< Xê-ca-ri-a 11 >
1 Li-ban ơi, mở rộng cửa cho lửa thiêu sạch vườn bá hương.
౧లెబానోనూ, నీ ద్వారాలు తెరిచి ఉంచు. అగ్నికణాలు వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి.
2 Khóc than đi cây trắc bá ơi, vì cây bá hương đã ngã; các cây tốt đẹp bị phá hủy. Than van đi các cây sồi ở Ba-san, vì rừng rậm bị đốn ngã rồi.
౨దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.
3 Lắng nghe tiếng khóc của người chăn chiên, vì cảnh huy hoàng đã trở nên tiêu điều. Lắng nghe tiếng gào của sư tử tơ, vì sự rực rỡ của Thung Lũng Giô-đan đã điêu tàn.
౩గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి.
4 Đây là điều Chúa Hằng Hữu, Đức Chúa Trời tôi phán: “Hãy đi và chăn bầy chiên đã định đưa đến lò sát sinh.
౪నా దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందను మేపు.
5 Người mua chiên rồi đem giết đi, cho rằng mình vô tội. Người đem chiên đi bán nói: ‘Ngợi tôn Chúa Hằng Hữu! Giờ đây tôi giàu có rồi!’ Trong khi người chăn cũng chẳng xót thương gì đến chiên mình.
౫వాటిని కొనుక్కున్న వాళ్ళు చంపినప్పటికీ నేరం అంటని వాళ్ళమేనని అనుకుంటారు. వాటిని అమ్మిన వారు ‘మాకు చాలా ధనం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం’ అని చెప్పుకుంటారు. వాటిని కావలి కాచేవారు వాటి పట్ల జాలి చూపించరు.”
6 Cũng vậy, Ta không thương hại dân này nữa,” Chúa Hằng Hữu phán. “Ta sẽ để cho chúng sát hại lẫn nhau, hoặc bị vua chúa của chúng sát hại đất lành sẽ biến ra hoang mạc. Ta sẽ không giải cứu chúng đâu.”
౬ఇదే యెహోవా వాక్కు. “ఇకపై నేను ఈ దేశనివాసులపై కనికరం చూపించను. ఒకరి చేతికి ఒకరిని వశపరుస్తాను. వాళ్ళ రాజుల చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తాను. ఆ రాజులు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళ చేతిలోనుండి నేనెవరినీ విడిపించను.”
7 Như thế, tôi đi chăn bầy chiên đã ấn định cho lò sát sinh. Tôi dùng hai cây gậy, đặt tên cây này là Thanh Lịch, cây kia là Liên Hiệp.
౭కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.
8 Trong vòng một tháng, tôi loại trừ được ba người chăn. Nhưng rồi tôi không chịu đựng được đàn chiên nữa, và chúng cũng chán ghét tôi.
౮నేను ఒక నెలలో ముగ్గురు కాపరులను తొలగించాను. ఎందుకంటే వాళ్ళు నా విషయంలో నీచంగా ప్రవర్తించారు. నేను వారి విషయంలో సహనం కనపరచ లేకపోయాను.
9 Tôi bảo: “Ta không còn là người của chúng mày nữa. Con nào chết, cứ chết đi. Con nào mất, cứ mất đi. Số còn lại ăn thịt nhau đi!”
౯కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను.
10 Rồi tôi cầm cây gậy Thanh Lịch, bẻ làm đôi, chứng tỏ khế ước tôi kết với các nước nay bị hủy.
౧౦ప్రజలందరితో నేను చేసిన ఒడంబడిక రద్దు చేసిన దానికి సూచనగా “అనుగ్రహం” అనే కర్రను తీసుకుని దాన్ని విరిచివేశాను.
11 Những con chiên khốn khổ theo tôi nhận biết rằng việc này do Chúa Hằng Hữu.
౧౧దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
12 Tôi nói: “Nếu anh em vui lòng, xin trả tiền công cho tôi; nếu không thì thôi cũng được.” Vậy, họ trả cho tôi ba mươi miếng bạc.
౧౨నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.
13 Rồi Chúa Hằng Hữu phán với tôi: “Hãy lấy số bạc ấy, là số bạc chúng định giá cho Ta, mà ném cho thợ gốm.” Tôi đem ba mươi miếng bạc ấy ném cho người thợ gốm trong Đền Thờ của Chúa Hằng Hữu.
౧౩అప్పుడు యెహోవా తిరస్కారంగా “వాళ్ళు నాకు అపురూపంగా ఇచ్చిన దాన్ని కుమ్మరికి పారవెయ్యి” అని నాకు ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 వెండి నాణేలను యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
14 Sau đó, tôi bẻ gãy cây gậy Liên Hiệp, cắt đứt tình anh em giữa Giu-đa và Ít-ra-ên.
౧౪తరువాత నేను యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధానికి భగ్నం కలిగేలా “ఐక్యం” అనే నా రెండవ కర్రను తీసుకుని దాన్ని విరగగొట్టాను.
15 Chúa Hằng Hữu phán bảo tôi: “Hãy cầm lấy dụng cụ của một người chăn vô lương.
౧౫అప్పుడు యెహోవా నాకు చెప్పినదేమిటంటే “మరోసారి కాపరి సామాన్లు తీసుకుని బుద్ధిలేని కాపరి వలే ప్రవర్తించు.
16 Vì Ta sẽ dấy lên cho đất này một người chăn không lưu tâm gì đến bầy chiên đang chết, không săn sóc chiên con, không băng bó chiên bị thương, không cho chiên mạnh ăn, nhưng ăn thịt con nào béo tốt và xé cả móng nó ra.
౧౬ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.
17 Khốn cho người chăn vô lương, là người bỏ mặc bầy mình! Nó sẽ bị gươm đâm tay và chọc thủng mắt phải. Tay nó sẽ vô dụng, và mắt nó sẽ mù hoàn toàn.”
౧౭మందను విడిచిపెట్టే పనికిమాలిన కాపరికి బాధ తప్పదు. వాడి చెయ్యి, కుడి కన్ను కత్తివేటుకు గురౌతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిదైపోతుంది.”