< Khải Huyền 18 >
1 Sau đó, tôi thấy một thiên sứ khác từ trời xuống, có uy quyền rất lớn, hào quang chiếu khắp mặt đất.
౧ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
2 Thiên sứ lớn tiếng tuyên bố: “Ba-by-lôn lớn sụp đổ—thành vĩ đại sụp đổ hoàn toàn! Thành này đã biến thành sào huyệt của các quỷ. Nó là nơi giam giữ tà linh và các loài chim dơ dáy, gớm ghiếc.
౨అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
3 Mọi dân tộc sụp đổ vì đã uống rượu gian dâm điên cuồng của nó. Các vua trên thế gian đã gian dâm với nó. Các nhà buôn làm giàu nhờ sự xa hoa quá mức của nó.”
౩ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”
4 Tôi lại nghe một tiếng khác từ trời: “Dân Chúa! Hãy ra khỏi thành để khỏi dính dấp vào tội lỗi nó mà mang họa lây.
౪తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.
5 Vì tội lỗi nó chồng chất đến tận trời, và Đức Chúa Trời đã nhớ lại tội ác nó.
౫ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
6 Nó đối với các con thể nào. Hãy đáp lại nó thể ấy. Hơn nữa, hãy báo trả gấp hai những việc nó làm. Chén nó đã pha cho các con, hãy cho nó uống gấp đôi.
౬ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి.
7 Nó đã sống vinh hoa, xa xỉ thế nào, hãy cho nó chịu đau đớn khổ sở thế ấy. Nó nói thầm trong lòng: ‘Ta là nữ hoàng ngự trên ngai báu. Ta nào phải là quả phụ, và ta chẳng bao giờ phải khóc than.’
౭ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను” అనుకుంది.
8 Cho nên mọi tai họa sẽ giáng trên nó trong một ngày— nào đói khổ, tang chế và diệt vong. Nó sẽ bị thiêu trong lửa, vì Chúa là Đức Chúa Trời, Đấng Toàn Năng sẽ đoán phạt nó.”
౮కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.”
9 Các vua thế gian, là những người đã gian dâm và sống xa hoa với nó sẽ khóc lóc than vãn khi thấy khói thiêu đốt nó bay lên.
౯ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు.
10 Khiếp sợ vì nỗi đau đớn của nó, họ đứng xa than thở: “Khốn nạn cho kinh thành vĩ đại, Ba-by-lôn hùng cường đệ nhất! Chỉ trong một giờ sự phán xét của Đức Chúa Trời giáng trên ngươi.”
౧౦ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. “అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు.
11 Các nhà buôn trên thế giới cũng khóc lóc than vãn, vì chẳng còn ai mua hàng hóa của họ nữa.
౧౧లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు.
12 Hàng hóa gồm đủ loại: Vàng, bạc, đá quý, trân châu; vải gai mịn, vải màu tía, lụa, và vải màu điều; các loại gỗ thơm, các phẩm vật bằng ngà, và gỗ quý; đồng, sắt, và cẩm thạch.
౧౨వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాల రాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ
13 Quế, hương liệu, nhang, nhựa thơm, trầm hương, rượu, dầu ô-liu, bột, lúa mì, gia súc, chiên, ngựa, xe, và nô lệ—tức linh hồn người ta.
౧౩దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
14 Họ sẽ nói: “Mọi bảo vật nó ham chuộng đã lìa xa nó. Mọi cảnh xa hoa lộng lẫy cũng đã tan biến, chẳng còn trông thấy nữa.”
౧౪“నీ మనస్సు ఆశించిన ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు” అని చెబుతూ ఏడుస్తారు.
15 Các nhà buôn làm giàu nhờ giao thương với nó, cũng khiếp sợ vì nỗi đau đớn của nó, đứng cách xa than thở:
౧౫ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు.
16 “Khốn nạn cho kinh thành vĩ đại này! Nó mặc toàn vải gai mịn đỏ tía và đỏ tươi, trang sức bằng vàng, đá quý, và trân châu!
౧౬“సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, వెల గల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!” అంటారు.
17 Chỉ trong một giờ, sự giàu sang phồn thịnh kia tan biến!” Các thuyền trưởng, hành khách, hoa tiêu, và các nhà buôn đều đứng từ xa.
౧౭ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి
18 Nhìn thấy khói thiêu đốt nó bốc lên, họ kêu la: “Còn thành nào vĩ đại như thành này không?”
౧౮నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ మహా నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు.
19 Họ sẽ vãi bụi đất lên đầu than khóc: “Khốn nạn, khốn nạn cho thành vĩ đại này! Tất cả chủ thuyền trở nên giàu có nhờ sự di chuyển tấp nập trên biển của nó. Nhưng chỉ trong một giờ nó đã hoang tàn.”
౧౯తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు.
20 Hãy vui mừng về nó, hỡi bầu trời, cùng các thánh đồ, các sứ đồ, và các tiên tri! Vì Đức Chúa Trời đã xét xử nó theo cách nó đã xét xử các ngươi.
౨౦“పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”
21 Một thiên sứ uy dũng nhấc một tảng đá như cối xay lớn quăng xuống biển, và tuyên bố: “Thành Ba-by-lôn lớn sẽ bị quăng xuống như thế, chẳng còn ai trông thấy nữa.
౨౧ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
22 Tiếng hát ca, tiếng đàn hạc, tiếng sáo, hay tiếng kèn sẽ không được nghe từ thành này nữa. Chẳng tìm thấy thợ thủ công hay kỹ nghệ nào. Cả tiếng cối xay cũng im bặt trong thành này.
౨౨కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
23 Không còn thấy ánh đèn, Không còn nghe tiếng cô dâu chú rể nơi đó nữa. Các nhà buôn của nó từng nổi tiếng khắp thế giới, và nó dùng tà thuật lừa gạt mọi quốc gia.
౨౩దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.”
24 Máu của các tiên tri và thánh đồ, cùng máu của mọi người bị giết trên thế giới cũng tìm thấy tại thành này.”
౨౪ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.