< Thánh Thi 39 >
1 (Thơ của Đa-vít, soạn cho nhạc trưởng Giê-đu-thun) Tôi tự nhủ: “Tôi sẽ cố giữ gìn nếp sống, giữ cho miệng lưỡi không sai phạm, và khi người ác xuất hiện, tôi bịt chặt miệng như phải ngậm tăm.”
౧ప్రధాన సంగీతకారుడు యెదూతూను కోసం. దావీదు కీర్తన ఇది నా నిర్ణయం, నా నాలుకతో పాపం చేయకుండా ఉండటానికి నా మాటలను జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గుడి దగ్గర నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.
2 Nhưng khi tôi âm thầm, câm nín— việc phải cũng chẳng nói ra— thì nỗi đau xót trào dâng.
౨నేను మౌనంగా ఉన్నాను. మంచి సంగతులను కూడా పలకకుండా ఉన్నాను. నా వేదన అధికమైంది.
3 Lòng bồn chồn nóng nảy, như lửa đốt cháy thiêu lúc trầm mặc đăm chiêu. Tôi liền mở miệng:
౩నా గుండె నాలో రగులుతూ ఉంది. ఈ విషయాలను గూర్చి నేను ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా అగ్నిలా మండుతున్నది. చివరకు నేను ఇలా అన్నాను.
4 “Chúa Hằng Hữu ôi, xin cho con biết hồi chung kết. Đời con thắm thoắt được bao lâu— thân phận mong manh đến bực nào.
౪యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.
5 Đời con dài lắm độ gang tay, khác chi hư không trước mặt Chúa; đời người đều ví như hơi thở.”
౫ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. (సెలా)
6 Chúng con chập chờn như chiếc bóng, chen chúc lợi danh trò ảo mộng, tiền tài tích trữ để cho ai.
౬నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.
7 Lạy Chúa, có ai đáng cho con hy vọng? Hy vọng con chỉ đặt nơi Ngài.
౭ప్రభూ, ఇప్పుడు నేను దేని కోసం వేచి ఉన్నాను? నాకున్న ఆధారం నువ్వే.
8 Xin cứu con khỏi mọi điều vi phạm. Đừng để người ngu si sỉ nhục.
౮నా పాపాలన్నిటిపైనా నాకు విజయం దయచెయ్యి. మూర్ఖులు అవమానించడానికి లక్ష్యంగా నన్ను చేయవద్దు.
9 Miệng con vẫn khép chặt, lặng yên. Vì Chúa đã khiến nên như vậy.
౯ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను.
10 Xin Chúa thương, ngừng tay đánh phạt! Vì con kiệt sức và mỏi mòn.
౧౦నన్ను గాయపరచడం ఇక ఆపు. నీ చేతి దెబ్బ నన్ను అణచివేస్తుంది.
11 Khi Chúa quở trách trừng phạt ai vì tội lỗi, Ngài làm cho ước vọng họ phai tàn. Thật đời người chỉ là hơi thở.
౧౧పాపం కారణంగా నువ్వు మనుషులను శిక్షించినప్పుడు చెద పురుగులా వారి శక్తిని నువ్వు హరిస్తావు. నిశ్చయంగా మనుషులందరూ ఆవిరిలాంటి వాళ్ళు. (సెలా)
12 Chúa Hằng Hữu ôi, xin nghe lời con khẩn nguyện! Xin lắng tai nghe tiếng kêu van! Đừng thờ ơ khi lệ con tuôn tràn. Vì con chỉ là kiều dân— phiêu bạt khắp mọi miền, là lữ hành như tổ phụ con.
౧౨యెహోవా, నా ప్రార్థన విను. నేను చెప్పేది విను. నా రోదనను పట్టించుకో. చెవిటివాడిలాగా ఉండకు. నీ ఎదుట నేను పరదేశిలా ఉన్నాను. నా పూర్వీకులందరిలాగ శరణార్ధిలాగా ఉన్నాను.
13 Xin Chúa tha tội để con phấn khởi, vui tươi trước khi con qua đời và không còn nữa!
౧౩నేను చనిపోయేముందు నేను సంతోషించేలా నా నుంచి నీ కోపపు చూపులు చాలించుకో.