< Deuteronomy 11 >

1 Ẹ fẹ́ràn Olúwa Ọlọ́run yín, kí ẹ sì pa ìfẹ́ rẹ̀, ìlànà rẹ̀, òfin rẹ̀ àti àṣẹ rẹ̀ mọ́ ní ìgbà gbogbo.
“కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.
2 Ẹ rántí lónìí pé, kì í ṣe àwọn ọmọ yín, ni ó rí ìbáwí Olúwa Ọlọ́run yín; títóbi rẹ̀, ọwọ́ agbára rẹ̀, nína ọwọ́ rẹ̀;
మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.
3 iṣẹ́ àmì rẹ̀ àti ohun tí ó ṣe ní àárín àwọn ará Ejibiti, sí Farao ọba Ejibiti àti gbogbo orílẹ̀-èdè rẹ̀.
ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు,
4 Ohun tí ó ṣe sí àwọn jagunjagun Ejibiti, sí kẹ̀kẹ́ ogun àti ẹlẹ́ṣin rẹ̀: bí ó ṣe rì wọ́n sínú Òkun Pupa, bí wọ́n ṣe ń lé e yín tí Olúwa fi pa wọ́n run pátápátá títí di òní olónìí yìí.
ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు.
5 Kì í ṣe àwọn ọmọ yín ni ó rí ohun tí ó ṣe fún un yín ní aginjù, títí ẹ fi dé ìhín yìí,
యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు.
6 ohun tí ó ṣe sí Datani àti Abiramu, àwọn ọmọ Eliabu, ẹ̀yà Reubeni, bí ilẹ̀ ti lanu ní ojú gbogbo ará Israẹli tí ó sì gbé wọn mì pẹ̀lú gbogbo ìdílé wọn, gbogbo àgọ́ ọ wọn àti gbogbo ohun alààyè tí ó jẹ́ tiwọn.
అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు.
7 Ṣùgbọ́n ojú u yín gan an ni ó rí gbogbo nǹkan ńlá wọ̀nyí tí Olúwa ti ṣe.
యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.
8 Nítorí náà, ẹ kíyèsi gbogbo àṣẹ tí mo ń fún yín lónìí, kí ẹ ba à lè lágbára àti lọ, kí ẹ sì gba ilẹ̀ náà tí ẹ ó la Jordani kọjá lọ.
కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,
9 Kí ẹ ba à lè pẹ́ ní orí ilẹ̀ tí Olúwa ti búra fún àwọn baba ńlá a yín, láti fún àwọn àti àwọn ọmọ wọn: ilẹ̀ tí ó ń sàn fún wàrà àti oyin.
యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి.
10 Ilẹ̀ tí ẹ̀ ń wọ̀ lọ láti gbà kò rí bí ilẹ̀ Ejibiti, níbi tí ẹ ti wá, níbi tó jẹ́ wí pé ẹsẹ̀ yín ni ẹ fi ń rìn lọ bomirin irúgbìn tí ẹ gbìn bí oko ẹ̀fọ́.
౧౦మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు.
11 Ṣùgbọ́n ilẹ̀ tí ẹ ó la Jordani kọjá láti gbà, jẹ́ ilẹ̀ olókè àti pẹ̀tẹ́lẹ̀ tí òjò ń rọ̀ sí latọ̀run.
౧౧మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.
12 Ilẹ̀ tí Olúwa Ọlọ́run yín ń mójútó ni, ojú Olúwa Ọlọ́run yín sì ń fi ìgbà gbogbo wà lórí rẹ̀, láti ìbẹ̀rẹ̀ ọdún dé òpin ọdún.
౧౨అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.
13 Nítorí náà, bí ẹ bá gbọ́rọ̀ sí àṣẹ tí mo fún un yín lónìí tọkàntọkàn: tí ẹ fẹ́ràn Olúwa Ọlọ́run yín, tí ẹ sì sìn ín, pẹ̀lú gbogbo àyà yín àti gbogbo ọkàn yín:
౧౩కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే,
14 nígbà náà, èmi yóò rọ òjò sórí ilẹ̀ ẹ yín lákòókò rẹ̀, àti òjò àkọ́rọ̀ àti ti àrọ̀kẹ́yìn, kí ẹ ba à lè kórè oúnjẹ yín wọlé àní wáìnì tuntun àti òróró.
౧౪మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.
15 Èmi yóò mú kí koríko hù lórí ilẹ̀ yín fún àwọn ohun ọ̀sìn in yín, ẹ ó sì jẹ, ẹ ó sì yó.
౧౫మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.
16 Ẹ ṣọ́ra, kí a má ba à tàn yín jẹ láti yípadà kí ẹ sì sin ọlọ́run mìíràn àti láti máa foríbalẹ̀ fún wọn.
౧౬మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
17 Nígbà náà ni ìbínú Olúwa yóò sì ru sí i yín, Òun yóò ti ìlẹ̀kùn ọ̀run kí òjò má ba à rọ̀, ilẹ̀ kì yóò sì so èso kankan, ẹ ó sì ṣègbé ní ilẹ̀ rere tí Olúwa fi fún un yín.
౧౭లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.
18 Ẹ fi gbogbo ọ̀rọ̀ mi wọ̀nyí sí àyà a yín, àti ọkàn an yín, ẹ so wọ́n bí àmì sórí ọwọ́ yín, kí ẹ sì so wọ́n mọ́ iwájú orí yín.
౧౮కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి.
19 Ẹ máa fi wọ́n kọ́ àwọn ọmọ yín, ẹ máa sọ̀rọ̀ nípa wọn bí ẹ bá jókòó nínú ilé, àti ní ojú ọ̀nà bí ẹ bá ń rìn lọ, bí ẹ bá sùn àti bí ẹ bá jí.
౧౯మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
20 Kí ìwọ kí ó kọ wọ́n sára òpó ilé rẹ̀, àti sí ara ìlẹ̀kùn ọ̀nà òde rẹ.
౨౦మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.
21 Kí ọjọ́ ọ yín àti ti àwọn ọmọ yín lè pọ̀ ní ilẹ̀ tí Olúwa ti búra láti fi fún àwọn baba ńlá a yín, ní ìwọ̀n ìgbà tí ọ̀run wà lókè tí ayé sì ń bẹ ní ìsàlẹ̀.
౨౧ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.
22 Bí ẹ bá fi ara balẹ̀ kíyèsi àwọn òfin tí mo ń fún un yín, láti tẹ̀lé, láti fẹ́ Olúwa Ọlọ́run yín, láti máa rìn ní gbogbo ọ̀nà rẹ̀ àti láti dìímú ṣinṣin:
౨౨మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.
23 Olúwa yóò sì lé gbogbo orílẹ̀-èdè wọ̀nyí kúrò níwájú u yín. Ẹ ó sì gba orílẹ̀-èdè tí ó lágbára tí ó sì tóbi jù yín lọ.
౨౩అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.
24 Gbogbo ibi tí ẹ bá fi ẹsẹ̀ ẹ yín tẹ̀ ni yóò jẹ́ tiyín, ilẹ̀ ẹ yín yóò gbilẹ̀ láti aginjù dé Lebanoni, àti láti odò Eufurate dé Òkun Ńlá.
౨౪మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.
25 Kò sí ẹni náà tí yóò lè kò yín lójú ìjà, Olúwa Ọlọ́run yín yóò fi ẹ̀rù àti ìwárìrì i yín sórí gbogbo ilẹ̀ náà bí ó ti ṣèlérí fún un yín ní gbogbo ibi tí ẹ bá lọ.
౨౫ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు.
26 Ẹ kíyèsi i, mo fi ìbùkún àti ègún lélẹ̀ níwájú u yín lónìí:
౨౬చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.
27 ìbùkún ni, bí ẹ bá pa òfin Olúwa Ọlọ́run yín, tí mo ń fún un yín lónìí mọ́.
౨౭నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది.
28 Ègún ni, bí ẹ bá ṣàìgbọ́ràn, sí òfin Olúwa Ọlọ́run yín, tí ẹ sì yapa kúrò ní ọ̀nà tí mo ti là sílẹ̀ fún yín lónìí, nípa títẹ̀lé ọlọ́run mìíràn, tí ẹ kò tí ì mọ̀.
౨౮మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.
29 Nígbà tí Olúwa Ọlọ́run yín bá ti mú un yín dé ilẹ̀ náà tí ẹ ń wọ̀ láti gbà, kí ẹ kéde àwọn ìbùkún náà ní orí òkè Gerisimu, kí ẹ sì kéde àwọn ègún ní orí òkè Ebali.
౨౯కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.
30 Bí ẹ ti mọ̀ pé àwọn òkè wọ̀nyí wà ní ìkọjá a Jordani ní apá ìwọ̀-oòrùn lójú ọ̀nà lọ sí ìhà ìlà-oòrùn, ní ẹ̀gbẹ́ igi ńlá igbó More, ní ilẹ̀ àwọn ará a Kenaani, tí wọ́n ń gbé ní aginjù, ni agbègbè Gilgali.
౩౦అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా.
31 Ẹ ti ṣetán láti la Jordani kọjá láti lè gba ilẹ̀ náà tí Olúwa Ọlọ́run yín ń fún un yín. Nígbà tí ẹ bá gbà á, tí ẹ bá sì ń gbé ibẹ̀,
౩౧మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు.
32 ẹ rí i dájú pé ẹ̀ ń gbọ́rọ̀ sí gbogbo ìlànà àti òfin tí mo ń gbé kalẹ̀ fún un yín lónìí.
౩౨ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.”

< Deuteronomy 11 >