< II Sa-mu-ên 12 >
1 Đức Giê-hô-va sai Na-than đến cùng Đa-vít. Vậy, Na-than đến cùng người mà rằng: Trong một thành kia có hai người, người nầy giàu, còn người kia nghèo.
౧యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. “ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు.
2 Người giàu có chiên bò rất nhiều;
౨ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి.
3 nhưng người nghèo, nếu chẳng kể một con chiên cái nhỏ mà người đã mua, thì chẳng có gì hết. Người nuôi nó; nó cùng lớn lên với con cái người tại nhà người, ăn đồ người ăn, uống đồ người uống, và ngủ trên lòng người; nó như một con gái của người vậy.
౩బీదవాడికి మాత్రం అతడు కొనుక్కొన్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతిముద్దలు తింటూ, వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకొంటూ అతని కూతురులాగా ఉండేది.
4 Vả, có người khách đến người giàu; người giàu tiếc không muốn đụng đến chiên bò của mình đặng dọn một bữa ăn cho người khách đã đến, bèn bắt con chiên con của người nghèo và dọn cho kẻ khách đã đến thăm mình.
౪ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు.”
5 Đa-vít bèn nổi giận lắm cùng người ấy, và nói cùng Na-than rằng: Ta chỉ Đức Giê-hô-va hằng sống mà thề, người đã phạm điều ấy thật đđng chết!
౫దావీదు ఈ మాటలు విని అలా చేసినవాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. “యెహోవా మీద ఒట్టు. ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు.
6 Hắn phải thường bốn lần giá chiên conkhông có lòng thương xót.
౬వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి” అని నాతానుతో అన్నాడు.
7 Bấy giờ, Na-than nói cùng Đa-vít rằng: Vua là người đó! Giê-hô-va Đức Chúa Trời của Y-sơ-ra-ên có phán như vầy: Ta đã xức dầu lập ngươi làm vua Y-sơ-ra-ên, ta đã giải cứu ngươi khỏi tay Sau-lơ.
౭నాతాను దావీదును చూసి “ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి
8 Ta cũng ban cho ngươi nhà của chủ ngươi, trao vào tay ngươi các vợ của chủ ngươi, lập ngươi làm vua của nhà Y-sơ-ra-ên và Giu-đa, và nếu điều đó không đủ, ắt ta sẽ thêm cho ơn khác nữa.
౮అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని.
9 Cớ sau ngươi đã khinh bỉ lời của Đức Giê-hô-va, mà làm điều không đẹp lòng Ngài? Ngươi đã dùng gươm giết U-ri, người Hê-tít, lấy vợ nó làm vợ ngươi, còn nó thì ngươi đã giết bởi gươm của dân Am-môn.
౯నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.
10 Nên bây giờ, gươm chẳng hề thôi hủy hoại nhà ngươi, bởi vì ngươi đã khinh ta, cướp vợ U-ri, người Hê-tít, đặng nàng làm vợ ngươi.
౧౦నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
11 Đức Giê-hô-va phán như vầy: Ta sẽ khiến từ nhà ngươi nổi lên những tai họa giáng trên ngươi; ta sẽ bắt các vợ ngươi tại trước mắt ngươi trao cho một người lân cận ngươi, nó sẽ làm nhục chúng nó tại nơi bạch nhựt.
౧౧నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను.
12 Vì ngươi đã làm sự kia cách kín nhiệm, nhưng ta sẽ làm việc nầy trước mặt cả Y-sơ-ra-ên và tại nơi bạch nhựt.
౧౨పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది” అని అన్నాడు.
13 Đa-vít bèn nói cùng Na-than rằng: Ta đã phạm tội cùng Đức Giê-hô-va. Na-than đáp cùng Đa-vít rằng: Đức Giê-hô-va cũng đã xóa tội vua; vua không chết đâu.
౧౩అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు.
14 Nhưng vì việc nầy vua đã gây dịp cho những kẻ thù nghịch Đức Giê-hô-va nói phạm đến Ngài, nên con trai đã sanh cho ngươi hẳn sẽ chết.
౧౪అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు.
15 Đoạn, Na-than trở về nhà mình. Đức Giê-hô-va bèn đánh đứa trẻ mà vợ của U-ri đã sanh cho Đa-vít, và nó bị đau nặng lắm.
౧౫కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
16 Đa-vít vì con cầu khẩn Đức Chúa Trời và kiêng ăn; đoạn, người trở vào nhà, trọn đêm nằm dưới đất.
౧౬యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు.
17 Các trưởng lão trong nhà chổi dậy đứng chung quanh người đặng đỡ người lên khỏi đất; nhưng người không khứng, và chẳng ăn với họ.
౧౭దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు.
18 Ngày thứ bảy đứa trẻ chết. Các tôi tớ của Đa-vít ngại cho người biết đứa trẻ đã chết; vì họ nói rằng: Lúc đứa trẻ còn sống, chúng tôi có khuyên giải vua, vua không khứng nghe chúng tôi; vậy làm sao chúng tôi lại dám nói cùng vua rằng đứa trẻ đã chết? Có lẽ vua rủi ro!
౧౮ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు.
19 Nhưng Đa-vít thấy những tôi tớ nó nhỏ nhỏ, hiểu rằng đứa trẻ đã chết, nên hỏi rằng: Có phải đứa trẻ đã chết chăng? Họ thưa: Phải, đã chết rồi.
౧౯ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకొంటాడేమో” అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. “బిడ్డ చనిపోయాడా?” అని తన సేవకులను అడిగాడు. వారు “చనిపోయాడు” అని జవాబిచ్చాడు.
20 Bấy giờ, Đa-vít chờ dậy khỏi đất, tắm mình, xức dầu thơm, và thay quần áo; rồi người đi vào đền của Đức Giê-hô-va và thờ lạy. Đoạn, người trở về cung, truyền dọn vật thực cho mình, và người ăn.
౨౦అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానంచేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి, తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనం తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు.
21 Các tôi tớ hỏi người rằng: Vua làm chi vậy? Khi đứa trẻ nầy còn sống, vua kiêng ăn và khóc vì nó; và bấy giờ, nó đã chết vua chờ dậy và ăn!
౨౧అతని సేవకులు “బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసంతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు. నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి?” అని దావీదును అడిగారు.
22 Vua đáp: Khi đứa trẻ còn sống, ta kiêng ăn và khóc lóc, vì ta nghĩ rằng: Nào ai biết; có lẽ Đức Giê-hô-va sẽ thương xót ta, và cho đứa trẻ được sống chăng.
౨౨అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను.
23 Nhưng bây giờ nó đã chết, ta kiêng ăn làm chi? Ta có thế làm cho nó trở lại ư? Ta sẽ đi đến nó nhưng nó không trở lại cùng ta.
౨౩ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా” అని వారితో చెప్పాడు.
24 Đa-vít an ủi Bát-sê-ba, vợ mình, đến ngủ cùng nàng; nàng sanh một đứa trai, đặt tên là Sa-lô-môn. Đức Giê-hô-va yêu mến Sa-lô-môn,
౨౪తరువాత దావీదు తన భార్య బత్షెబ దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చి ఆమెతో శయనించాడు. ఆమె ఒక కొడుకును కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు.
25 nên Ngài sai đấng tiên tri Na-than đến đặt tên cho nó là Giê-đi-đia, vì Đức Giê-hô-va yêu mến nó.
౨౫యెహోవా అతణ్ణి ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. అతడు యెహోవా చెప్పినట్టు ఆ బిడ్డకు యదీద్యా అని పేరు పెట్టాడు.
26 Giô-áp đánh Ráp-ba của dân Am-môn, và hãm lấy đế đô.
౨౬యోవాబు అమ్మోనీయుల ముఖ్య పట్టణం రబ్బా మీద యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. మిగతా నగరాలకు నీరు ఇక్కడినుండే సరఫరా అవుతుంది.
27 Người sai sứ giả đến cùng Đa-vít mà nói rằng: Tôi có đánh Ráp-ba và hãm lấy thành ở mạn dưới rồi.
౨౭యోవాబు దావీదు దగ్గరికి మనుషులను పంపి “నేను రబ్బా మీద యుద్ధం చేసి నీరు సరఫరా చేసే పట్టణాన్ని అక్రమించుకొన్నాను.
28 Bây giờ, vua hãy nhóm hiệp chiến sĩ còn lại, đến đóng trước thành và chiếm lấy nó, kẻo tôi hãm lấy nó thì công đó về tôi chăng.
౨౮నేను ఆక్రమించుకొన్న పట్టణానికి నా పేరు పెట్టుకోకుండేలా మిగిలిన సైన్యాన్ని సమకూర్చి పట్టణంపై దాడి చెయ్యి” అని కబురు చేశాడు.
29 Vậy, vua Đa-vít nhóm hiệp cả dân sự, kéo đến đánh Ráp-ba, vây và hãm lấy nó.
౨౯కాబట్టి దావీదు సైన్యాన్ని సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని, వారి రాజు కిరీటాన్ని అతని తలమీద నుండి తీసివేయించాడు. దాన్ని దావీదు తల మీద పెట్టారు. దాన్ని విలువైన రత్నాలతో చెక్కారు. దాని బరువు సుమారు నాలుగు కిలోలు.
30 Người lột cái mão triều thiên của vua dân Am-môn đội trên đầu; mão đó cân nặng một ta-lâng vàng, có trang sức những bửu thạch; Đa-vít đặt nó ở trên đầu mình. Người cũng đoạt lấy rất nhiều của cải thành mà đem đi.
౩౦ఇంకా అతడు ఆ పట్టణంలో నుండి ఎంతో విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళాడు.
31 Người điệu dân sự ở thành ấy ra, bắt chúng phải làm công dịch bằng cưa, bừa sắt, rìu sắt, và lò gạch; người cũng đãi hết thảy thành của dân Am-môn như vậy. Đoạn, Đa-vít và cả dân sự đều trở về Giê-ru-sa-lem.
౩౧పట్టుకున్న వారిని బయటికి తీసుకువచ్చి రంపాలతో, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్ళతో పని చేసేవారిగా, ఇటుక బట్టీల్లో పనిచేసేవారిగా నియమించాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటిలో అతడు ఇలాగే చేశాడు. ఆ తరువాత దావీదు, అతని మనుషులూ తిరిగి యెరూషలేము చేరుకున్నారు.