< Khải Huyền 16 >

1 Tôi nghe một tiếng lớn từ trong Đền Thờ nói với bảy thiên sứ: “Hãy đi, đổ bảy bát hình phạt của Đức Chúa Trời xuống đất!”
అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, “మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి” అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం నేను విన్నాను.
2 Thiên sứ thứ nhất đổ bát mình xuống đất, những người mang dấu hiệu con thú và thờ lạy tượng nó liền bị nổi ung nhọt độc địa ghê tởm.
అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూరమృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి.
3 Thiên sứ thứ hai đổ bát mình xuống biển, nước biển biến thành huyết như máu người chết, mọi sinh vật trong biển đều chết.
రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.
4 Thiên sứ thứ ba đổ bát mình xuống sông ngòi, suối nước, tất cả đều biến thành máu.
మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి.
5 Tôi nghe thiên sứ có quyền trên nước nói: “Lạy Đấng hiện có, đã có, là Đấng Thánh! Ngài đã xét xử thật công minh.
అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు.
6 Họ đã làm đổ máu các thánh đồ và các tiên tri, nên Ngài cho họ uống máu. Thật đáng lắm!”
అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు.
7 Tôi nghe tiếng từ bàn thờ nói: “Phải, lạy Chúa là Đức Chúa Trời, Đấng Toàn Năng, Chúa xét xử thật công minh, chân chính.”
అప్పుడు బలిపీఠం, “అవును, ప్రభూ దేవా, సర్వశక్తి శాలీ, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి” అని జవాబివ్వగా విన్నాను.
8 Thiên sứ thứ tư đổ bát mình xuống mặt trời; mặt trời được phép nung đốt loài người.
నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషులను తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది.
9 Bị sức nóng mãnh liệt nung đốt, người ta xúc phạm đến Danh Đức Chúa Trời là Đấng có quyền trên các tai hoạ này. Họ không chịu ăn năn và tôn vinh Ngài.
మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు.
10 Thiên sứ thứ năm đổ bát mình xuống ngai con thú, vương quốc của nó bỗng tối tăm, người ta cắn lưỡi vì đau đớn.
౧౦అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.
11 Họ nói xúc phạm đến Đức Chúa Trời trên trời vì đau đớn và ung nhọt, chứ không chịu ăn năn.
౧౧అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు.
12 Thiên sứ thứ sáu đổ bát mình xuống sông lớn gọi là Ơ-phơ-rát, sông liền cạn khô, dọn đường cho các vua từ phương Đông đi đến.
౧౨ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.
13 Tôi thấy có ba tà linh giống như ếch nhái ra từ miệng con rồng, miệng con thú, và miệng tiên tri giả.
౧౩అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను.
14 Đó là thần của quỷ, chuyên làm phép lạ, đi xúi giục các vua trên thế giới liên minh chiến tranh chống với Đức Chúa Trời trong ngày trọng đại của Đấng Toàn Năng.
౧౪అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.
15 “Này, Ta đến như kẻ trộm! Phước cho người nào tỉnh thức và giữ gìn áo xống mình, để không phải trần trụi, xấu hổ lúc ra đi.”
౧౫“వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.”
16 Họ tập trung quân đội các vua tại một chỗ mà tiếng Hê-bơ-rơ gọi là Ha-ma-ghê-đôn.
౧౬హీబ్రూ భాషలో ‘హర్ మెగిద్దోన్’ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
17 Thiên sứ thứ bảy đổ bát mình trong không khí. Một tiếng lớn vang ra từ ngai trong Đền Thờ: “Xong rồi!”
౧౭ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది.
18 Liền có chớp nhoáng, sấm sét vang rền và động đất dữ dội. Trong lịch sử loài người, chưa hề có trận động đất nào dữ dội, lớn lao đến thế.
౧౮అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది.
19 Thành Ba-by-lôn vỡ ra làm ba và các thành khắp thế giới bị sụp đổ. Đức Chúa Trời đã nhớ lại Ba-by-lôn lớn và cho nó uống chén rượu hình phạt của Ngài.
౧౯ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు.
20 Mọi hải đảo đều biến mất, núi non cũng chẳng còn thấy nữa.
౨౦ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది.
21 Lại có mưa đá rất lớn, mỗi hạt nặng độ 34 ký từ trời đổ xuống trên loài người. Người ta xúc phạm đến Đức Chúa Trời vì họa mưa đá khủng khiếp.
౨౧ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.

< Khải Huyền 16 >