< Nê-hê-mi-a 6 >
1 Khi San-ba-lát, Tô-bia, Ghê-sem người A-rập và những kẻ thù khác của chúng tôi nghe tin tường thành đã xây xong, không còn nơi nào hư thủng nữa, mặc dù lúc ấy chúng tôi chưa tra các cánh cổng,
౧నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను. ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లటుకూ, టోబీయాకూ, అరబ్బు వాడు గెషెంకూ, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది.
2 Vậy San-ba-lát và Ghê-sen sai người đến nói với chúng tôi: “Mời ông đến dự buổi họp tại một làng trong đồng bằng Ô-nô.” Nhưng thật ra, họ âm mưu ám hại tôi.
౨సన్బల్లటు, గెషెంలు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. “ఓనో మైదానంలో ఎదో ఒక చోట మనం కలుసుకుందాం, రండి” అని మాకు కబురు పంపారు.
3 Tôi cho người trả lời: “Tôi đang thực hiện công tác lớn lao, không thể bỏ việc để đi gặp các ông được.”
౩అప్పుడు నేను “నేను చేస్తున్న పని మహత్తరమైనది. ఆ పని ఆపేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని నా మనుషులతో జవాబు పంపాను.
4 Họ tiếp tục sai người đến, cả thảy là bốn lần, đòi tôi đến gặp họ như thế, nhưng bốn lần tôi đều từ chối.
౪వాళ్ళు అదే విధంగా నాలుగుసార్లు నాకు కబురు పంపించారు, నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను.
5 Lần thứ năm, San-ba-lát sai người đến, và cũng như trước, người này cầm một phong thư không niêm.
౫ఐదవసారి సన్బల్లటు తన పనివాడి ద్వారా ఒక బహిరంగ లేఖ నాకు పంపించాడు.
6 Thư viết: “Tiếng đồn về ông lan khắp các nước, và chính Ghê-sem cũng trình báo rằng ông âm mưu cùng người Giu-đa làm phản, vì thế các ông mới xây tường thành này. Ông trù tính làm vua Giu-đa nên
౬ఆ ఉత్తరంలో “యూదులపై రాజుగా ఉండాలని నువ్వు సరిహద్దు గోడలు కడుతున్నావు. ఆ కారణం వల్ల నువ్వు, యూదులు కలసి రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు.
7 sai người nói tiên tri về mình tại Giê-ru-sa-lem rằng: ‘Có một vua ở Giu-đa!’ Và dĩ nhiên, những lời này sẽ được báo lên vua. Vậy tốt hơn ta nên thảo luận với nhau.”
౭‘యూదులకు రాజు ఉన్నాడు’ అని నిన్ను గూర్చి ప్రకటించడానికి యెరూషలేంలో కొందరు ప్రవక్తలను నువ్వు నియమించావని, ఇంకా ఇతర విషయాలు రాజుకు తెలిశాయన్న పుకార్లు బయలుదేరాయి. అన్య జాతుల ప్రజల మధ్య ఈ పుకార్లు గెషెం లేవదీస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించడానికి మనం కలుసుకుందాం” అని రాసి ఉంది.
8 Tôi sai người đáp: “Không hề có những chuyện như thế. Ông chỉ khéo tưởng tượng.”
౮ఇలా చేస్తే మేము బెదిరిపోయి పని చేయలేక నీరసించిపోతాం అని వాళ్ళు భావించారు.
9 Họ tưởng có thể dọa chúng tôi sợ để chúng tôi bỏ việc đang làm. Vậy xin Đức Chúa Trời làm cho con vững chí!
౯“మేము ఎప్పటికీ ఇలాంటి పనులు చెయ్యం. వీటన్నిటినీ నీ మనస్సులో నువ్వే కల్పించుకున్నావు” అని అతనికి జవాబు పంపాను. దేవా, ఇప్పుడు నా చేతులకు బలమియ్యి.
10 Sau đó, tôi đến thăm Sê-ma-gia, con Đê-la-gia, cháu Mê-hê-ta-bê-ên, một ẩn sĩ. Ông ấy nói: “Chúng ta phải vào Đền Thờ của Đức Chúa Trời, cài cửa lại, vì tối nay họ sẽ đến giết ông.”
౧౦తరువాత మెహేతబేలు మనవడు దెలాయ్యా కొడుకు షెమయా యింటికి వచ్చాను. అతణ్ణి అతడి ఇంట్లోనే నిర్బంధించారు. అతడు “రాత్రివేళ నిన్ను చంపడానికి వాళ్ళు వస్తారు, మనం దేవుని మందిరం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుందాం రా” అని నాతో అన్నాడు.
11 Tôi trả lời: “Một người như tôi thế này mà chạy trốn sao? Hơn nữa, tôi đâu được vào Đền Thờ để lánh nạn. Tôi không vào đâu.”
౧౧నేను “నాలాంటి వాడు పారిపోవచ్చా? ఇంతటి వాడినైన నేను నా ప్రాణం కాపాడుకోవడానికి ఆలయం లోపలి భాగంలోకి వెళ్ళవచ్చా? నేను ఆలయంలోకి రాను” అన్నాను.
12 Tôi biết người này không phải là người của Đức Chúa Trời, nhưng nói tiên tri chống nghịch tôi vì họ đã bị Tô-bia và San-ba-lát mua chuộc.
౧౨అప్పుడు షెమయా ద్వారా దేవుడు ఈ మాట చెప్పించలేదనీ, టోబీయా, సన్బల్లటులు అతనికి డబ్బిచ్చి నా గురించి ఇలా చెప్పించారనీ స్పష్టంగా తెలుసుకున్నాను.
13 Ông được mướn để hù dọa tôi, xúi tôi vào trốn trong đền thờ, và như thế phạm tội và họ sẽ có cớ buộc tội tôi.
౧౩నన్ను భయపెట్టడానికి వారు అలా చేశారు. అతడు చెప్పినట్టు చేసి నేను పాపంలో పడిపోతానని వాళ్ళు భావించారు. నేనలా చేస్తే నా పేరు పాడు చేసి, నన్ను అవమాన పరచవచ్చు అని వారి ఉద్దేశం. నాకు వ్యతిరేకంగా వారు చేసిన పనులన్నీ గుర్తుంచుకో.
14 Cầu xin Đức Chúa Trời đừng quên những điều Tô-bia và San-ba-lát đã làm; xin cũng đừng quên nữ Tiên tri Nô-a-đia và các tiên tri khác, là những người định làm cho con khiếp đảm.
౧౪నా దేవా, టోబీయా, సన్బల్లటులను గుర్తుంచుకో. నన్ను భయపెట్టాలని చూస్తున్న నోవద్యా అనే స్త్రీ ప్రవక్తను, తక్కిన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకో.
15 Ngày hai mươi lăm tháng Ê-lun, tường thành sửa xong. Công tác này thực hiện trong năm mươi hai ngày.
౧౫ఈ విధంగా ఏలూలు నెల 25 వ తేదీన, అంటే 52 రోజులకు సరిహద్దు గోడలు కట్టడం పూర్తి అయింది.
16 Khi nghe tin này kẻ thù chúng tôi và những dân tộc láng giềng đều chán nản, hổ thẹn, vì biết rằng công tác này hoàn tất được là nhờ Đức Chúa Trời của chúng tôi giúp đỡ.
౧౬అయితే మా శత్రువులూ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల ప్రజలూ జరిగిన పని చూసి ఎంతో భయపడ్డారు. మా దేవుని సహాయం వల్లనే ఈ పని మొత్తం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు.
17 Tuy nhiên, trong thời gian ấy, một số người Giu-đa có địa vị lại thường liên lạc thư từ với Tô-bia.
౧౭ఆ రోజుల్లో యూదుల ప్రముఖులు టోబీయాకు మాటిమాటికీ ఉత్తరాలు రాశారు. అతడు కూడా వాళ్ళకు జవాబులు రాస్తున్నాడు.
18 Trong Giu-đa có nhiều người thề giúp Tô-bia, vì Tô-bia là con rể của Sê-ca-nia, con A-ra, và con của Tô-bia là Giô-ha-nan, lại cưới con gái của Mê-su-lam, con Bê-rê-kia.
౧౮అతడు ఆరహు కొడుకు, షెకన్యాకు అల్లుడు. అదీకాక, అతని కొడుకు యోహానాను బెరెక్యా కొడుకు మెషుల్లాము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి యూదుల్లో చాలామంది అతని పక్షంగా ఉంటామని ప్రమాణం చేశారు.
19 Những người này hùa theo Tô-bia trước mặt tôi, đồng thời họ đem những lời tôi nói học lại hết cho Tô-bia. Tô-bia gửi cho tôi nhiều thư đe dọa.
౧౯వాళ్ళు నా సమక్షంలో అతడి మంచి లక్షణాల గురించి చెబుతూ వచ్చారు. నేను చెప్పిన మాటలు కూడా అతనికి తెలియజేశారు. నన్ను భయపెట్టడానికే టోబీయా ఉత్తరాలు పంపాడు.