< Nê-hê-mi-a 1 >

1 Đây là lời tự thuật của Nê-hê-mi, con Ha-ca-lia: Vào tháng Kít-lê năm thứ hai mươi triều Ạt-ta-xét-xe, vua Ba Tư, khi tôi đang ở tại cung Su-sa,
హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు. నేను 20 వ సంవత్సరం కిస్లేవు నెలలో షూషను కోటలో ఉన్న సమయంలో
2 có một anh em tên Ha-na-ni cùng vài người từ Giu-đa đến thăm. Tôi hỏi thăm họ về tình hình những người Giu-đa không bị bắt đi đày, và tình hình thành Giê-ru-sa-lem.
నా సోదరుల్లో హనానీ అనే ఒకడు, ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని, అక్కడ మిగిలిపోయిన యూదుల గురించీ యెరూషలేమును గురించీ నేను వారిని అడిగాను.
3 Họ cho biết những anh em thoát nạn tù đày, ở lại trong xứ hiện nay sống trong cảnh hoạn nạn, nhục nhã. Tường thành Giê-ru-sa-lem đổ nát, cổng thành cháy rụi.
అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.
4 Nghe thế, tôi ngồi khóc suốt mấy ngày, kiêng ăn, kêu cầu với Đức Chúa Trời trên trời.
ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను.
5 Tôi thưa: “Lạy Chúa Hằng Hữu, Đức Chúa Trời trên trời, Đức Chúa Trời vĩ đại, uy nghi, Đấng luôn giữ lời hứa, thương yêu người nào kính mến và tuân hành điều răn Ngài,
“ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు.
6 xin Chúa nhìn thấy con đang ngày đêm cầu nguyện cho người Ít-ra-ên của Ngài; xin Chúa lắng tai nghe lời con. Con thú nhận rằng chúng con đã phạm tội với Chúa. Đúng thế, con và tổ tiên con có tội.
నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం.
7 Chúng con làm điều rất gian ác, không tuân hành điều răn và luật lệ Chúa truyền cho Môi-se, đầy tớ Chúa.
నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు.
8 Nhưng xin Chúa nhớ lại lời Ngài truyền cho Môi-se, đầy tớ Ngài: ‘Nếu các ngươi phạm tội, Ta sẽ rải các ngươi ra khắp nơi.
నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను.
9 Nhưng nếu các ngươi trở lại cùng Ta, tuân hành các điều răn, dù các ngươi có bị tản mác ở tận phương trời xa xăm, Ta cũng sẽ đem các ngươi về đất Ta chọn, nơi Ta ngự.’
అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా.
10 Chúng con là đầy tớ, là dân Chúa, đã được Chúa dùng quyền năng giải cứu.
౧౦మరి, నీవు నీ మహా బల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా.
11 Lạy Chúa Hằng Hữu, xin lắng nghe lời cầu nguyện của con và của các đầy tớ Chúa vẫn hết lòng kính sợ Danh Ngài. Hôm nay, xin cho con được may mắn, được vua đoái thương.” Lúc ấy tôi là người dâng rượu cho vua.
౧౧యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.” నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.

< Nê-hê-mi-a 1 >