< Dân Số 13 >
1 Chúa Hằng Hữu phán bảo Môi-se:
౧ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
2 “Con chọn trong số các nhà lãnh đạo, mỗi đại tộc một người, sai họ đi do thám Ca-na-an, đất Ta cho Ít-ra-ên.”
౨నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి.
3 Vậy từ hoang mạc Pha-ran, Môi-se cử họ ra đi, theo lệnh Chúa Hằng Hữu. Tất cả đều là những người lãnh đạo của người Ít-ra-ên.
౩మోషే యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యేలా వారిని పారాను అరణ్యం నుండి పంపించాడు. వెళ్ళిన వారంతా ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు.
4 Đây là danh sách của họ: Đại tộc Ru-bên: Sam-mua, con của Xác-cua.
౪వారి పేర్లు ఇవి. రూబేను గోత్రం నుండి జక్కూరు కొడుకు షమ్మూయ,
5 Đại tộc Si-mê-ôn: Sa-phát, con của Hô-ri.
౫షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,
6 Đại tộc Giu-đa: Ca-lép, con của Giê-phu-nê.
౬యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు,
7 Đại tộc Y-sa-ca: Di-ganh, con của Giô-sép.
౭ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు.
8 Đại tộc Ép-ra-im: Ô-sê, con của Nun.
౮ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ.
9 Đại tộc Bên-gia-min: Phan-thi, con của Ra-phu.
౯బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ,
10 Đại tộc Sa-bu-luân: Gát-đi-ên, con của Sô-đi.
౧౦జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,
11 Đại tộc Ma-na-se, con trai của Giô-sép: Ga-đi, con của Su-si.
౧౧యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,
12 Đại tộc Đan: A-mi-ên, con của Ghê-ma-li.
౧౨దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,
13 Đại tộc A-se: Sê-thu, con của Mi-ca-ên.
౧౩ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు,
14 Đại tộc Nép-ta-li: Nách-bi, con của Vấp-si.
౧౪నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ,
15 Đại tộc Gát: Gu-ên, con của Ma-ki.
౧౫గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.
16 Đó là danh sách các thám tử Môi-se sai đi trinh sát xứ Ca-na-an. Ông đổi tên Ô-sê, con của Nun, thành Giô-suê.
౧౬ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.
17 Môi-se dặn họ: “Các anh đi lên miền bắc ngang qua xứ Nê-ghép đến tận vùng đồi núi;
౧౭వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.
18 xem thử địa thế ra sao, dân tình thế nào, đông hay thưa, mạnh hay yếu,
౧౮ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి.
19 đất tốt hay xấu, thành thị có hào lũy kiên cố hay trống trải,
౧౯వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?
20 đất đai màu mỡ hay khô cằn, có nhiều cây cối hay tiêu điều. Hãy cố gắng đem về một ít hoa quả, đừng ngại ngùng.” (Lúc ấy đúng vào mùa hái nho đầu màu.)
౨౦అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.” అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.
21 Vậy, họ ra đi trinh sát đất này, từ hoang mạc Xin tới Rê-hốp, gần Lê-bô Ha-mát.
౨౧కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.
22 Họ đi lên miền bắc, ngang qua xứ Nê-ghép tới Hếp-rôn, nơi con cháu A-nác là A-hi-man, Sê-sai, và Thanh-mai sinh sống. (Thành Hếp-rôn được xây trước Xô-an ở Ai Cập bảy năm.)
౨౨వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.
23 Họ đến thung lũng Ếch-côn, cắt một chùm nho, hai người phải dùng đòn mới khiêng nổi. Họ cũng hái mấy trái thạch lựu và trái vả đem về.
౨౩వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు.
24 Thung lũng ấy được gọi là Ếch-côn, vì các thám tử Ít-ra-ên đã hái nho ở đó.
౨౪ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ ప్రాంతానికి “ఎష్కోలు లోయ” అనే పేరు పెట్టారు.
25 Sau bốn mươi ngày do thám, họ trở về.
౨౫వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు.
26 Họ quay về với Môi-se, A-rôn, và toàn thể người Ít-ra-ên trong hoang mạc Pha-ran. Các thám tử báo cho họ và toàn thể người Ít-ra-ên và cho xem hoa quả trong xứ.
౨౬పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు.
27 Họ báo với Môi-se: “Chúng tôi đã vào đất ấy theo lệnh ông sai bảo chúng tôi; thật là đất tràn đầy sữa và mật. Đây là hoa quả của xứ ấy.
౨౭వారు మోషేకి ఇలా చెప్పారు. “నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి.
28 Tuy nhiên, dân ở đó rất cường tráng, thành thị rộng lớn, và hào lũy kiên cố. Ngoài ra, chúng tôi có thấy bọn khổng lồ, thuộc dòng dõi A-nác ở đó nữa.
౨౮కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం.
29 Người A-ma-léc ở Nê-ghép, người Hê-tít, người Giê-bu, và người A-mô-rít ở vùng cao nguyên, còn người Ca-na-an ở miền biển và dọc theo Thung lũng Giô-đan.”
౨౯దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.”
30 Ca-lép lên tiếng để trấn an dân chúng đang nghi hoặc trước mặt Môi-se: “Chúng ta phải đi ngay vào chiếm lấy đất ấy, chúng ta thừa sức chinh phục xứ này.”
౩౦అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. “మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది” అన్నాడు.
31 Nhưng các thám tử khác nói: “Chúng ta không đủ sức đâu, vì họ mạnh hơn chúng ta.”
౩౧కాని అతనితో వెళ్ళిన మిగతా వారు “అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.” అన్నారు.
32 Những người này thổi phồng những điểm bất lợi: “Đất này sẽ nuốt chửng dân ta, vì dân cư chúng nó là giống khổng lồ.
౩౨ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.
33 Chúng tôi đã thấy bọn người khổng lồ con cháu A-nác. Họ to lớn đến độ chúng tôi cảm thấy mình bé nhỏ như những con cào cào khi đứng trước mặt họ.”
౩౩అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు.