< Thánh Thi 60 >

1 Ðức Chúa Trời ôi! Chúa đã bỏ chúng tôi, tản lạc chúng tôi; Chúa đã nổi giận: ôi! xin hãy đem chúng tôi lại.
ప్రధాన సంగీతకారుని కోసం. షూషన్ ఎదూత్ అనే రాగంతో పాడేది. దావీదు ఆరామ్ నహరాయీమ్ వారితో అరామ్ సోబాయీ వారితో యుద్ధం చేసినప్పుడు యోవాబు ఉప్పు లోయలో పన్నెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి.
2 Chúa khiến đất rúng động, làm cho nó nứt ra; Xin hãy sửa lại các nơi nứt nó, vì lay động.
నీవు దేశాన్ని వణికించావు. దాన్ని ముక్కలుగా చేశావు. అది వణికిపోతున్నది. దానికి తగిలిన గాయాలు బాగు చెయ్యి.
3 Chúa đã làm cho dân sự Ngài thấy sự gian nan, Cho chúng tôi uống một thứ rượu xây xẩm.
నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని మాకు తాగించావు.
4 Chúa đã ban một cờ xí cho kẻ nào kính sợ Chúa, Ðặng vì lẽ thật mà xổ nó ra.
సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీవొక ధ్వజాన్ని ఇచ్చావు.
5 Hầu cho người yêu dấu của Chúa được giải thoát. Xin Chúa hãy lấy tay hữu mình mà cứu, và đáp lại chúng tôi.
నువ్వు ప్రేమించే వారికి విమోచన కలిగేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబు చెప్పు.
6 Ðức Chúa Trời đã phán trong sự thánh Ngài rằng: Ta sẽ hớn hở, Ta sẽ chia Si-chem và đo trũng Su-cốt.
తన పరిశుద్ధత తోడని దేవుడు ప్రమాణం చేశాడు. నేను ఆనందిస్తాను! షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపించి ఇస్తాను.
7 Ga-la-át thuộc về ta, Ma-na-se cũng vậy; Ép-ra-im là đồn lũy của đầu ta; Giu-đa là cây phủ việt ta.
గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
8 Mô-áp là cái chậu nơi ta tắm rửa; Ta sáng dép ta trước Ê-đôm. Hỡi đất Phi-li-tin, hãy reo mừng vì cớ ta.
మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియను బట్టి నేను సింహనాదం చేస్తాను.
9 Ai sẽ đưa tôi vào thành vững bền? Ai sẽ dẫn tôi đến Ê-đôm?
కోటగల బలమైన పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకుని వెళ్తాడు? ఎదోములోకి నన్ను ఎవడు నడిపిస్తాడు? అన్నాడు.
10 Hỡi Ðức Chúa Trời, há chẳng phải Chúa, là Ðấng đã bỏ chúng tôi sao? Hỡi Ðức Chúa Trời, Chúa không còn ra trận với đạo binh chúng tôi nữa.
౧౦దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కదా? మా సేనలతో కలిసి బయలుదేరడం నువ్వు మానేశావు కదా?
11 Xin Chúa cứu giúp chúng tôi khỏi sự gian truân; Vì sự cứu giúp của loài người là hư không.
౧౧మనుషుల సహాయం ప్రయోజనం లేనిది. శత్రువులను జయించడానికి మాకు సహాయం చెయ్యి.
12 Nhờ Ðức Chúa Trời chúng tôi sẽ làm việc cả thể; Vì chính Ngài sẽ giày đạp các cừu địch chúng tôi.
౧౨దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.

< Thánh Thi 60 >