< Dân Số 3 >
1 Đây là những người trong gia đình A-rôn và Môi-se trong thời gian Chúa Hằng Hữu phán với Môi-se trên Núi Si-nai.
౧యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.
2 Tên các con trai A-rôn là: Na-đáp, con trưởng nam, A-bi-hu, Ê-lê-a-sa, và Y-tha-ma.
౨అహరోను పెద్ద కొడుకు నాదాబు. ఆ తరువాత అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
3 Đó là tên các con trai A-rôn, tức các thầy tế lễ được xức dầu và tấn phong để phục vụ trong chức tế lễ.
౩ఈ పేర్లు కలిగిన అహరోను కొడుకులు యాజకులుగా పనిచేయడానికి అభిషేకం పొందారు. వారిని యాజకులుగా ప్రతిష్టించారు.
4 Tuy nhiên, Na-đáp và A-bi-hu đã ngã chết trước mặt Chúa Hằng Hữu khi họ dâng hương lên Chúa Hằng Hữu trong hoang mạc Si-nai bằng một thứ lửa Ngài không cho phép. Họ không có con trai nên chỉ có Ê-lê-a-sa và Y-tha-ma phục vụ trong chức thầy tế lễ dưới sự hướng dẫn của A-rôn, cha họ.
౪కాని నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్నిని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తమ తండ్రి అయిన అహరోనుతో కలసి యాజక సేవ జరిగించారు.
5 Chúa Hằng Hữu phán bảo Môi-se:
౫తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకుని రా.
6 “Hãy đem đại tộc Lê-vi đến, đặt họ dưới quyền Thầy Tế lễ A-rôn để họ giúp đỡ người.
౬వారిని అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతనికి సహాయకులుగా ఉండాలి.
7 Họ phải thi hành các nhiệm vụ thay cho A-rôn và toàn thể dân chúng tại Đền Tạm bằng cách phục vụ trong Đền Tạm.
౭వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.
8 Họ phải chăm sóc tất cả vật dụng trong lều thánh, thi hành các bổn phận của người Ít-ra-ên bằng cách phục vụ trong Đền Tạm.
౮సన్నిధి గుడారంలోని అలంకరణలూ, వస్తువుల విషయమై వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాల ప్రజలు మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వాళ్లకి సహాయం చేయాలి.
9 Trong vòng người Ít-ra-ên họ là những người duy nhất được giao trọn cho A-rôn.
౯కాబట్టి నువ్వు లేవీయులను అహరోనుకూ అతని కొడుకులకూ అప్పగించు. ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేయడంలో వారు అహరోనుకి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు.
10 Con hãy bổ nhiệm A-rôn và các con trai người làm thầy tế lễ. Bất cứ người nào khác xâm phạm vào chức vụ này sẽ bị xử tử.”
౧౦నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.”
11 Chúa Hằng Hữu lại phán bảo Môi-se:
౧౧యెహోవా మోషేతో ఇంకా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
12 “Ta đã chọn người Lê-vi giữa những người Ít-ra-ên để thay thế cho các con trai đầu lòng của người Ít-ra-ên. Người Lê-vi thuộc về Ta,
౧౨“ఇశ్రాయేలు ప్రజల్లో నుండి నేను లేవీయులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రతి మొదటి మగ సంతానాన్ని తీసుకోడానికి బదులుగా నేను లేవీయులను తీసుకున్నాను. వారు నా వారు.
13 vì tất cả con trai đầu lòng đều thuộc về Ta. Khi Ta đánh hạ tất cả con đầu lòng tại Ai Cập, Ta đã biệt riêng cho Ta tất cả con đầu lòng của Ít-ra-ên, cả người lẫn thú vật. Họ phải thuộc về Ta. Ta là Chúa Hằng Hữu.”
౧౩మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.”
14 Chúa Hằng Hữu phán bảo Môi-se tại hoang mạc Si-nai:
౧౪సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
15 “Hãy kiểm kê dân số người Lê-vi tùy theo gia tộc và họ hàng. Con hãy kiểm kê tất cả người nam từ một tháng trở lên.”
౧౫“లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.”
16 Như vậy, Môi-se kiểm kê họ đúng như lời Chúa Hằng Hữu truyền bảo mình.
౧౬మోషే యెహోవా తనకు ఆదేశించిన ప్రకారం ఆయన చెప్పినట్టే వారిని లెక్కించాడు.
17 Đây là tên các con trai Lê-vi: Ghẹt-sôn, Kê-hát, và Mê-ra-ri.
౧౭లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు.
18 Đây là tên con trai Ghẹt-sôn: Líp-ni và Si-mê-i.
౧౮గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.
19 Gia tộc từ Kê-hát là: Am-ram, Dít-sa, Hếp-rôn, và U-xi-ên.
౧౯కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.
20 Con trai Mê-ra-ri là: Mách-li và Mu-si. Đó là những tổ các thị tộc trong đại tộc Lê-vi.
౨౦మెరారి కొడుకుల పేర్లు మాహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవీ వంశానికి చెందిన తెగలు.
21 Con cháu Líp-ni là Si-mê-i thuộc về Ghẹt-sôn; đó là dòng họ Ghẹt-sôn.
౨౧గెర్షోను వంశస్తులు లిబ్నీయులు, షిమీయులు. గెర్షోనీయుల తెగలు అంటే వీరే.
22 Tổng số người nam từ một tháng trở lên được 7.500 người.
౨౨వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7, 500 మంది ఉన్నారు.
23 Dòng họ Ghẹt-sôn phải cắm trại phía tây phía sau Đền Tạm.
౨౩గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి.
24 Người lãnh đạo gia tộc Ghẹt-sôn là Ê-li-a-sáp, con La-ên.
౨౪గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి.
25 Trách nhiệm của dòng họ Ghẹt-sôn tại Đền Tạm là trông coi lều, mái phủ lều, bức màn nơi cửa,
౨౫గెర్షోను వంశం వారు సన్నిధి గుడారంలో మందిరానికీ, పైకప్పుగా ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇంకా గుడారానికీ, పైకప్పుకీ, సన్నిధి గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉండే తెరలకీ బాధ్యత వహించాలి.
26 các bức màn trong hành lang, bức màn tại cửa hành lang bao quanh Đền Tạm và bàn thờ, và các sợi dây thừng cùng tất cả dịch vụ bảo quản những thứ đó.
౨౬మందిరమూ, బలిపీఠమూ ఉండే ఆవరణ అడ్డతెరలకూ, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలకూ వారు బాధ్యత వహించాలి. సన్నిధి గుడారం లోని తాళ్లకీ దానిలో ఉన్న సమస్తానికీ వారు బాధ్యత వహించాలి.
27 Dòng họ Am-ram, Dít-sê-ha, Hếp-rôn, và U-xi-ên thuộc về Kê-hát; đó là dòng họ Kê-hát.
౨౭కహాతు నుండి అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనే తెగలు కలిగాయి. ఇవి కహాతీయుల తెగలు
28 Tổng số người nam từ một tuổi trở lên được 8.600 người. Dòng họ Kê-hát chịu trách nhiệm chăm sóc nơi thánh.
౨౮వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8, 600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి.
29 Dòng họ Kê-hát phải cắm trại phía nam Đền Tạm.
౨౯కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.
30 Người lãnh đạo gia tộc Kê-hát là Ê-li-sa-phan, con U-xi-ên.
౩౦కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి.
31 Họ chịu trách nhiệm chăm sóc Hòm Giao Ước, cái bàn, chân đèn, các bàn thờ, và bảo quản những thứ đó, cùng tấm màn, và các vật dụng phụ thuộc.
౩౧వీరు మందసం, బల్ల, దీపస్తంభం, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధస్థలం తెర ఇంకా పరిశుద్ధస్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి.
32 Đứng đầu các vị lãnh đạo đại tộc Lê-vi là Ê-lê-a-sa, con trai Thầy Tế lễ A-rôn; ông giám sát những người chịu trách nhiệm coi sóc nơi thánh.
౩౨లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. అతడు పరిశుద్ధస్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి.
33 Họ hàng Mách-li và họ hàng Mu-si thuộc về Mê-ra-ri; đó là dòng họ Mê-ra-ri.
౩౩మెరారి నుండి రెండు తెగలు కలిగాయి. అవి మహలీయులు, మూషీయులు. ఇవి మెరారి తెగలు.
34 Tổng số người nam từ một tháng trở lên được 6.200 người.
౩౪వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6, 200 మంది ఉన్నారు.
35 Người lãnh đạo gia tộc Mê-ra-ri là Xu-ri-ên, con A-bi-hai: Họ phải cắm trại phía bắc Đền Tạm.
౩౫మెరారీ తెగలకు అబీహాయిలు కొడుకు సూరీయేలు నాయకత్వం వహించాలి. వారు మందిరానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.
36 Người Mê-ra-ri được bổ nhiệm coi sóc các khung của Đền Tạm, các cây xà ngang, các cây cột, đế cột, cùng tất cả các vật dụng. Họ chịu trách nhiệm bảo quản những thứ đó
౩౬మెరారి వంశస్తులు మందిరపు పలకలకూ, దాని అడ్డకర్రలకూ, దాని స్తంభాలకూ, దాని మూలాలకూ, దాని స్థిర సామగ్రికీ, ఇంకా దానికి సంబంధిన వాటన్నిటికీ,
37 cùng coi sóc các cây cột và đế cột chung quanh hành lang, các cây cọc, và dây thừng.
౩౭అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకీ, వాటి దిమ్మలకీ, మేకులకీ, తాళ్లకీ బాధ్యత వహించాలి.
38 Môi-se và A-rôn cùng các con trai người phải cắm trại ở phía đông Đền Tạm, về phía mặt trời mọc ngay trước Trại Hội Kiến. Họ phải chịu trách nhiệm coi sóc nơi thánh thay cho người Ít-ra-ên. Người nào xâm phạm đến gần nơi thánh sẽ bị xử tử.
౩౮మోషే, అహరోనూ, అతని కొడుకులూ మందిరానికి తూర్పు వైపున సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకూ, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకూ వారు బాధ్యత వహించాలి. పరాయి వాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
39 Tổng số người Lê-vi được kiểm kê theo lệnh Chúa Hằng Hữu truyền cho Môi-se và A-rôn, chia theo từng họ hàng, tức là các con trai từ một tháng trở lên, được 22.000 người.
౩౯యెహోవా తమకు ఆదేశించినట్లు మోషే అహరోనులు లేవీ వంశంలో ఒక నెల వయసున్న మగ బిడ్డ నుండి అందర్నీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు.
40 Chúa Hằng Hữu phán dạy Môi-se: “Con hãy kiểm kê tất cả con trai đầu lòng người Ít-ra-ên từ một tháng trở lên, và lập bảng danh sách.
౪౦తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి.
41 Con hãy thu nhận cho Ta người Lê-vi thay cho tất cả con đầu lòng người Ít-ra-ên, và các bầy gia súc của người Lê-vi thay cho tất cả con đầu lòng của gia súc người Ít-ra-ên. Ta là Chúa Hằng Hữu.”
౪౧నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నాకోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నాకోసం తీసుకోవాలి.”
42 Như thế, Môi-se kiểm kê tất cả con đầu lòng của người Ít-ra-ên, như Chúa Hằng Hữu đã truyền bảo người.
౪౨యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు.
43 Tổng số con trai đầu lòng liệt kê từng tên, được 22.273.
౪౩ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది.
44 Chúa Hằng Hữu lại phán bảo Môi-se:
౪౪తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు.
45 “Con hãy thu nhận người Lê-vi thay cho tất cả con đầu lòng người Ít-ra-ên và gia súc của người Lê-vi thay cho gia súc của người Ít-ra-ên. Người Lê-vi sẽ thuộc về Ta; Ta là Chúa Hằng Hữu.
౪౫“ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22, 273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను.
46 Về phần 273 con đầu lòng Ít-ra-ên là số trội hơn tổng số người Lê-vi,
౪౬ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో.
47 con hãy chuộc lại bằng cách thu mỗi người năm miếng bạc theo tiêu chuẩn cân đo trong nơi thánh.
౪౭పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు.
48 Hãy giao số bạc chuộc các người Ít-ra-ên phụ trội đó cho A-rôn và các con trai người.”
౪౮ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.”
49 Như thế, Môi-se thu bạc chuộc của những người phụ trội đó.
౪౯కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు.
50 Môi-se thu được 15,5 ký bạc (theo tiêu chuẩn cân đo trong nơi thánh) của mỗi con đầu lòng người Ít-ra-ên.
౫౦ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1, 365 తులాలు సేకరించాడు.
51 Môi-se giao bạc chuộc đó cho A-rôn và các con trai người, đúng như lời Chúa Hằng Hữu đã truyền bảo mình.
౫౧మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు.