sọ fún Mose pé,
౨౩అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,
24 “Sọ fún ìjọ ènìyàn pé, ‘Kí wọ́n jìnnà sí àgọ́ Kora, Datani àti Abiramu.’”
౨౪“సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు.
25 Mose sì dìde lọ bá Datani àti Abiramu àwọn àgbàgbà Israẹli sì tẹ̀lé.
౨౫అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.
26 Ó sì kìlọ̀ fún ìjọ ènìyàn pé, “Ẹ kúrò ní àgọ́ àwọn ènìyàn búburú yìí! Ẹ má ṣe fọwọ́ kan ohun kan tí í ṣe tiwọn kí ẹ má ba à parun nítorí ẹ̀ṣẹ̀ wọn.”
౨౬అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు.
27 Àwọn ènìyàn sì sún kúrò ní àgọ́ Kora, Datani àti Abiramu. Datani àti Abiramu jáde, àwọn ìyàwó wọn àti àwọn ọmọ wọn sì dúró sí ẹnu-ọ̀nà àgọ́ wọn.
౨౭కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.
28 Nígbà náà ni Mose wí pé, “Báyìí ni ẹ ó ṣe mọ̀ pé Olúwa ló rán mi láti ṣe gbogbo iṣẹ́ wọ̀nyí àti pé kì í ṣe ìfẹ́ inú mi ni àwọn ohun tí mò ń ṣe.
౨౮అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.
29 Bí àwọn ènìyàn yìí bá kú bí gbogbo ènìyàn ti ń kú, bí ìrírí wọn kò bá sì yàtọ̀ sí ti àwọn ènìyàn yòókù, a jẹ́ pé kì í ṣe Olúwa ló rán mi.
౨౯మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.
30 Ṣùgbọ́n bí Olúwa bá ṣe ohun tuntun, tí ilẹ̀ sì la ẹnu, tó gbé wọn mì, àwọn pẹ̀lú gbogbo ohun tí wọ́n ní, tí wọ́n sì wọ inú ibojì wọn lọ láààyè, nígbà náà ni ẹ̀yin ó mọ̀ pé àwọn ènìyàn yìí ti kẹ́gàn Olúwa.” (Sheol h7585)
౩౦కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు. (Sheol h7585)
31 Bí ó sì ṣe parí ọ̀rọ̀ wọ̀nyí, ilẹ̀ pín sí méjì nísàlẹ̀ wọn,
౩౧మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.
32 ilẹ̀ sì lanu ó sì gbé wọn mì pẹ̀lú gbogbo ará ilé wọn àti àwọn ènìyàn Kora àti gbogbo ohun tí wọ́n ní.
౩౨భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
33 Gbogbo wọn sì sọ̀kalẹ̀ sínú ibojì wọn láààyè pẹ̀lú ohun gbogbo tí wọ́n ní, ilẹ̀ sì padé mọ́ wọn, wọ́n sì ṣègbé kúrò láàrín ìjọ ènìyàn. (Sheol h7585)
౩౩వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు. (Sheol h7585)
34 Gbogbo ènìyàn Israẹli tí ó yí wọn ká sì sálọ tí àwọn yòókù gbọ́ igbe wọn, wọ́n wí pé, “Ilẹ̀ yóò gbé àwa náà mì pẹ̀lú.”
౩౪వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు.
35 Iná sì jáde láti ọ̀dọ̀ Olúwa ó sì run àádọ́ta lé nígba ọkùnrin tí wọ́n mú tùràrí wá.
౩౫అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.
36 Olúwa sọ fún Mose pé,
౩౬అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.
37 “Sọ fún Eleasari ọmọ Aaroni tí í ṣe àlùfáà, pé kí ó mú àwọn àwo tùràrí jáde kúrò nínú iná nítorí pé wọ́n jẹ́ mímọ́, kí ó sì tan iná náà káàkiri sí ibi tó jìnnà.
౩౭ఆ నిప్పుని దూరంగా చల్లు.
38 Èyí ni àwo tùràrí àwọn tí ó kú nítorí ẹ̀ṣẹ̀ wọn. Kí ẹ gún àwo tùràrí yìí, kí ẹ sì fi ṣe ìbòrí fún pẹpẹ, wọ́n jẹ́ mímọ́ nítorí pé wọ́n ti mú wọn wá síwájú Olúwa. Kí wọ́n jẹ́ àmì fún àwọn ọmọ Israẹli.”
౩౮పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.”
39 Eleasari tí í ṣe àlùfáà sì kó gbogbo àwo tùràrí tí àwọn tí ó jóná mú wa, ó gún wọn pọ̀, ó fi ṣe ìbòrí fún pẹpẹ,
౩౯అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి,
40 gẹ́gẹ́ bí Olúwa ṣe sọ láti ẹnu Mose. Èyí yóò jẹ́ ohun ìrántí fún àwọn ọmọ Israẹli pé, àlejò yàtọ̀ sí irú-ọmọ Aaroni kò gbọdọ̀ jó tùràrí níwájú Olúwa, ẹni tí ó bá ṣe bẹ́ẹ̀, yóò dàbí Kora àti àwọn ẹgbẹ́ rẹ̀.
౪౦కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.
41 Ní ọjọ́ kejì gbogbo ìjọ àwọn ọmọ Israẹli kùn sí Mose àti Aaroni pé, “Ẹ ti pa àwọn ènìyàn Olúwa.”
౪౧తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి,
42 Ṣùgbọ́n nígbà tí gbogbo ìjọ ènìyàn péjọ lòdì sí Mose àti Aaroni, níwájú àgọ́ ìpàdé, lójijì ni ìkùùkuu bolẹ̀, ògo Olúwa sì fi ara hàn.
౪౨సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.
43 Nígbà náà ni Mose àti Aaroni lọ síwájú àgọ́ ìpàdé,
౪౩మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,
44 Olúwa sì sọ fún Mose pé,
౪౪యెహోవా మోషేతో “మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి,
45 “Yàgò kúrò láàrín ìjọ ènìyàn yìí, kí ń ba le run wọ́n ní ìṣẹ́jú kan.” Wọ́n sì dojúbolẹ̀.
౪౫తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను” అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.
46 Mose sì sọ fún Aaroni pé, “Mú àwo tùràrí, kí o fi iná sí i lórí pẹpẹ, fi tùràrí sínú rẹ̀, kí o sì tètè mu lọ sí àárín ìjọ ènìyàn láti ṣe ètùtù fún wọn nítorí pé ìbínú Olúwa ti jáde, àjàkálẹ̀-ààrùn sì ti bẹ̀rẹ̀.”
౪౬అప్పుడు మోషే “నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది” అని అహరోనుతో చెప్పాడు.
47 Aaroni ṣe bí Mose ti wí, ó sáré lọ sí àárín àwọn ènìyàn, ṣùgbọ́n àjàkálẹ̀-ààrùn ti bẹ̀rẹ̀ láàrín wọn, ṣùgbọ́n Aaroni fín tùràrí, ó sì ṣe ètùtù fún wọn.
౪౭మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.
48 Ó dúró láàrín àwọn alààyè àti òkú, àjàkálẹ̀-ààrùn náà sì dúró.
౪౮అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.
49 Ṣùgbọ́n àjàkálẹ̀-ààrùn ti pa ẹgbàá méje ó lé lẹ̀ẹ́dẹ́gbẹ̀rin ènìyàn ní àfikún sí àwọn tí ó kú níbi ìṣẹ̀lẹ̀ Kora.
౪౯కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు.
50 Aaroni padà tọ Mose lọ ní ẹnu-ọ̀nà àgọ́ ìpàdé nítorí pé àjàkálẹ̀-ààrùn náà ti dúró.
౫౦ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.

< Numbers 16 >