< Rô-ma 13 >
1 Mọi người phải vâng phục chính quyền vì tất cả thẩm quyền đến từ Đức Chúa Trời, tất cả chính quyền hiện hữu là từ Đức Chúa Trời.
౧ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.
2 Vậy ai chống chính quyền là chống lại mệnh lệnh Đức Chúa Trời và sẽ bị phán xét.
౨కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు.
3 Nhà cầm quyền không khiến cho người lương thiện kinh hãi, nhưng người gian ác phải lo sợ. Muốn khỏi sợ hãi nhà cầm quyền, anh chị em cứ làm điều ngay thẳng, thì họ sẽ khen ngợi anh chị em.
౩పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు.
4 Họ là những người Đức Chúa Trời sai phái để giúp anh chị em làm điều thiện, nhưng nếu anh chị em làm điều ác, hãy lo sợ, vì không thể trốn tránh hình phạt. Đức Chúa Trời dùng họ để phạt người làm ác.
౪వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు.
5 Vậy, phải vâng phục chính quyền, chẳng những để khỏi bị hình phạt nhưng cũng vì lương tâm trong sạch.
౫కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.
6 Do đó, anh chị em nộp thuế, vì nhà cầm quyền phục dịch Đức Chúa Trời khi họ thi hành nhiệm vụ.
౬ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.
7 Phải trả hết mọi thứ nợ: Trả thuế và đóng lợi tức cho người thu thuế, kính sợ và tôn trọng người có thẩm quyền.
౭ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
8 Đừng mắc nợ ai gì hết, trừ món nợ yêu thương. Vì yêu thương nhau là giữ trọn luật pháp.
౮ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.
9 Các điều răn dạy: “Chớ gian dâm. Các ngươi không được giết người. Các ngươi không được trộm cắp. Chớ tham muốn.” Tất cả những điều răn khác đều tóm tắt trong câu: “Yêu người lân cận như chính mình.”
౯ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.
10 Tình yêu thương chẳng làm hại đồng loại, vậy yêu thương là giữ trọn luật pháp.
౧౦ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
11 Hơn nữa, đã đến lúc anh chị em phải thức tỉnh, vì ngày hoàn thành sự cứu rỗi gần đến, gần hơn lúc ta mới tin.
౧౧కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది.
12 Đêm sắp qua, ngày gần đến. Vậy chúng ta hãy từ bỏ việc xấu xa trong đêm tối để làm việc công chính dưới ánh sáng.
౧౨రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం.
13 Phải ăn ở xứng đáng như sinh hoạt giữa ban ngày. Đừng chè chén say sưa, trụy lạc phóng đãng, đừng tranh giành, ganh ghét.
౧౩పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.
14 Hãy để Chúa Cứu Thế Giê-xu bảo bọc anh chị em như áo giáp. Đừng chiều theo các ham muốn của xác thịt.
౧౪చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.