< Lu-ca 18 >
1 Chúa Giê-xu kể câu chuyện dạy các môn đệ phải bền lòng cầu nguyện, không bao giờ mỏi mệt:
౧తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
2 “Tại thành phố kia có một phán quan không kính sợ Đức Chúa Trời, cũng chẳng vị nể ai.
౨“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు.
3 Trong thành phố ấy có một quả phụ đến xin phán quan xét xử và nói: ‘Xin xét công minh cho tôi để chống lại kẻ thù tôi.’
౩ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది.
4 Vị phán quan chẳng quan tâm, tuy thế, về sau ông tự nhủ: ‘Dù ta không kính sợ Đức Chúa Trời, cũng chẳng vị nể ai,
౪అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను.
5 nhưng chị này làm phiền ta quá, ta phải xét xử công bằng để chị khỏi đến quấy rầy, làm nhức đầu ta!’”
౫కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.”
6 Chúa dạy tiếp: “Các con có nghe lời phán quan bất công ấy nói không?
౬ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా!
7 Lẽ nào Đức Chúa Trời lại không xem xét bênh vực những đứa con yêu ngày đêm kêu xin Ngài mà lại chậm đến giải cứu họ sao?
౭తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా?
8 Chắc chắn Ngài sẽ vội vàng xét xử công minh cho họ. Nhưng khi Con Người trở lại, sẽ còn có đức tin trên mặt đất không?”
౮ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”
9 Chúa Giê-xu kể câu chuyện dạy những ai lên mặt đạo đức, khinh người:
౯తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
10 “Có hai người lên Đền Thờ cầu nguyện. Một là thành viên Pha-ri-si, còn người kia là người thu thuế.
౧౦“ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.
11 Thầy Pha-ri-si đứng cầu nguyện: ‘Cảm tạ Đức Chúa Trời, tôi không có tội như người ta. Tôi không gian lận, bất công, ngoại tình. Khác hẳn tên thu thuế kia!
౧౧పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
12 Mỗi tuần tôi kiêng ăn hai ngày và dâng lên Đức Chúa Trời một phần mười các thứ lợi tức.’
౧౨వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
13 Còn người thu thuế đứng xa xa, không dám ngẩng mặt lên, chỉ đấm ngực than thở: ‘Lạy Đức Chúa Trời, xin thương xót con, vì con là người tội lỗi.’
౧౩అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.
14 Ta nói với các con, người tội lỗi này, không phải là người Pha-ri-si, trở về nhà mình được xưng là công chính. Vì ai tự đề cao sẽ bị hạ xuống, còn ai hạ mình sẽ được đề cao.”
౧౪పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
15 Một hôm, cha mẹ đem con của họ đến gần Chúa để Ngài đặt tay và ban phước cho các em. Nhưng các môn đệ trách mắng không cho quấy rầy Ngài.
౧౫తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు.
16 Chúa Giê-xu gọi các em đến và nói với các môn đệ: “Cứ để trẻ con lại gần Ta. Đừng ngăn cản! Vì Nước của Đức Chúa Trời thuộc về những người giống các em này.
౧౬అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.
17 Ta quả quyết với các con, ai không tiếp nhận Đức Chúa Trời như con trẻ, sẽ không được vào Nước của Đức Chúa Trời.”
౧౭చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
18 Một nhà lãnh đạo tôn giáo hỏi Chúa Giê-xu: “Thưa Thầy nhân lành, tôi phải làm gì để được sống vĩnh cửu?” (aiōnios )
౧౮ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. (aiōnios )
19 Chúa Giê-xu đáp: “Tại sao ngươi gọi Ta là nhân lành? Chỉ có một Đấng nhân lành là Đức Chúa Trời.
౧౯అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.
20 Hẳn ngươi biết các điều răn: ‘Các ngươi không được ngoại tình. Các ngươi không được giết người. Các ngươi không được trộm cắp. Các ngươi không được làm chứng dối. Phải hiếu kính cha mẹ.’”
౨౦వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.
21 Ông tự hào: “Từ thuở nhỏ đến giờ, tôi luôn luôn vâng giữ các điều răn đó!”
౨౧దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
22 Chúa Giê-xu khuyên: “Ông còn thiếu một điều. Bán hết tài sản lấy tiền phân phát cho người nghèo để chứa của cải trên trời, rồi theo làm môn đệ Ta.”
౨౨యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.
23 Nghe Chúa dạy, ông rất buồn rầu vì tài sản quá nhiều.
౨౩అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.
24 Chúa Giê-xu nhìn ông, nói với các môn đệ: “Người giàu vào Nước của Đức Chúa Trời thật khó!
౨౪యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
25 Lạc đà chui qua lỗ kim còn dễ hơn người giàu vào Nước của Đức Chúa Trời.”
౨౫ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.
26 Mọi người nghe đều ngạc nhiên: “Vậy thì ai được cứu?”
౨౬ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు
27 Chúa đáp: “Đức Chúa Trời làm những việc người ta không thể làm được.”
౨౭అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.
28 Phi-e-rơ thưa: “Chúng con đã bỏ nhà cửa để theo Thầy!”
౨౮అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.”
29 Chúa Giê-xu dạy: “Đúng vậy, Ta bảo đảm với các con, ai bỏ nhà cửa, anh chị em, cha mẹ, vợ con vì Nước của Đức Chúa Trời,
౨౯అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి,
30 sẽ nhận lại gấp trăm lần trong đời này, và đời sau được sống vĩnh cửu.” (aiōn , aiōnios )
౩౦ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. (aiōn , aiōnios )
31 Chúa Giê-xu đem riêng mười hai sứ đồ ra, và phán: “Hãy lắng nghe, chúng ta sẽ lên Giê-ru-sa-lem, tất cả những lời tiên tri đã viết về Con Người sẽ được ứng nghiệm.
౩౧ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.
32 Ngài sẽ bị bắt nộp cho người La Mã. Ngài sẽ bị chế giễu, nhục mạ, phỉ nhổ.
౩౨ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు.
33 Họ sẽ đánh đập rồi giết Ngài, nhưng sau ba ngày, Ngài sẽ sống lại.”
౩౩ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు.
34 Nhưng các sứ đồ không hiểu Chúa nói gì, vì trí óc họ như bị đóng kín.
౩౪వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.
35 Khi Chúa Giê-xu đến gần thành Giê-ri-cô, một người khiếm thị ngồi ăn xin bên đường.
౩౫ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
36 Khi anh nghe tiếng huyên náo, liền hỏi chuyện gì xảy ra.
౩౬పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు.
37 Họ nói với ông rằng có Giê-xu, người Na-xa-rét đi qua đây.
౩౭నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు.
38 Anh gọi lớn: “Lạy Chúa Giê-xu, Con của Đa-vít, xin thương xót con!”
౩౮అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
39 Những người đi trước la anh: “Im đi!” Nhưng anh la to hơn: “Con của Đa-vít, xin thương xót con!”
౩౯ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు.
40 Chúa Giê-xu nghe anh, Ngài dừng lại và ra lệnh đem anh ấy đến với Ngài. Khi anh đến gần, Chúa Giê-xu hỏi:
౪౦అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
41 “Con muốn Ta giúp gì đây?” Anh mừng rỡ: “Lạy Chúa, xin cho mắt con thấy được.”
౪౧వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు.
42 Chúa Giê-xu truyền lệnh: “Sáng mắt lại! Đức tin con đã chữa cho con lành.”
౪౨దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
43 Lập tức anh thấy được rõ ràng và đi theo Chúa Giê-xu, vừa đi vừa cảm tạ Đức Chúa Trời. Mọi người chứng kiến đều ca ngợi Đức Chúa Trời.
౪౩వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.