< Jeremiah 34 >
1 Nígbà tí Nebukadnessari ọba Babeli àti àwọn ọmọ-ogun rẹ̀, pẹ̀lú gbogbo ìjọba àti àwọn ènìyàn ní ilẹ̀ ọba tí ó jẹ ọba lé lórí ń bá Jerusalẹmu jà, àti gbogbo àwọn ìlú tí ó yíká, ọ̀rọ̀ yìí tọ Jeremiah wá láti ọ̀dọ̀ Olúwa pé:
౧బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యం అంతా, అతని అధికారం కింద ఉన్న భూరాజ్యాలు, ప్రజలు, అందరూ కలిసి యెరూషలేము మీద, దాని ప్రాంతాలన్నిటి మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు.
2 “Èyí ni ohun tí Olúwa Ọlọ́run Israẹli ọmọ-ogun wí: Lọ sí ọ̀dọ̀ Sedekiah ọba Juda kí o sì sọ fún un pé, ‘Èyí ni ohun tí Ọlọ́run wí: Èmi fẹ́ fa ìlú yìí lé ọba Babeli lọ́wọ́, yóò sì jó palẹ̀.
౨“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు వెళ్లి యూదా రాజైన సిద్కియాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమంటే, చూడు, నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానికి నిప్పుపెట్టి కాల్చేస్తాడు.
3 Ìwọ kò ní sá àsálà, ṣùgbọ́n à ó mú ọ, bẹ́ẹ̀ ni a ó sì fà ọ́ lé e lọ́wọ́. Ìwọ yóò rí ọba Babeli pẹ̀lú ojú ara rẹ; yóò sì bá ọ sọ̀rọ̀ lójúkojú; ìwọ yóò sì lọ sí Babeli.
౩నువ్వు అతని చేతిలోనుంచి తప్పించుకోలేవు, కచ్చితంగా నువ్వు అతనికి దొరికిపోతావు, నిన్ను అతని చేతికి అప్పగించడం జరుగుతుంది. బబులోను రాజును నువ్వు నీ కళ్ళతో చూస్తావు. నువ్వు బబులోను వెళ్ళినప్పుడు నువ్వు అతనితో ముఖాముఖి మాట్లాడతావు.’
4 “‘Síbẹ̀, gbọ́ ìlérí Olúwa, ìwọ Sedekiah ọba Juda. Èyí ni ohun tí Ọlọ́run wí nípa rẹ; ìwọ kì yóò ti ipa idà kú;
౪యూదా రాజువైన సిద్కియా, యెహోవా మాట విను! నీ విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీకు ఖడ్గంతో చావు రాదు. ప్రశాంతంగానే చనిపోతావు.
5 ìwọ yóò kú ní àlàáfíà. Bí àwọn ènìyàn sì ti ń ṣe iná ìsìnkú ní ọlá fún àwọn baba rẹ, ọba tí ó jẹ ṣáájú rẹ, bẹ́ẹ̀ ni wọn yóò ṣe iná ní ọlá rẹ, wọn ó sì pohùnréré pé, “Yé, olúwa!” Èmi fúnra mi ni ó ṣèlérí yìí ni Olúwa wí.’”
౫నీకంటే ముందుగా ఉన్న పూర్వపు రాజులైన నీ పితరులను దహనం చేసినట్టు నీ శరీరాన్ని దహనం చేస్తారు.’ అప్పుడు వాళ్ళు ‘అయ్యో, ప్రభూ!’ అంటారు. నీ కోసం ఏడుస్తారు. అలా జరగాలని పలికిన వాణ్ణి నేనే. ఇదే యెహోవా వాక్కు.”
6 Nígbà náà ni Jeremiah wòlíì sọ gbogbo nǹkan yìí fún Sedekiah ọba Juda ní Jerusalẹmu.
౬కాబట్టి, యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు యిర్మీయా ఈ వాక్కులన్నీ ప్రకటించాడు.
7 Nígbà tí ogun ọba Babeli ń bá Jerusalẹmu jà, àti gbogbo àwọn orílẹ̀-èdè tí ó kù ní Juda, Lakiṣi, Aseka; àwọn nìkan ni ìlú olódi tí ó kù ní Juda.
౭బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద, మిగతా యూదా పట్టాణాలన్నిటి మీద, ప్రాకారాలు కలిగిన పట్టణాలైన లాకీషు, అజేకా మీద దండెత్తింది.
8 Ọ̀rọ̀ Olúwa sì tọ Jeremiah wá lẹ́yìn ìgbà tí ọba Sedekiah ti dá májẹ̀mú pẹ̀lú gbogbo àwọn ènìyàn ní Jerusalẹmu láti polongo ìtúsílẹ̀ fún àwọn ẹrú.
౮యూదాలో తన తోటి ఇశ్రాయేలీయుణ్ణి ఎవరూ దాస్యానికి పెట్టుకోకూడదనీ, తమ దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలను, పురుషులను ప్రతివాడూ విడుదల చెయ్యాలనీ,
9 Kí oníkálùkù lè jẹ́ kí ẹrúkùnrin àti ẹrúbìnrin tí í ṣe Heberu lọ lọ́fẹ̀ẹ́, kí ẹnikẹ́ni kí ó má mú ará Juda arákùnrin rẹ̀ sìn.
౯రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న ప్రజలందరితో ఒప్పందం చేసిన తరువాత, యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు.
10 Nítorí náà, gbogbo àwọn aláṣẹ àti àwọn ènìyàn tí wọ́n fi ọwọ́ sí májẹ̀mú náà láti dá ẹrúkùnrin àti ẹrúbìnrin sílẹ̀ kí wọ́n sì má ṣe fi wọ́n sínú ìgbèkùn mọ́. Wọ́n sì gbà, wọ́n sì jẹ́ kí wọn lọ lọ́fẹ̀ẹ́.
౧౦ఆ ఒప్పందాన్నిబట్టి అందరూ తమకు దాసదాసీలుగా ఉన్న వాళ్ళను విడిపిస్తామనీ, ఇకముందు ఎవరూ వాళ్ళచేత దాస్యం చేయించుకోమనీ ఒప్పుకుని, ఆ నిబంధనలో చేరిన నాయకులు, ప్రజలు దానికి విధేయులై, వాళ్ళను విడిపించారు.
11 Ṣùgbọ́n lẹ́yìn ìgbà díẹ̀, wọ́n yí ọkàn wọn padà; wọ́n sì mú àwọn ẹrú tí wọ́n ti dá sílẹ̀ padà láti tún máa sìn wọ́n.
౧౧అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.
12 Nígbà náà ni ọ̀rọ̀ Olúwa tọ Jeremiah wá wí pé:
౧౨కాబట్టి, యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు,
13 “Èyí ni ohun tí Olúwa, Ọlọ́run Israẹli wí pé: Mo dá májẹ̀mú kan pẹ̀lú àwọn baba ńlá yín nígbà tí mo mú wọn kúrò ní Ejibiti; kúrò ní oko ẹrú. Mo wí pé,
౧౩“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, దాస్య గృహమైన ఐగుప్తుదేశం నుంచి నేను మీ పితరులను తీసుకొచ్చిన రోజు వాళ్ళతో ఈ ఒప్పందం చేశాను.
14 ‘Ní ọdún keje, ẹnìkọ̀ọ̀kan yín gbọdọ̀ tú àwọn Heberu tí wọ́n ti ta ara wọn fún un yín sílẹ̀ lẹ́yìn tí wọ́n ti sìn yín fún ọdún mẹ́fà. Ẹ gbọdọ̀ jẹ́ kí wọn kí ó lọ’; ṣùgbọ́n àwọn baba yín kò gbọ́; bẹ́ẹ̀ ni wọn kò fetí sí mi.
౧౪నీకు అమ్మకం జరిగాక, నీకు ఆరు సంవత్సరాలు దాస్యం చేసిన హెబ్రీయులైన మీ సహోదరులకు, ఏడు సంవత్సరాలు తీరిన తరువాత, విడుదల ప్రకటించాలి. కాని మీ పితరులు శ్రద్ధ వహించలేదు, నా మాట వినలేదు.”
15 Láìpẹ́ yìí ẹ ti ronúpìwàdà, ẹ sì ṣe ohun tí ó tọ́ lójú mi, ẹnìkọ̀ọ̀kan yín sì ṣe ìtúsílẹ̀ fún àwọn ènìyàn. Ẹ sì tún bá mi dá májẹ̀mú ní àwọn ilé tí a ti ń pe orúkọ mi.
౧౫“మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు.
16 Ṣùgbọ́n ẹ̀yin yípadà, ẹ sì sọ orúkọ mi di èérí, olúkúlùkù sì mú kí àwọn ẹni rẹ tí ó ti sọ di òmìnira bí ọkàn wọn ti fẹ́ padà; ẹ̀yin sì tún fi wọ́n ṣe ẹrú.
౧౬కాని, తరువాత మీరు మనస్సు మార్చుకుని నా పేరును అపవిత్రం చేశారు. వాళ్ళకు ఎటు ఇష్టమైతే అటు వెళ్ళగలిగేలా వాళ్ళను స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన తరువాత, అందరూ తమ దాసదాసీలను మళ్ళీ తెచ్చుకుని, తమకు దాసులుగా, దాసీలుగా ఉండడానికి వాళ్ళను బలవంతంగా మళ్ళీ పట్టుకున్నారు.”
17 “Nítorí náà báyìí ni Olúwa wí: Ẹ̀yin kò fetí sí mi nípa ọ̀rọ̀ òmìnira láàrín ẹ̀gbọ́n sí àbúrò, láàrín ẹnìkan sí èkejì rẹ̀. Wò ó, èmi yóò kéde òmìnira fún un yín ni Olúwa wí. Sí idà, sí àjàkálẹ̀-ààrùn, àti sí ìyàn, èmi ó sì fi yín fún ìwọ̀sí ní gbogbo ìjọba ilẹ̀ ayé.
౧౭కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.
18 Èmi ó ṣe àwọn ọkùnrin náà tí ó da májẹ̀mú mi, tí kò tẹ̀lé májẹ̀mú tí wọ́n ti dá níwájú mi bí ẹgbọrọ màlúù tí wọ́n gé sí méjì, tí ó sì kọjá láàrín ìpín méjì náà.
౧౮నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు.
19 Àwọn ìjòyè Juda àti àwọn ti Jerusalẹmu, àwọn aláṣẹ àti àwọn àlùfáà àti gbogbo àwọn ènìyàn ilẹ̀ náà tí ó kọjá láàrín àwọn ìpín méjèèjì ẹgbọrọ màlúù náà.
౧౯తరువాత యూదా నాయకులు, యెరూషలేము నాయకులు, నపుంసకులు, యాజకులు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ దున్నపోతు రెండు భాగాల మధ్య నడిచేవాళ్ళు. ఆ దున్నపోతుకు చేసినట్టు నేను వాళ్ళకు చేస్తాను.
20 Èmi ó fi wọ́n lé ọwọ́ àwọn ọ̀tá wọn, àti lé àwọn tí ń wá ẹ̀mí wọn lọ́wọ́. Òkú wọn yóò jẹ́ oúnjẹ fún àwọn ẹyẹ ojú ọ̀run àti fún àwọn ẹranko igbó.
౨౦వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను. వాళ్ళ శవాలు ఆకాశపక్షులకు, భూమృగాలకు ఆహారంగా ఉంటాయి.
21 “Sedekiah ọba àti àwọn ìjòyè rẹ̀ ní Juda ni èmí yóò fi lé àwọn ọ̀tá wọn lọ́wọ́, àti àwọn tí ń wá ẹ̀mí wọn àti lé ọwọ́ ogun Babeli tí ó ti lọ kúrò lọ́dọ̀ yín.
౨౧యూదా రాజైన సిద్కియాను, అతని నాయకులను, వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే వాళ్ళ శత్రువుల చేతికి, మీ మీదకు లేచిన బబులోను రాజు సైన్యం చేతికి అప్పగిస్తాను.”
22 Wò ó èmi ó pàṣẹ ni Olúwa wí, èmi ó sì mú wọn padà sí ìlú yìí, wọn ó sì bá a jà, wọn ó sì kó o, wọn ó fi iná jó o. Èmi ó sì sọ ìlú Juda dí ahoro.”
౨౨యెహోవా వాక్కు ఇదే. “నేను ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. వాళ్ళను ఈ పట్టణానికి మళ్ళీ తీసుకొస్తాను. వాళ్ళు దాని మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకుని, తగలబెడతారు. యూదా పట్టణాలను శిథిలాలుగా, నిర్జనంగా మారుస్తాను.”