< Dân Số 20 >

1 Toàn thể dân chúng Ít-ra-ên đi vào hoang mạc Xin vào tháng thứ nhất, họ dừng chân tại Ca-đe. Mi-ri-am qua đời và được an táng tại đó.
మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు.
2 Khi thấy không có nước uống, dân chúng họp nhau lại chống đối Môi-se và A-rôn.
ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.
3 Họ hỏi Môi-se: “Thà chúng tôi chết cùng anh em chúng tôi trong lần họ chết trước mặt Chúa Hằng Hữu vừa rồi.
ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది!
4 Tại sao ông đem dân của Chúa Hằng Hữu vào hoang mạc cho chết khát cả người lẫn súc vật?
మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు?
5 Tại sao ông bắt chúng tôi bỏ Ai Cập để vào nơi khốn nạn này, là nơi không có ai gieo giống, trồng cây vả, cây nho, cây lựu gì được, là nơi không có nước uống?”
ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు” అన్నారు.
6 Môi-se và A-rôn liền bỏ họ, đi đến cửa Đền Tạm, quỳ mọp xuống. Vinh quang của Chúa Hằng Hữu hiện ra,
అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
7 và Chúa Hằng Hữu phán bảo Môi-se:
అప్పుడు యెహోవా మోషేతో,
8 “Cầm cây gậy này, rồi con và A-rôn triệu tập dân chúng lại. Trước mặt họ, con sẽ bảo vầng đá kia phun nước ra, con sẽ cho họ và bầy gia súc của họ uống nước chảy ra từ vầng đá.”
“నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు.
9 Vậy Môi-se lấy cây gậy trước mặt Chúa Hằng Hữu, theo lời Ngài phán dạy.
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు.
10 Môi-se cùng với A-rôn triệu tập mọi người đến bên vầng đá, xong ông nói: “Dân phản loạn, nghe đây! Chúng ta phải lấy nước từ trong vầng đá này ra cho mọi người uống sao?”
౧౦తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు.
11 Nói xong, Môi-se vung gậy đập vào vầng đá hai lần. Nước liền bắn vọt ra lai láng. Vậy toàn dân và thú vật đều uống.
౧౧అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి.
12 Nhưng Chúa Hằng Hữu trách Môi-se và A-rôn: “Vì các con không tin Ta, không tôn thánh Ta trước mắt người Ít-ra-ên, nên các con sẽ không dẫn họ vào đất Ta hứa cho!”
౧౨అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు” అన్నాడు.
13 Nơi đó được gọi là nước Mê-ri-ba, vì người Ít-ra-ên đã cãi lẽ với Chúa Hằng Hữu tại đó, nhưng Ngài đã tỏ đức thánh khiết của Ngài cho họ thấy.
౧౩ఈ నీళ్ళ ప్రాంతానికి మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
14 Sau đó, Môi-se sai sứ giả đi từ Ca-đe đến yêu cầu vua nước Ê-đôm rằng: “Chúng tôi là con cháu Ít-ra-ên, vào hàng em của vua. Chắc vua đã biết qua nỗi gian khổ của chúng tôi rồi.
౧౪మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు.
15 Tổ phụ chúng tôi đã xuống Ai Cập và ở lại đó lâu ngày; người Ai Cập cư xử với chúng tôi rất bạo tàn.
౧౫మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు.
16 Chúng tôi kêu đến Chúa Hằng Hữu; Ngài nghe, sai thiên sứ đem chúng tôi ra khỏi Ai Cập, và bây giờ chúng tôi đang ở Ca-đe, một thị trấn ở ngay biên giới quý quốc.
౧౬మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.
17 Xin cho chúng tôi đi nhờ qua đất của vua. Chúng tôi sẽ đi tránh đồng ruộng, vườn nho, cũng không múc nước dưới giếng mà uống. Chúng tôi sẽ đi trên đường cái, không rời khỏi chính lộ cho đến khi ra khỏi biên giới.”
౧౭మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం” అని చెప్పించాడు.
18 Nhưng vua Ê-đôm đáp: “Không được đi qua đất nước ta. Nếu không nghe, ta sẽ đem quân ra đánh!”
౧౮కాని ఎదోము రాజు “నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను” అని జవాబిచ్చాడు.
19 Sứ giả Ít-ra-ên thưa: “Chúng tôi chỉ đi trên đường cái. Dù nước cũng không uống, nếu uống chúng tôi xin trả tiền. Chỉ xin cho chúng tôi đi qua, ngoài ra chúng tôi không xin gì khác.”
౧౯అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో “మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే” అన్నారు. అప్పుడు అతడు “నువ్వు రాకూడదు” అన్నాడు.
20 Vua Ê-đôm đáp cách cương quyết: “Không được! Các ngươi không được đi qua vùng đất của ta.” Rồi Ê-đôm kéo quân đội hùng hậu ra ngăn chặn Ít-ra-ên.
౨౦అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు.
21 Vì Ê-đôm từ chối không cho Ít-ra-ên đi qua đất mình, nên Ít-ra-ên tránh đi nơi khác.
౨౧ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు.
22 Toàn dân Ít-ra-ên từ Ca-đe kéo đến Núi Hô-rơ.
౨౨అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు.
23 Tại núi Hô-rơ, cạnh biên giới Ê-đôm, Chúa Hằng Hữu phán bảo Môi-se và A-rôn:
౨౩యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ,
24 “A-rôn sẽ về với tổ phụ mình, không được vào đất hứa cho Ít-ra-ên, vì hai con đã phản nghịch Ta tại Mê-ri-ba.
౨౪“మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు.
25 Môi-se, con hãy đem A-rôn và Ê-lê-a-sa lên Núi Hô-rơ.
౨౫నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి,
26 Ở đó, con sẽ lấy áo lễ của A-rôn mặc cho Ê-lê-a-sa. A-rôn sẽ qua đời tại đó.”
౨౬అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు” అన్నాడు.
27 Môi-se tuân lệnh Chúa Hằng Hữu. Ba người lên Núi Hô-rơ trước sự chứng kiến của dân chúng.
౨౭యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు.
28 Trên đỉnh núi, Môi-se lấy bộ áo lễ của A-rôn, mặc cho Ê-lê-a-sa, con A-rôn. A-rôn qua đời trên đỉnh núi này. Sau đó, Môi-se và Ê-lê-a-sa xuống núi.
౨౮మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.
29 Khi biết A-rôn mất, toàn thể dân chúng Ít-ra-ên khóc ông suốt ba mươi ngày.
౨౯అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.

< Dân Số 20 >