< Dân Số 22 >

1 Sau đó, người Ít-ra-ên lại ra đi, đến đồng bằng Mô-áp, và cắm trại bên kia Sông Giô-đan, đối diện Giê-ri-cô.
తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.
2 Ba-lác, vua Mô-áp, con Xếp-bô, thấy những việc người Ít-ra-ên làm cho người A-mô-rít.
సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.
3 Mô-áp càng kinh hoàng vì thấy người Ít-ra-ên đông đảo quá.
ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.
4 Người Mô-áp bàn với các trưởng lão Ma-đi-an: “Dân này sẽ ăn nuốt chúng ta như bò ăn cỏ vậy!” Vì thế, Ba-lác, vua Mô-áp
మోయాబీయులు మిద్యాను పెద్దలతో “ఒక ఎద్దు పొలంలో ఉన్న పచ్చిగడ్డి తినేసినట్టు ఈ జనసమూహహం ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా తినేస్తారు” అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకు బాలాకు మోయాబీయులకు రాజు.
5 gửi một phái đoàn đi tìm Ba-la-am, con của Bê-ô ở Phê-thô-rơ gần Sông Ơ-phơ-rát, nói rằng: “Một dân tộc đến từ Ai Cập đông như kiến, phủ đầy mặt đất, đang đóng đối diện chúng tôi.
కాబట్టి అతడు బెయోరు కొడుకు బిలామును పిలవడానికి అతని ప్రజల దేశంలో ఉన్న నది దగ్గర ఉన్న పెతోరుకు ఇలా కబురంపారు. “చూడు, ఒక జాతి ఐగుప్తులోనుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి, ఇప్పుడు నాకు ఎదురు గుండా శిబిరం వేసుకున్నారు.
6 Xin ông đến nguyền rủa họ, vì họ mạnh hơn chúng tôi. Có lẽ nhờ ông, chúng tôi có thể đuổi họ đi. Vì tôi biết rằng, ai được ông chúc phước sẽ được phước, còn ai bị ông nguyền rủa sẽ bị tai họa.”
కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించు. వారు నాకంటే చాలా బలవంతులు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో. ఎందుకంటే నువ్వు దీవించినవాడికి దీవెన, శపించిన వాడికి శాపం కలుగుతాయని నాకు తెలుసు” అని అన్నాడు.
7 Các sứ giả của Ba-lác (gồm các trưởng lão Mô-áp và Ma-đi-an) bưng lễ vật trong tay đến gặp Ba-la-am trình bày tự sự.
కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు.
8 Ba-la-am nói: “Các ông nghỉ lại đây đêm nay. Tôi sẽ trả lời các ông tùy theo điều Chúa Hằng Hữu phán dạy tôi.” Vậy họ ở lại.
అతడు వారితో “ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు చెప్పిన మాటలు నేను మళ్ళీ వచ్చి మీతో చెప్తాను” అన్నాడు. అప్పుడు మోయాబు నాయకులు ఆ రాత్రి బిలాము దగ్గర ఉన్నారు.
9 Đức Chúa Trời hiện ra hỏi Ba-la-am: “Họ là ai?”
దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు?” అన్నాడు.
10 Ba-la-am thưa với Đức Chúa Trời: “Đó là những người được vua Mô-áp—Ba-lác, con Xếp-bô—sai đến.
౧౦బిలాము దేవునితో “సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి,
11 Vua ấy nói có một dân tộc đến từ Ai Cập, đông như kiến, phủ đầy mặt đất. Vua ấy muốn tôi đến nguyền rủa dân đó để vua có thể đánh đuổi họ đi.”
౧౧‘చూడు, ఒక జాతి ఐగుప్తునుంచి బయలుదేరి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి ఉన్నారు. నువ్వు వెంటనే వచ్చి నా కోసం వారిని శపించు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో’ అని వీళ్ళతో నాకు వార్త పంపించాడు” అన్నాడు.
12 Nhưng Đức Chúa Trời phán với Ba-la-am: “Ngươi không được đi với họ, không được nguyền rủa dân kia, vì đó là dân được chúc phước!”
౧౨దేవుడు బిలాముకు జవాబిస్తూ “నువ్వు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వాదం పొందిన వారు” అన్నాడు.
13 Vậy sáng hôm sau, Ba-la-am thức dậy, nói với các trưởng lão Ba-lác: “Các ông về đi! Chúa Hằng Hữu cấm tôi đi với các ông.”
౧౩కాబట్టి బిలాము ఉదయాన లేచి, బాలాకు నాయకులతో “మీరు మీ స్వదేశానికి వెళ్ళి పొండి. మీతో వెళ్ళడానికి యెహోవా నాకు అనుమతి ఇవ్వలేదు” అన్నాడు.
14 Các trưởng lão ra về, trình với Vua Ba-lác: “Ba-la-am từ chối, không đến.”
౧౪కాబట్టి మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి వెళ్లి “బిలాము మాతో రావడానికి నిరాకరించాడు” అని చెప్పారు.
15 Tuy nhiên, Ba-lác cử một phái đoàn thứ hai đông hơn, gồm những người chức cao tước trọng hơn phái đoàn trước.
౧౫బాలాకు వారికంటే ఘనత కలిగిన ఇంకా ఎక్కువ మంది నాయకులను మళ్ళీ పంపించాడు.
16 Họ đến gặp Ba-la-am và chuyển lời cho ông rằng: “Vua Ba-lác, con Xếp-bô khẩn khoản mời ông đến.
౧౬వారు బిలాము దగ్గరికి వచ్చి అతనితో “సిప్పోరు కొడుకు బాలాకు, ‘నువ్వు నా దగ్గరికి రావడానికి దయచేసి ఏదీ నిన్ను ఆపనివ్వకు,
17 Vua hứa sẽ phong cho ông phẩm tước cao trọng và ban cho ông mọi điều gì ông muốn, miễn là ông đến nguyền rủa dân tộc kia cho vua!”
౧౭ఎందుకంటే, నేను నిన్ను చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నువ్వు నాతో ఏం చెప్పినా చేస్తాను. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి, నా కోసం ఈ జనాన్ని శపించు’ అని చెప్పమన్నాడు” అన్నారు.
18 Nhưng Ba-la-am đáp: “Dù Ba-lác có cho tôi cung điện chứa đầy vàng bạc, tôi cũng không thể làm gì ngoài những điều Chúa Hằng Hữu tôi dạy bảo.
౧౮బిలాము జవాబిస్తూ “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా, నేను చెయ్యాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను.
19 Bây giờ, xin các ông nghỉ lại đêm nay nữa, để xem Chúa Hằng Hữu có bảo thêm điều gì khác không.”
౧౯కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను” అన్నాడు.
20 Đêm đó, Đức Chúa Trời phán dạy Ba-la-am: “Nếu họ đến mời, thì cứ dậy đi với họ. Nhưng ngươi chỉ được nói điều gì Ta phán.”
౨౦ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి” అని చెప్పాడు.
21 Ba-la-am dậy, thắng lừa, và ra đi với các trưởng lão Mô-áp lúc trời sáng.
౨౧ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు.
22 Việc ông ra đi làm cho Đức Chúa Trời buồn giận. Thiên sứ của Chúa Hằng Hữu đứng trên đường cản ông. Khi Ba-la-am và hai người đầy tớ cưỡi lừa đi qua,
౨౨అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు.
23 con lừa thấy thiên sứ của Chúa Hằng Hữu đứng trên đường, tay cầm lưỡi gươm trần, liền đi tẽ xuống ruộng để tránh. Ba-la-am đánh nó, bắt nó phải đi lên đường cái.
౨౩యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.
24 Thiên sứ của Chúa Hằng Hữu đến đứng tại một khúc đường chạy qua giữa hai vườn nho, hai bên đường đều có tường nên con đường hẹp lại.
౨౪యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు.
25 Khi thấy thiên sứ của Chúa Hằng Hữu, con lừa nép vào tường, làm kẹt chân Ba-la-am nên ông lại đánh nó.
౨౫గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.
26 Thiên sứ của Chúa Hằng Hữu đi trước, đến đứng tại một khúc đường rất hẹp, không có chỗ để quay đầu phía nào cả.
౨౬యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు,
27 Lần này, con lừa chỉ còn cách nằm mọp xuống khi thấy thiên sứ của Chúa Hằng Hữu. Ba-la-am nổi giận lấy gậy đánh con lừa.
౨౭ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.
28 Chúa Hằng Hữu mở miệng con lừa, nó nói với Ba-la-am: “Con đã làm gì quấy mà ông đánh con đến ba lần?”
౨౮అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది “నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?” అని బిలాముతో అంది.
29 Ba-la-am nói: “Vì mày sỉ nhục ta! Nếu có gươm trong tay, ta đã giết mày rồi.”
౨౯బిలాము “నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి” అన్నాడు.
30 Lừa lại hỏi: “Trước nay, con không phải là con lừa ông cưỡi suốt đời sao? Có bao giờ con làm như vậy chưa?” Ba-la-am đáp: “Chưa.”
౩౦ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.
31 Bấy giờ, Đức Chúa Trời mở mắt Ba-la-am, ông thấy thiên sứ của Chúa Hằng Hữu đứng trên đường, tay cầm gươm tuốt trần, liền vội cúi đầu, sấp mặt xuống đất.
౩౧అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.
32 Thiên sứ của Chúa Hằng Hữu hỏi: “Tại sao ngươi đánh con lừa ba lần? Ta đến để ngăn cản ngươi, vì đường ngươi đi dẫn đến chỗ diệt vong.
౩౨యెహోవా దూత “నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను.
33 Vì con lừa thấy ta nên nó tránh ta ba lần; nếu không, ta đã giết ngươi và để cho nó sống.”
౩౩ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి” అని అతనితో అన్నాడు.
34 Ba-la-am nói với Thiên sứ của Chúa Hằng Hữu: “Tôi đã phạm tội. Tôi đã không biết thiên sứ đứng trên đường cản lối tôi. Nếu thiên sứ không vừa ý, tôi xin quay về.”
౩౪అందుకు బిలాము “నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.
35 Thiên sứ của Chúa Hằng Hữu phán bảo: “Cứ đi với họ, nhưng ngươi chỉ được nói lời nào Ta bảo ngươi nói.” Vậy Ba-la-am đi với các quan chức của Ba-lác.
౩౫యెహోవా దూత “నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు” అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.
36 Nghe tin Ba-la-am đến, Ba-lác ra tận đầu biên giới tiếp đón, tại một thành Mô-áp bên sông Ạt-nôn.
౩౬బిలాము వచ్చాడని బాలాకు విని, ఆ సరిహద్దు చివర ఉన్న అర్నోను తీరంలో అతన్ని కలుసుకోడానికి మోయాబు పట్టణం వరకూ వెళ్ళినప్పుడు,
37 Vua Ba-lác hỏi Ba-la-am: “Ta đã gửi người đi mời lần trước, sao ông không đến? Ta không đủ sức làm cho ông được vẻ vang nhất đời sao?”
౩౭బాలాకు బిలాముతో “నిన్ను పిలవడానికి నేను నీ దగ్గరికి రాయబారులను పంపాను గదా! నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నిన్ను గొప్పవాణ్ణి చేసే సామర్థ్యం నాకు లేదా?” అన్నాడు.
38 Ba-la-am đáp: “Tôi đến đây rồi, nhưng tôi không được quyền nói gì hết. Trừ những lời Đức Chúa Trời bảo tôi nói.”
౩౮అప్పుడు బిలాము “చూడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నాకిష్టమొచ్చింది చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించే మాటే పలకగలను గదా” అని బాలాకుతో చెప్పాడు.
39 Và Ba-la-am đi với Ba-lác đến Ki-ri-át Hu-xốt.
౩౯అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళాడు. వారు కిర్యత్‌ హుజోతుకు వచ్చినప్పుడు
40 Tại đó, Ba-lác sai giết bò, chiên để cúng tế. Vua cũng sai đem lễ vật đến biếu Ba-la-am và các trưởng lão đi cùng ông.
౪౦బాలాకు ఎడ్లు, గొర్రెలు బలిగా అర్పించి, కొంతభాగం బిలాముకు, అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు.
41 Sáng hôm sau, Ba-lác đem Ba-la-am lên đỉnh Ba-mốt Ba-anh. Từ đó có thể trông thấy phía cuối trại quân Ít-ra-ên.
౪౧బాలాకు ఆ తరువాత రోజు బిలామును బయలుకు చెందిన ఎత్తైన స్థలాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుంచి బిలాము ఇశ్రాయేలీయుల శిబిరంలో కొంత భాగమే చూడగలిగాడు.

< Dân Số 22 >