< Jeremiah 44 >

1 Ọ̀rọ̀ Olúwa tọ Jeremiah wá nípa àwọn Júù tí ń gbé ní ìsàlẹ̀ Ejibiti ní Migdoli, Tafanesi àti Memfisi àti ní apá òkè Ejibiti:
ఐగుప్తు లోని మిగ్దోలు, తహపనేసు, నొపు, పత్రోసు నగరాల్లో నివాసమున్న యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయా వద్దకు వచ్చిన దేవుని వాక్యం ఇది.
2 “Èyí ni ohun tí Olúwa àwọn ọmọ-ogun Ọlọ́run Israẹli wí: Wo ibi tí mo mú bá Jerusalẹmu àti gbogbo ìlú Juda. Lónìí, wọ́n wà ní ìyapa àti ìparun.
“సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. నేను యెరూషలేము పైకీ మిగిలిన యూదా దేశపు పట్టణాల పైకీ పంపిన విపత్తులన్నిటినీ మీరు చూశారు. చూడండి, అవి శిథిలాలై పడి ఉన్నాయి. అక్కడ ఎవరూ నివసించడం లేదు.
3 Nítorí pé ibi tí wọ́n ti ṣe. Wọ́n mú mi bínú nípa tùràrí fínfín àti nípa bíbọ àwọn òrìṣà, yálà èyí tí ìwọ tàbí àwọn baba rẹ kò mọ̀.
మీకుగానీ మీ పితరులకిగానీ తెలియని దేవుళ్ళకి సాంబ్రాణి వేసి పూజించి నాకు కోపం పుట్టించారు కాబట్టి అలా జరిగింది.
4 Ní ọ̀pọ̀lọpọ̀ ìgbà ní mo rán wòlíì mi, èyí tí ó wí báyìí pé, ‘Má ṣe àwọn ohun ìríra yìí tí èmi kórìíra.’
అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.
5 Ṣùgbọ́n wọn kò fetísílẹ̀ láti fi ọkàn si. Wọn kò sì yípadà kúrò nínú búburú wọn tàbí dáwọ́ ẹbọ sísun sí àwọn òrìṣà dúró.
కానీ వాళ్ళు వినలేదు. ఇతర దేవుళ్ళకి ధూపం వేయడం గానీ, దుర్మార్గపు పనులను చేయడం గానీ మానుకోలేదు. నా మాటపై శ్రద్ధ పెట్టలేదు.
6 Fún ìdí èyí, ìbínú gbígbóná mi ni èmi yóò yọ sí àwọn ìlú Juda àti òpópó Jerusalẹmu àti sísọ wọ́n di ìparun bí ó ṣe wà lónìí yìí.
కాబట్టి నా దగ్గర నుండి తీవ్రమైన కోపం, ఉగ్రత ప్రవహించింది. అది అగ్నిలా యూదా పట్టణాలనూ, యెరూషలేము రహదారులనూ తగులబెట్టింది. కాబట్టి అవి ఇప్పుడు చూస్తున్నట్టుగా నాశనమై శిథిలాలుగా పడి ఉన్నాయి.”
7 “Báyìí tún ni Olúwa Ọlọ́run àwọn ọmọ-ogun Israẹli wí, kí ló dé tí ẹ fi ń mu ibi ńlá yìí wá sí orí ara yín nípa yíyapa kúrò lára Juda ọkùnrin àti obìnrin, ọmọdé àti èwe, tí ẹ kò sì ku ọ̀kankan?
కాబట్టి ఇప్పుడు సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీకు విరోధంగా మీరే ఎందుకిలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు? స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ, పసికందులూ ఇలా ఎవరూ యూదా దేశంలో ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీరే ఎందుకు చేసుకుంటున్నారు?
8 Èéṣe tí ẹ fi mú mi bínú pẹ̀lú ohun tí ọwọ́ yín ṣe pẹ̀lú ẹbọ sísun sí àwọn òrìṣà Ejibiti, níbi tí ẹ wá láti máa gbé? Ẹ̀ ò pa ara yín run, ẹ̀ ó sì sọ ara yín di ẹni ìfiré àti ẹ̀gàn láàrín àwọn orílẹ̀-èdè ayé gbogbo.
మీ దుర్మార్గత చేత మీరు మీ చేతులతో చేసే పనులతో నాకు అభ్యంతరకరంగా నేరం చేస్తున్నారు. మీరు నివాసం ఉండబోతున్న ఐగుప్తు దేశపు దేవుళ్ళకి ధూపం వేస్తూ నన్ను ఉల్లంఘిస్తున్నారు. మీరు నాశనం కావడానికీ భూమి పైన ఉన్న అన్ని దేశాల్లో మీరు నవ్వుల పాలు కావడానికీ, ఒక శాప వచనంగా ఉండటానికీ మీరు అక్కడికి వెళ్తున్నారు.
9 Ṣé ẹ̀yin ti gbàgbé ibi tí àwọn baba ńlá yín àti àwọn ọba; àwọn ayaba Juda, àti àwọn ibi tí ẹ ti ṣe àti àwọn ìyàwó yín ní ilẹ̀ Juda àti ní òpópó Jerusalẹmu?
మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా?
10 Láti ìgbà náà sí àkókò yìí, wọn kò rẹ ara wọn sílẹ̀ tàbí fi ìtẹríba hàn tàbí kí wọn ó tẹ̀lé òfin àti àṣẹ tí mo pa fún un yín àti àwọn baba yín.
౧౦ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”
11 “Fún ìdí èyí, báyìí ni Olúwa àwọn ọmọ-ogun, Ọlọ́run àwọn Israẹli wí: Mo ti pinnu láti mú ibi wá sí orí yín àti láti pa Juda run.
౧౧కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, మీ పైకి అపాయాన్ని తీసుకురావడానికీ, యూదా దేశాన్నంతా నాశనం చేయడానికీ నేను నా ముఖాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పుకుంటున్నాను.
12 Èmi yóò sì mú àwọn èérún tí ó kù ní Juda, tí wọ́n ṣetán láti lọ Ejibiti. Wọn yóò ṣubú pẹ̀lú idà tàbí kí wọn kú pẹ̀lú ìyàn láti orí ọmọdé títí dé àgbà ni wọn yóò kú láti ọwọ́ ìyàn tàbí idà. Wọn yóò di ẹni ìfiré àti ìparun, ẹni ẹ̀kọ̀ àti ẹni ẹ̀gàn.
౧౨యూదా ప్రజలలో మిగిలిన వాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళని నేనే తీసుకు వెళ్తాను. వాళ్ళంతా ఐగుప్తులో నాశనం కావడానికే ఇలా చేస్తాను. వాళ్ళు అక్కడ కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ కూలిపోతారు. వాళ్ళు చనిపోయి శాపానికీ, దూషణకూ, అవమానానికీ, భయానికీ సామెతగా ఉంటారు.
13 Èmi yóò fi ìyà jẹ ẹni tí ó bá ń gbé ní Ejibiti pẹ̀lú idà, ìyàn àti àjàkálẹ̀-ààrùn bí mo ṣe fi ìyà jẹ Jerusalẹmu.
౧౩యెరూషలేములో నివసించే వాళ్ళని కత్తితో, కరువుతో, వ్యాధులతో నేను ఎలా శిక్షించానో అలాగే ఐగుప్తులో నివసించే వాళ్ళను కూడా శిక్షిస్తాను.
14 Kò sí èyí tí ó kéré jù nínú Juda tí ó kù, tí ó ń gbé ilẹ̀ Ejibiti tí yóò sá àsálà padà sórí ilẹ̀ Juda, èyí tí wọ́n nífẹ̀ẹ́ láti padà sí, àti láti máa gbé; àyàfi àwọn aṣàtìpó mélòó kan.”
౧౪ఐగుప్తులో నివాసముండటానికి వెళ్ళిన మిగిలిన యూదా ప్రజల్లో ఎవరూ కాందిశీకుల్లా తిరిగి యూదా దేశానికి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తిరిగి రారు.”
15 Lẹ́yìn èyí, gbogbo àwọn ọkùnrin tí ẹ bá mọ̀ pé, ìyàwó wọn sun tùràrí sí àwọn òrìṣà pẹ̀lú àwọn obìnrin tí ó bá wá àwọn ènìyàn púpọ̀, pàápàá àwọn ènìyàn tí wọ́n ń gbé ní òkè àti ìsàlẹ̀ Ejibiti, bẹ́ẹ̀ ni a wí fún Jeremiah.
౧౫అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు సాంబ్రాణి ధూపం వేస్తారని తెలిసిన పురుషులందరూ, అక్కడ సమూహంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ఐగుప్తు దేశంలో పత్రోసులో నివాసముండే ప్రజలందరూ యిర్మీయాకు జవాబిచ్చారు.
16 “Wọn sì wí pé, àwa kò ní fetísílẹ̀ ọ̀rọ̀ tí o bá bá wa sọ ní orúkọ Olúwa.
౧౬వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం.
17 Dájúdájú, à ó ṣe gbogbo nǹkan tí a sọ pé à ò ṣe. A ó sun tùràrí sí ayaba ọ̀run, à ó sì da ohun mímu sílẹ̀ gẹ́gẹ́ bí ẹbọ sí àwa àti àwọn baba wa, àwọn ọba àti àwọn aláṣẹ ti ṣe ní àwọn ìlú Juda àti ni àwọn ìgboro Jerusalẹmu. Nígbà náà àwa ní oúnjẹ púpọ̀, a sì ṣe rere a kò sì rí ibi.
౧౭మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం.
18 Ṣùgbọ́n láti ìgbà tí a ti dáwọ́ tùràrí sísun sí Ayaba Ọ̀run àti láti da ẹbọ ohun mímu fún un, àwa ti ṣaláìní ohun gbogbo, a sì run nípa idà àti nípa ìyàn.”
౧౮మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.”
19 Àwọn obìnrin náà fi kún un pé, “Nígbà tí à ń jó tùràrí sí ayaba ọ̀run, tí a sì ń fi ohun mímu rú ẹbọ si; ǹjẹ́ àwọn ọkọ wa kò mọ pé àwa ń ṣe àkàrà bí i, àwòrán rẹ, àti wí pé à ń da ọtí si gẹ́gẹ́ bi ohun ìrúbọ?”
౧౯అక్కడి స్త్రీలు “మేం మా భర్తలకు తెలియకుండానే ఆకాశ రాణికి ధూపం వేస్తూ, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నామా ఏమిటి?” అన్నారు.
20 Wàyí o, Jeremiah sọ fún àwọn ọ̀pọ̀ ènìyàn náà, ọkùnrin àti obìnrin, tí wọn sì ń dáhùn pé,
౨౦అప్పుడు యిర్మీయా ఆ ప్రజలందరితో, ఆ స్త్రీ పురుషులందరితో, తనకు జవాబు చెప్పిన వాళ్ళందరితో ఇలా అన్నాడు. వాళ్ళకి ఇలా ప్రకటన చేశాడు.
21 “Ṣe Olúwa kò rántí ẹbọ sísun ní ìlú Juda àti àwọn ìgboro Jerusalẹmu láti ọ̀dọ̀ rẹ àti ọ̀dọ̀ àwọn baba rẹ, àwọn ọba àti àwọn aláṣẹ àti àwọn ènìyàn ìlú.
౨౧“మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.
22 Nígbà tí Olúwa kò lè fi ara da ìwà búburú yín àti àwọn nǹkan ìríra gbogbo tí ẹ ṣe, ilẹ̀ yín sì di ohun ìfiré àti ìkọ̀sílẹ̀, láìsí olùgbé gẹ́gẹ́ bí ó ti ṣe wà lónìí.
౨౨ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు.
23 Nítorí pé ẹ ti sun ẹbọ, tí ẹ sì ti ṣẹ̀ sí Olúwa àti pé ẹ kò gbọ́rọ̀ sí i lẹ́nu, àti pé ẹ kò sì tẹ̀lé òfin rẹ̀ àti àwọn àṣẹ. Ibi náà yóò wá sórí rẹ àti bí o ṣe rí i.”
౨౩మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.”
24 Nígbà náà ni Jeremiah dáhùn pẹ̀lú obìnrin náà pé, “Gbọ́ ọ̀rọ̀ Olúwa, ẹ̀yin ọmọ Juda tí ó wà ní Ejibiti.
౨౪తర్వాత యిర్మీయా అక్కడి ప్రజలనందరికీ, స్త్రీలందరికీ ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
25 Èyí ni ọ̀rọ̀ tí Olúwa àwọn ọmọ-ogun Ọlọ́run Israẹli wí. Ìwọ àti àwọn ìyàwó rẹ fihàn pẹ̀lú àwọn ìhùwà rẹ àti àwọn ohun tí ó ṣèlérí nígbà tí o wí pé, ‘Àwa yóò mú ẹ̀jẹ́ tí a jẹ́ ṣẹ lórí sísun tùràrí àti dída ẹbọ ohun mímu sí orí ère Ayaba Ọ̀run.’ “Tẹ̀síwájú nígbà náà, ṣe ohun tí o sọ, kí o sì mú ẹ̀jẹ́ rẹ ṣẹ.
౨౫సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘మీరూ, మీ భార్యలూ, ఇద్దరూ కలసి మీ నోటితో చెప్పారు.’ అలా చెప్పిన దాన్ని చేతులతో చేసి చూపించారు. ఆకాశ రాణికి ధూపం వేస్తామనీ, ఆమెకు పూజ చేస్తామనీ మీరు ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఒట్టును నెరవేర్చండి. దానిని జరిగించండి.
26 Ṣùgbọ́n gbọ́ ọ̀rọ̀ Olúwa Olódùmarè, gbogbo ẹ̀yin Júù tí ń gbé ilẹ̀ Ejibiti, mo gégùn ún: ‘Mo búra pẹ̀lú títóbi orúkọ mi,’ bẹ́ẹ̀ ni Olúwa wí, ‘pé kò sí ẹnikẹ́ni láti Juda tí ń gbé ibikíbi ní Ejibiti tí ó gbọdọ̀ ké pe orúkọ mi tàbí búra, “Gẹ́gẹ́ bí Ọlọ́run tí ó dá wa ti wà láààyè.”
౨౬అయితే ఐగుప్తులో నివసించే యూదా ప్రజలందరూ యెహోవా మాట వినండి. ఆయన ఇలా అంటున్నాడు. చూడండి. నేను నా ఘన నామంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు ‘యెహోవా జీవం తోడు’ అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరును తమ నోటితో పలకరు.
27 Nítorí náà, èmi ó ṣọ wọ́n fún ibi, kì í ṣe fún rere. Àti gbogbo àwọn ọkùnrin Juda tí ó wà ní ilẹ̀ Ejibiti ni a ó parun pẹ̀lú idà àti ìyàn títí tí gbogbo wọn yóò fi tán.
౨౭నేను వాళ్ళ క్షేమం కోసం కాకుండా వాళ్ళ వినాశనం కోసమే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాను. ఐగుప్తులోని యూదులంతా కత్తి మూలంగానో కరువు మూలంగానో చనిపోతారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడు. వారు ఖడ్గం వల్ల గానీ కరువు వల్ల గానీ క్షీణించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారంతా ఎవరూ మిగలకుండా అంతమై పోతారు.
28 Àwọn tí ó bá sá àsálà kúrò lọ́wọ́ ìparun idà àti pípadà sí ilẹ̀ Juda láti Ejibiti yóò kéré níye. Gbogbo àwọn tí ó bá kú ní ilẹ̀ Juda, tí ó wá gbé ilẹ̀ Ejibiti yóò mọ ọ̀rọ̀ ẹni tí yóò dúró yálà tèmi tàbí tiyín.
౨౮కత్తిని తప్పించుకున్న కొద్దిమంది ఐగుప్తు నుండి యూదా దేశానికి తిరిగి వస్తారు. కాబట్టి యూదాలో మిగిలిన వాళ్లకు ఎవరి మాట నిజమైనదో, నాదో, వారిదో అప్పడు తెలుసుకుంటారు.
29 “‘Èyí ni yóò jẹ́ àmì fún un yín pé èmi yóò fi ìyà jẹ yín níbi tí Olúwa ti sọ láti lè jẹ́ kí ẹ mọ̀ pé ìjìyà mi tí mo sọ pé ẹ̀ ó jẹ yóò ṣẹ.’
౨౯ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘నా మాట మీకు విరోధంగా మీ పైకి ఘోర విపత్తును తీసుకు వస్తుంది. దానికి ఇది మీకు ఒక సూచనగా ఉంటుంది.’
30 Báyìí ni Olúwa wí: ‘Èmi yóò fi Farao Hofira ọba Ejibiti lé àwọn ọ̀tá rẹ̀ lọ́wọ́, èyí tí ó lè pa ayé rẹ́; gẹ́gẹ́ bí mo ti fi Sedekiah ọba Juda lé Nebukadnessari ọba Babeli lọ́wọ́ ọ̀tá tó ń lépa ẹ̀mí rẹ̀.’”
౩౦యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘సిద్కియా ప్రాణాన్ని తీయాలని వెదికిన అతని శత్రువు నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టే ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులకీ, అతని ప్రాణం తీయాలని చూసేవాళ్లకీ అప్పగించబోతున్నాను.’”

< Jeremiah 44 >