< Joshua 9 >

1 Nísinsin yìí, nígbà tí gbogbo ọba tó wà ní ìwọ̀-oòrùn Jordani gbọ́ nípa nǹkan wọ̀nyí, àwọn náà tí ó wà ní orí òkè àti àwọn tí ó wà ní ẹsẹ̀ òkè, àti gbogbo àwọn tí ó wà ní agbègbè Òkun Ńlá títí ó fi dé Lebanoni (àwọn ọba Hiti, Amori, Kenaani, Peresi, Hifi àti Jebusi)
యొర్దాను అవతల ఉన్న కొండ ప్రాంతంలో, లోయ ప్రాంతాల్లో, లెబానోను ముందు ఉన్న మహా సముద్ర తీర ప్రాంతమంతా ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ మొదలైన రాజులంతా జరిగిన దాన్ని విన్నప్పుడు
2 wọ́n sì kó ara wọn jọ láti bá Joṣua àti Israẹli jagun.
వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.
3 Ṣùgbọ́n nígbà tí àwọn ènìyàn Gibeoni gbọ́ ohun tí Joṣua ṣe sí Jeriko àti Ai,
యెహోషువ యెరికోకి, హాయికీ చేసినదాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు
4 wọ́n dá ọgbọ́n ẹ̀tàn. Wọ́n lọ gẹ́gẹ́ bí aṣojú tí kẹ́tẹ́kẹ́tẹ́ wọn kún fún ẹrù tí a fi àwọn àpò tó ti gbó dì, àti àwọn awọ ọtí wáìnì tó ti gbó tí a tún rán.
వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,
5 Àwọn ọkùnrin náà sì wọ bàtà àti aṣọ tí ó ti gbó. Gbogbo oúnjẹ tí wọ́n pèsè fún ara wọn sì bu.
పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి.
6 Wọ́n sì tọ Joṣua lọ ní ibùdó ní Gilgali, wọ́n sì sọ fún òun àti àwọn ọkùnrin Israẹli pé, “Ìlú òkèrè ní àwọn ti wá, ẹ ṣe àdéhùn àlàáfíà pẹ̀lú wa.”
వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.
7 Àwọn ọkùnrin Israẹli sọ fún àwọn ará Hifi pé, “Ṣùgbọ́n bóyá tòsí wa ni ẹ ń gbé. Báwo ni a ó ṣe lè ṣe àdéhùn pẹ̀lú yín?”
అప్పుడు ఇశ్రాయేలీయులు “మీరు మా మధ్య నివసిస్తున్న వారేనేమో, మేము మీతో ఎలా ఒప్పందం చేస్తాం?” అని ఆ హివ్వీయులతో అన్నారు.
8 “Ìránṣẹ́ rẹ ní àwa í ṣe.” Wọ́n sọ fún Joṣua. Ṣùgbọ́n Joṣua béèrè, “Ta ni yín àti pé níbo ni ẹ̀yin ti wá?”
వారు “మేము నీ దాసులం” అని యెహోషువతో చెప్పారు. యెహోషువ “మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.
9 Wọ́n sì dáhùn pé, “Ní ilẹ̀ òkèèrè ní àwọn ìránṣẹ́ rẹ tí wá, nítorí orúkọ Olúwa Ọlọ́run rẹ. Nítorí tí àwa ti gbọ́ òkìkí rẹ àti ohun gbogbo tí ó ti ṣe ní Ejibiti,
వారు “నీ దేవుడైన యెహోవా నామాన్నిబట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తినీ, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్నీ,
10 àti ohun gbogbo tí ó ti ṣe sí ọba àwọn Amori méjèèje tí ń bẹ ní òkè Jordani, sí Sihoni ọba Heṣboni, àti Ogu ọba Baṣani, tí wọ́n jẹ ọba ní Aṣtarotu.
౧౦యొర్దాను తీరంలో ఉన్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు ఆయన చేసినదంతా మేము విన్నాం.
11 Àwọn àgbàgbà wa àti gbogbo àwọn tí ń gbé ìlú wa sọ fún wa pé, ‘Ẹ mú oúnjẹ lọ́wọ́ fún ìrìnàjò yín, ẹ lọ pàdé wọn, kí ẹ sì sọ fún wọn pé, “Àwa ni ìránṣẹ́ yín, ẹ dá àdéhùn pẹ̀lú wa.”’
౧౧అప్పుడు మా పెద్దలూ మా దేశ ప్రజలంతా మాతో, మీరు ప్రయాణం కోసం ఆహారం తీసుకుని వారికి ఎదురు వెళ్లి వారితో ‘మేము మీ దాసులం కాబట్టి మాతో ఒక ఒప్పందం చేయండి’ అని మీతో చెప్పమన్నారు.
12 Gbígbóná ní a mú oúnjẹ wa wá, nígbà tí a dì í ní ilé ní ọjọ́ tí à ń bọ̀ wá sọ́dọ̀ yín. Ṣùgbọ́n ẹ wò ó bí ó ṣe gbẹ àti bí ó sì ṣe bu nísinsin yìí.
౧౨మీ దగ్గరికి రావాలని బయలుదేరిన రోజు మేము సిద్ధం చేసుకుని మా ఇళ్ళనుండి తెచ్చుకొన్న వేడి ఆహార పదార్ధాలు ఇవే, ఇప్పటికి అవి యెండిపోయి ముక్కలయ్యాయి.
13 Àti ìgò wáìnì wọ̀nyí, tí àwa rọ kún tuntun ni, ṣùgbọ́n ẹ wò ó bí wọ́n ti sán. Aṣọ àti bàtà wa ni ó sì ti gbó nítorí ìrìnàjò ọ̀nà jíjìn.”
౧౩ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి” అని అతనితో చెప్పారు.
14 Àwọn ọkùnrin Israẹli sì yẹ oúnjẹ wọn wò, wọn kò sì wádìí ní ọwọ́ Olúwa.
౧౪ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.
15 Nígbà náà ni Joṣua ṣe àdéhùn àlàáfíà pẹ̀lú wọn láti dá wọn sí, àti àwọn olórí ìjọ ènìyàn fi ọwọ́ sí àdéhùn náà nípa ṣíṣe ìbúra.
౧౫యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.
16 Ní ẹ̀yìn ọjọ́ mẹ́ta tí wọ́n ti ṣe àdéhùn pẹ̀lú àwọn ará Gibeoni, àwọn ọmọ Israẹli gbọ́ pé aládùúgbò wọn ni wọ́n, tí ń gbé ní tòsí wọn.
౧౬అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.
17 Bẹ́ẹ̀ ní àwọn ọmọ Israẹli jáde, wọ́n sì dé ìlú wọn ní ọjọ́ kẹta: Gibeoni, Kefira, Beeroti àti Kiriati-Jearimu.
౧౭ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవరోజు వారి పట్టణాలకు వచ్చారు. గిబియోనీయుల పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము.
18 Ṣùgbọ́n àwọn ọmọ Israẹli kò si kọlù wọ́n, nítorí pé àwọn àgbàgbà ìjọ ènìyàn ti búra fún wọn ní orúkọ Olúwa Ọlọ́run Israẹli. Gbogbo ènìyàn sì kùn sí àwọn àgbàgbà náà,
౧౮ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు.
19 ṣùgbọ́n gbogbo àwọn olórí dáhùn pé, “Àwa ti búra fún wọn ní orúkọ Olúwa Ọlọ́run Israẹli, a kò sì lè fọwọ́ kàn wọ́n nísinsin yìí.
౧౯దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు. “మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం కాబట్టి మనం వారికి హాని చేయకూడదు.
20 Èyí ní àwa yóò ṣe sí wọn, àwa yóò dá wọn sí, kí ìbínú kí ó má ba à wá sórí wa, nítorí ìbúra tí a búra fún wọn.”
౨౦మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మనమీదికి ఉగ్రత రాకుండ ఆ ప్రమాణం గురించి వారిని బతకనియ్యాలి” అని చెప్పారు.
21 Wọ́n tẹ̀síwájú, “Ẹ dá wọn sí, ṣùgbọ́n ẹ jẹ́ kí wọn jẹ́ gégigégi àti apọnmi fún gbogbo ìlú.” Àwọn àgbàgbà náà sì mú ìlérí wọn ṣẹ fún wọn.
౨౧నాయకులు “వారిని బతకనియ్యండి” అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు.
22 Nígbà náà ni Joṣua pe àwọn ọmọ Gibeoni jọ pé, “Èéṣe tí ẹ̀yin fi tàn wá wí pe, ‘Àwa gbé ní ibi tí ó jìnnà sí yín,’ nígbà tí ó jẹ́ pé tòsí wa ní ẹ̀yin ń gbé?
౨౨యెహోషువ వారిని పిలిపించి ఇలా చెప్పాడు. “మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు?
23 Nísinsin yìí, ẹ̀yin di ẹni ègún, ẹ̀yin kò sì ní kúrò ní gégigégi àti apọnmi fún ilé Ọlọ́run mi.”
౨౩ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు” అన్నాడు.
24 Wọ́n sì dá Joṣua lóhùn pé, “Nítorí tí a sọ fún àwọn ìránṣẹ́ rẹ dájúṣáká bí Olúwa Ọlọ́run rẹ ti pàṣẹ fún Mose ìránṣẹ́ rẹ̀, láti fún yín ní gbogbo ilẹ̀ náà, kí ó sì pa gbogbo olùgbé ilẹ̀ náà run kúrò ní iwájú yín. Nítorí náà, àwa bẹ̀rù ẹ̀mí wa nítorí yín, èyí sì ni ìdí tí a fi ṣe bẹ́ẹ̀.
౨౪అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.
25 Nísinsin yìí, àwa wà ní ọwọ́ yín. Ohunkóhun tí ẹ bá rò pé ó yẹ ó si tọ́ lójú yín ní kí ẹ fi wá ṣe.”
౨౫కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, నీ దృష్టికి ఏది న్యాయమో, ఏది మంచిదో, అదే మాకు చెయ్యి” అని యెహోషువకు జవాబిచ్చారు.
26 Bẹ́ẹ̀ ní Joṣua sì gbà wọ́n là kúrò ní ọwọ́ àwọn ọmọ Israẹli. Wọn kò sì pa wọ́n.
౨౬కాబట్టి యెహోషువా ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లోనుండి విడిపించాడు.
27 Ní ọjọ́ náà ni ó sọ àwọn Gibeoni di aṣẹ́gi àti apọnmi fún àwọn ará ìlú àti fún pẹpẹ Olúwa ní ibi tí Olúwa yóò yàn. Báyìí ni wọ́n wà títí di òní yìí.
౨౭అయితే సమాజం కోసమూ యెహోవా నిర్ణయించిన చోట ఉండే బలిపీఠం కోసమూ కట్టెలు నరికే వారుగా నీళ్లు తోడేవారుగా యెహోషువ ఆ రోజే వారిని నియమించాడు. ఇప్పటివరకూ వారు ఆ పని చేస్తూనే ఉన్నారు.

< Joshua 9 >