< Deuteronomy 23 >

1 Kí ẹnikẹ́ni tí a fọ́ ní kóró ẹpọ̀n nípa rírùn tàbí gígé má ṣe wọ inú ìjọ Olúwa wá.
“చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు.
2 Kí ọmọ àlè má ṣe wọ ìpéjọ Olúwa, pàápàá títí dé ìran kẹwàá.
అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
3 Kí ọmọ Ammoni tàbí ọmọ Moabu, kì yóò wọ ìjọ Olúwa, àní títí dé ìran kẹwàá, ènìyàn wọn kan kì yóò wọ inú ìjọ ènìyàn Olúwa láéláé.
అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
4 Nítorí wọn kò fi àkàrà àti omi pàdé e yín lójú ọ̀nà nígbà tí ò ń bọ̀ láti Ejibiti àti nítorí wọ́n gba ẹ̀yà iṣẹ́ láti fi ọ́ gégùn ún Balaamu ọmọ Beori ará a Petori ti Aramu-Naharaimu.
ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు.
5 Síbẹ̀síbẹ̀, Olúwa Ọlọ́run rẹ kò ní fetí sí Balaamu ṣùgbọ́n ó yí ègún sí ìbùkún fún ọ, nítorí Olúwa Ọlọ́run rẹ fẹ́ràn rẹ.
అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు.
6 Ìwọ kò gbọdọ̀ wá àlàáfíà, tàbí ire wọn níwọ̀n ìgbà tí o sì wà láààyè.
మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.
7 Ìwọ kò gbọdọ̀ kórìíra ará Edomu kan nítorí arákùnrin rẹ ni. Ìwọ kò gbọdọ̀ kórìíra ará Ejibiti, nítorí o gbé gẹ́gẹ́ bí àjèjì ní ilẹ̀ rẹ̀.
ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు. ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు.
8 Ìran kẹta àwọn ọmọ tí a bí fún wọn lè wọ ìpéjọ Olúwa.
వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు.
9 Nígbà tí o bá dó ti àwọn ọ̀tá rẹ, pa gbogbo ohun àìmọ́ kúrò.
మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి.
10 Bí ọ̀kan nínú àwọn ọkùnrin rẹ bá jẹ́ aláìmọ́ nítorí ìtújáde tí ó ní, o ní láti jáde kúrò nínú àgọ́, kí o má ṣe wọ inú àgọ́.
౧౦రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి.
11 Ṣùgbọ́n nígbà tí ó bá di ìrọ̀lẹ́ o ní láti wẹ ara rẹ, àti ní àṣálẹ́ kí o padà sínú àgọ́.
౧౧అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు.
12 Sàmì sí ibìkan lóde àgọ́, níbi tí o lè máa lọ láti dẹ ara rẹ lára.
౧౨శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి.
13 Kí ìwọ kí ó sì mú ìwalẹ̀ kan pẹ̀lú ohun ìjà rẹ; yóò sì ṣe, nígbà tí ìwọ yóò bá gbọnṣẹ̀ lẹ́yìn ibùdó, kí ìwọ kí ó mú ìwalẹ̀, kí ìwọ kí ó sì yípadà, kí o sì bo ohun tí ó jáde láara rẹ.
౧౩మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి.
14 Nítorí Olúwa Ọlọ́run rẹ ń rìn láàrín àgọ́ láti dáàbò bò ọ́ àti láti fi àwọn ọ̀tá à rẹ lé ọ lọ́wọ́. Àgọ́ rẹ ní láti jẹ́ mímọ́, nítorí kí ó má ba à rí ohun àìtọ́ láàrín yín kí ó sì yípadà kúrò lọ́dọ̀ yín.
౧౪మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో.
15 Bí ẹrú kan bá ti gba ààbò lọ́dọ̀ rẹ, má ṣe fi lé ọ̀gá rẹ̀ lọ́wọ́.
౧౫తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు.
16 Jẹ́ kí ó máa gbé láàrín rẹ níbikíbi tí ó bá fẹ́ àti èyíkéyìí ìlú tí ó bá mú. Má ṣe ni í lára.
౧౬అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు.
17 Kí ọkùnrin tàbí obìnrin Israẹli má ṣe padà di alágbèrè ojúbọ òrìṣà.
౧౭ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు.
18 Ìwọ kò gbọdọ̀ mú owó iṣẹ́ panṣágà obìnrin tàbí ọkùnrin wá sí ilé Olúwa Ọlọ́run rẹ láti fi san ẹ̀jẹ́ kankan; nítorí Olúwa Ọlọ́run rẹ kórìíra àwọn méjèèjì.
౧౮పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
19 Ìwọ kò gbọdọ̀ ka èlé sí arákùnrin rẹ lọ́rùn, bóyá lórí owó tàbí oúnjẹ tàbí ohunkóhun mìíràn tí ó lè mú èlé wá.
౧౯మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.
20 Ìwọ lè ka èlé sí àlejò lọ́rùn, ṣùgbọ́n kì í ṣe arákùnrin ọmọ Israẹli, nítorí kí Olúwa Ọlọ́run rẹ lè bùkún ọ nínú ohun gbogbo tí o bá dáwọ́lé ní ilẹ̀ tí ò ń wọ̀ lọ láti ní.
౨౦పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.
21 Bí o bá jẹ́ ẹ̀jẹ́ fún Olúwa Ọlọ́run rẹ, má ṣe lọ́ra láti san án, nítorí Olúwa Ọlọ́run rẹ yóò béèrè rẹ̀ lọ́wọ́ rẹ, o sì máa jẹ̀bi ẹ̀ṣẹ̀.
౨౧మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది.
22 Ṣùgbọ́n tí o bá fàsẹ́yìn láti jẹ́ ẹ̀jẹ́, o kò ní jẹ̀bi.
౨౨ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు.
23 Rí i dájú pé o ṣe ohunkóhun tí o bá ti ètè rẹ jáde, nítorí pé ìwọ fi tinútinú rẹ jẹ́ ẹ̀jẹ́ fún Olúwa Ọlọ́run rẹ pẹ̀lú ẹnu ara rẹ.
౨౩మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.
24 Bí ìwọ bá wọ inú ọgbà àjàrà aládùúgbò rẹ, o lè jẹ gbogbo èso àjàrà tí o bá fẹ́, ṣùgbọ́n má ṣe fi nǹkan kan sínú agbọ̀n rẹ.
౨౪మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు.
25 Bí ìwọ bá wọ inú oko ọkà aládùúgbò rẹ, o lè fi ọwọ́ rẹ ya síírí rẹ̀, ṣùgbọ́n o kò gbọdọ̀ ki dòjé bọ ọkà tí ó dúró.
౨౫మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”

< Deuteronomy 23 >