< Xuất Hành 39 >
1 Họ dùng chỉ màu tím, đỏ điều, đỏ sặm mà chế bộ áo định cho sự tế lễ trong nơi thánh, và bộ áo thánh cho A-rôn, y như lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౧యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పవిత్ర స్థలం లో నిలిచి చేసే సేవ కోసం నీలం ఊదా ఎర్రని రంగుల సేవా వస్త్రాలు అంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు.
2 Vậy, họ chế ê-phót bằng kim tuyến, chỉ tím, đỏ điều, đỏ sặm, và vải gai đậu mịn.
౨అతడు బంగారంతో, నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో ఏఫోదు చేశాడు.
3 Họ căng vàng lá ra, cắt thành sợi chỉ mà xen cùng chỉ tím, đỏ điều, đỏ sặm, và chỉ gai mịn, chế thật cực xảo.
౩ఏఫోదు కోసం నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో, సన్నని నారతో నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగెలుగా కత్తిరించారు.
4 Họ may hai đai vai ê-phót, đâu hai đầu dính lại.
౪ఏఫోదుకు రెండు భుజ ఖండాలు చేసి రెండు అంచులలో నిలబెట్టారు.
5 Ðai để cột ê-phót, phía ngoài, làm nguyên miếng một y như công việc của ê-phót: bằng kim tuyến, chỉ tím, đỏ điều, đỏ sặm, và bằng chỉ gai đậu mịn, y như lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౫దానికి బంగారంతో నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో పేనిన అందమైన అల్లిక ఏకాండంగా రెండు వైపులా కుట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
6 Họ khảm trong khuôn vàng các bích ngọc có khắc tên các chi phái Y-sơ-ra-ên, như người ta khắc con dấu.
౬బంగారు అంచులలో పొదిగిన లేత పచ్చలు సిద్ధం చేశారు. ఇశ్రాయేలు కొడుకుల పేర్లు శాశ్వతంగా ఉండేలా ముద్రల రూపంలో చెక్కారు.
7 Họ để các ngọc đó trên đai vai ê-phót đặng làm ngọc kỷ niệm về dân Y-sơ-ra-ên, y như lời Ðức Giê-hô-va phán dặn Môi-se.
౭అవి ఇశ్రాయేలు ప్రజల జ్ఞాపకార్ధంగా ఉండేలా ఆ ముద్రలను ఏఫోదు భుజాల మీద ఉంచారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
8 Họ cũng chế bảng đeo ngực cực xảo, như công việc ê-phót: bằng kim tuyến, chỉ tím, đỏ điều, đỏ sặm, và chỉ gai đậu mịn.
౮అతడు బంగారంతోనూ నీలం ఊదా ఎర్ర దారాలతోను పేనిన సన్న నారతో ఏఫోదును చేసినట్టు నైపుణ్యంగా ఒక వక్షపతకం తయారుచేశాడు.
9 Bảng đeo ngực may lót, hình vuông, bề dài một em-ban, bề ngang một em-ban.
౯దాని పొడవు ఒక జాన, వెడల్పు ఒక జాన. ఆ పతకాన్ని మడత పెట్టినప్పుడు అది చదరంగా ఉంది.
10 Họ nhận bốn hàng ngọc: hàng thứ nhất, ngọc mã não, ngọc hồng bích, và ngọc lục bửu;
౧౦వారు దానిలో నాలుగు వరుసలుగా రత్నాలు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్న రత్నాలు,
11 hàng thứ nhì, ngọc phỉ túy, ngọc lam bửu, và ngọc kim cương;
౧౧రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంత మణులు ఉన్న రత్నాలు,
12 hàng thứ ba, ngọc hồng bửu, ngọc bạch mã não, và ngọc tử tinh;
౧౨మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి, ఇంద్రనీలాల రత్నాలు,
13 hàng thứ tư, ngọc huỳnh bích, ngọc hồng mã não, và bích ngọc. Các ngọc nầy đều khảm vàng.
౧౩నాలుగవ వరుసలో ఎర్ర రంగు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతాలు ఉన్న రత్నాలు క్రమ పద్ధతిలో పొదిగించారు.
14 Số ngọc là mười hai, tùy theo số danh của các con trai Y-sơ-ra-ên. Mỗi viên ngọc có khắc một tên trong mười hai chi phái Y-sơ-ra-ên như người ta khắc con dấu.
౧౪ఇశ్రాయేలు కొడుకులు పన్నెండు మంది పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ఆ రత్నాలపై ముద్రపై చెక్కిన విధంగా పన్నెండు గోత్రాల పేర్లు ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పేరు చెక్కారు.
15 Ðoạn, trên bảng đeo ngực họ chế các sợi chuyền bằng vàng ròng, đánh lại như hình dây.
౧౫వక్షపతకం కోసం దారాలు అల్లినట్టు స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు అల్లారు.
16 Cũng làm hai cái móc và hai cái khoanh bằng vàng, để hai khoanh nơi hai góc đầu bảng đeo ngực;
౧౬వారు రెండు బంగారు అంచులు, రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు.
17 cùng cột hai sợi chuyền vàng vào hai khoanh đó.
౧౭అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను వక్షపతకం అంచులలో ఉన్న రెండు గుండ్రని కొంకీలలో వేశారు.
18 Rồi chuyền hai đầu của hai sợi chuyền vào móc gài nơi đai vai ê-phót, về phía trước ngực.
౧౮అల్లిన ఆ రెండు గొలుసుల అంచులు ఆ రెండు అంచులకు తగిలించి ఏఫోదు భుజఖండాలపై దాని ఎదురుగా ఉంచారు.
19 Cũng làm hai khoanh vàng khác để vào hai góc đầu dưới của bảng đeo ngực, về phía trong ê-phót.
౧౯బంగారంతో రెండు గుండ్రని కొంకీలు చేసి ఏఫోదు ఎదురుగా ఉన్న వక్షపతకం లోపలి అంచు రెండు కొనలకు తగిలించారు.
20 Lại làm hai khoanh vàng khác nữa để nơi đầu dưới của hai đai vai ê-phót, về phía trước, ở trên đai, gần chỗ giáp mối.
౨౦బంగారంతో మరో రెండు గుండ్రని కొంకీలు ఏఫోదు అల్లిక పైగా దాని రెండవ కూర్పు దగ్గర దాని ఎదురుగా, ఏఫోదు రెండు భుజఖండాలకు కింది భాగంలో వేశారు.
21 Họ lấy một sợi dây màu tím, cột hai cái khoanh của bảng đeo ngực lại cùng hai cái khoanh ê-phót, hầu cho nó dính với đai và đừng rớt khỏi ê-phót, y như lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౨౧వక్షపతకం ఏఫోదు అల్లిక కట్టు మీద ఉండేలా, ఏఫోదు నుండి విడిపోకుండా ఉండేలా ఆ పతకాన్ని దాని గుండ్రని కొంకీలకూ ఏఫోదు కొంకీలకూ నీలం రంగు దారంతో కట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
22 Họ cũng chế áo dài của ê-phót bằng vải thường toàn màu tím.
౨౨అతడు ఏఫోదు అంగీ కేవలం నీలం రంగు దారంతో అల్లిక పనిగా చేశాడు. ఆ అంగీ మధ్య ఉన్న రంధ్రాన్ని మూసి ఉంచే కవచం ఏర్పాటు చేశారు.
23 Cổ để tròng đầu vào, ở về chính giữa áo, như lỗ áo giáp, có viền chung quanh cho khỏi tét.
౨౩ఆ రంధ్రం చిరిగి పోకుండా ఉండేందుకు రంధ్రం చుట్టూ కవచం ఉంచారు.
24 Nơi trôn áo, thắt những trái lựu bằng chỉ xe mịn màu tím, đỏ điều, đỏ sặm;
౨౪అంగీ అంచుల మీద నీలం ఊదా ఎర్రని రంగుల గల నూలుతో పేని దానిమ్మ పండ్ల ఆకారాలు చేశారు.
25 lại làm chuông nhỏ bằng vàng ròng, gắn giữa hai trái lựu, vòng theo chung quanh trôn áo;
౨౫స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి ఆ దానిమ్మపండ్ల ఆకారాల మధ్యలో, అంటే అంగీ అంచుల మీద చుట్టూ ఉన్న దానిమ్మ పండ్లవంటి వాటి మధ్యలో ఆ గంటలను పెట్టారు.
26 cứ một trái lựu, kế một cái chuông nhỏ, vòng theo chung quanh trôn áo dùng để hầu việc, y như lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౨౬యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సేవ జరిగించడానికి ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండు వంటి ఆకారాన్ని అంగీ అంచుల మీద చుట్టూ తగిలించారు.
27 Họ cũng chế áo lá mặc trong bằng vải gai mịn, dệt thường, cho A-rôn cùng các con trai người;
౨౭యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అహరోనుకు, అతని కొడుకులకు సన్నని నారతో అల్లిక పని చేసి అంగీలు నేశారు. సన్నని నారతో తలపాగాలను చేసారు.
28 luôn cái mũ, đồ trang sức của mũ, và quần lót trong, đều bằng vải gai đậu mịn;
౨౮సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.
29 cùng cái đai bằng vải gai đậu mịn, chỉ tím, đỏ điều, đỏ sặm, có thêu, y như lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౨౯నీలం, ఊదా, ఎర్ర రంగులతో పేనిన సన్నని నారతో నడికట్టును అల్లిక పనిగా చేశారు.
30 Họ cũng dùng vàng lá ròng chế cái thẻ thánh, khắc trên đó như người ta khắc con dấu, rằng: Thánh Cho Ðức Giê-hô-va!
౩౦స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు.
31 Rồi lấy một sợi dây tím đặng cột để trên mũ, y như lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౩౧ఆ ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
32 Các công việc của đền tạm và hội mạc làm xong là như vậy. Dân Y-sơ-ra-ên làm y như mọi lời Ðức Giê-hô-va đã phán dặn Môi-se.
౩౨ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.
33 Họ đem đền tạm đến cho Môi-se: Trại và các đồ phụ tùng của Trại, nọc, ván, xà ngang, trụ và lỗ trụ;
౩౩దైవ నివాసాన్ని, దానిలో సామగ్రి మొత్తాన్నీ అంటే, దాని కొక్కేలు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
34 bong da chiên đực nhuộm đỏ, bong da cá nược và cái màn;
౩౪ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పు, గండుచేప తోళ్ల పైకప్పు, పైకప్పు తెర,
35 hòm bảng chứng và đòn khiêng, cùng nắp thi ân;
౩౫శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం,
36 bàn và đồ phụ tùng của bàn cùng bánh trần thiết;
౩౬సన్నిధి బల్ల, దాని సామగ్రి, సన్నిధి రొట్టెలు,
37 chân đèn bằng vàng ròng, thếp đèn đã sắp sẵn, các đồ phụ tùng của chân đèn và dầu thắp,
౩౭పవిత్ర దీపవృక్షం, దాని దీపాలు, దీపాల వరుస, వాటి సామాను, దీపాలు వెలిగించేందుకు నూనె,
38 bàn thờ bằng vàng, dầu xức, hương liệu, tấm màn của cửa Trại;
౩౮బంగారం వేదిక, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యం, వేదిక ద్వారానికి తెర,
39 bàn thờ bằng đồng và rá đồng, đòn khiêng, các đồ phụ tùng của bàn thờ, thùng và chân thùng;
౩౯ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి మొత్తం, గంగాళం, దాని పీట,
40 các bố vi của hành lang, trụ, lỗ trụ, màn của cửa hành lang, dây, nọc, hết thảy đồ phụ tùng về việc tế lễ của đền tạm;
౪౦ప్రహరీ తెరలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు, ప్రహరీ ద్వారానికి తెర, దాని తాళ్ళు, మేకులు, సన్నిధి గుడారం మందిర సేవ కోసం కావలసిన సామగ్రి అంతా,
41 bộ áo lễ đặng hầu việc trong nơi thánh, bộ áo thánh cho A-rôn, thầy tế lễ cả, và bộ áo của các con trai người để làm chức tế lễ.
౪౧పవిత్ర స్థలం లో సేవ చేసే యాజకుడైన అహరోనుకూ, అతని కొడుకులకూ యాజక పరిచర్య పవిత్ర వస్త్రాలు సిద్ధం చేసి వాటన్నిటినీ మోషే దగ్గరికి తీసుకు వచ్చారు.
42 Dân Y-sơ-ra-ên làm mọi công việc nầy y như mạng lịnh của Ðức Giê-hô-va đã truyền cho Môi-se.
౪౨యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తిచేశారు.
43 Môi-se xem các công việc làm, thấy họ đều làm y như lời Ðức Giê-hô-va đã phán dặn; đoạn Môi-se chúc phước cho họ.
౪౩వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్ళను దీవించాడు.