< Giô-sua 7 >
1 Người Ít-ra-ên mang tội bất trung với Chúa Hằng Hữu, vì có người phạm luật liên hệ đến các vật phải bị tiêu hủy. Người ấy là A-can, con trai Cát-mi, cháu Xáp-đi, chắt Xê-rách, thuộc đại tộc Giu-đa; hắn đã lấy một vài thứ trong thành Giê-ri-cô. Vì thế Chúa Hằng Hữu giận Ít-ra-ên lắm.
౧శాపానికి గురైన దాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు.
2 Từ Giê-ri-cô, Giô-suê sai người đi do thám thành A-hi. Thành này gần Bết-a-ven, về phía đông Bê-tên.
౨యెహోషువ “మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి” అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు.
3 Đi A-hi về, các thám tử đề nghị với Giô-suê: “Ta chỉ cần gửi vài nghìn quân đi đánh A-hi là đủ. Không cần xuất toàn lực vì thành này nhỏ và ít dân.”
౩వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి “ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు” అన్నారు.
4 Vậy, chừng 3.000 quân ra đi, nhưng họ bị đánh bại và phải bỏ chạy trốn người A-hi.
౪కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు.
5 Người A-hi đánh đuổi họ từ cổng thành đến tận Sê-ba-rim, tấn công lúc xuống đồi và giết chừng ba mươi sáu người. Lòng người Ít-ra-ên tan ra như nước.
౫హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణ ద్వారం దగ్గర నుండి షేబారీము వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి.
6 Giô-suê và các trưởng lão Ít-ra-ên xé áo mình, bốc bụi đất bỏ lên đầu, quỳ sấp mặt xuống đất trước Hòm Giao Ước của Chúa Hằng Hữu cho đến tối.
౬యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ
7 Giô-suê thưa: “Đức Chúa Trời Hằng Hữu ôi! Ngài đem chúng con qua sông Giô-đan làm gì? Để cho người A-mô-rít tiêu diệt chúng con sao? Nếu thế, chúng con thà ở lại bên kia sông cho xong.
౭“అయ్యో, ప్రభూ, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా.
8 Chúa Hằng Hữu ôi! Khi Ít-ra-ên phải quay lưng chạy trốn quân địch, con còn nói gì được nữa?
౮ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి?
9 Người Ca-na-an và các dân địa phương khác khi nghe tin này, sẽ kéo đến bao vây và xóa tên Ít-ra-ên khỏi lịch sử nhân loại. Còn Danh cao cả của Chúa thì sao?”
౯కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండాా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు” అని ప్రార్థించారు.
10 Chúa Hằng Hữu phán bảo Giô-suê: “Đứng lên! Tại sao con sấp mình xuống đất như vậy?
౧౦అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు “లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు?
11 Ít-ra-ên có tội. Họ đã không tuân lệnh Ta, lấy trộm vật đáng bị hủy diệt, dối trá đem giấu trong trại.
౧౧ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి, తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చారు.
12 Vì lý do đó, Ít-ra-ên bị bại trận. Họ bị quân thù đuổi chạy vì đã phạm luật về các vật phải hủy diệt. Nếu các vật ấy không đem ra tiêu hủy, Ta sẽ không ở cùng Ít-ra-ên nữa.
౧౨కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.
13 Con đứng lên! Hãy bảo dân chúng phải dọn mình thánh sạch, vì Chúa Hằng Hữu, Đức Chúa Trời của Ít-ra-ên phán: ‘Trong dân chúng, có người đang giấu vật đáng hủy diệt. Ít-ra-ên sẽ không cự nổi địch quân nếu không loại trừ các vật ấy.
౧౩నీవు వెళ్లి వారితో ఇలా చెప్పు, ‘రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసేవరకూ మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు.’
14 Sáng ngày mai, các đại tộc sẽ được gọi đến trước Chúa. Đại tộc nào bị Chúa Hằng Hữu chỉ ra, các họ trong đại tộc ấy phải được gọi đến. Họ nào bị Chúa Hằng Hữu chỉ ra, các gia đình thuộc họ ấy phải được gọi đến. Gia đình nào bị Ngài chỉ ra, những người trong gia đình ấy phải được gọi đến.
౧౪ఉదయాన యెహోవా సూచించిన ప్రకారం మీ గోత్రాలు, వంశాలు, కుటుంబాల వారీగా పురుషులు ఒక్కొక్కరు వరుసగా యెహోవా దగ్గరికి రావాలి.
15 Người bị chỉ ra là người đã trộm của đáng bị hủy diệt, sẽ bị hỏa thiêu chung với tất cả những gì thuộc về người ấy, vì đã vi phạm giao ước Chúa Hằng Hữu và làm điều xấu xa, nhơ nhuốc cho Ít-ra-ên.’”
౧౫అప్పుడు శాపానికి గురైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతన్నీ అతని వాళ్ళందరినీ అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అతడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు” అని చెప్పాడు.
16 Ngày hôm sau, Giô-suê dậy sớm, gọi các đại tộc đến ra mắt Chúa Hằng Hữu. Đại tộc Giu-đa bị chỉ ra.
౧౬కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రాల వరుసలో రప్పించినప్పుడు యూదాగోత్రం పట్టుబడింది.
17 Giô-suê gọi các họ thuộc đại tộc Giu-đa đến, họ Xê-rách bị chỉ ra. Ông gọi các gia đình thuộc họ Xê-rách đến, gia đình Xáp-đi bị chỉ ra.
౧౭యూదా వంశాన్ని రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టుబడింది. జెరహీయుల వంశాన్ని ఒక్కొక్కరిని రప్పించినప్పుడు జబ్ది దొరికాడు.
18 Ông gọi những người trong gia đình Xáp-đi đến, A-can, con Cát-mi, cháu Xáp-đi, chắt Xê-rách, đại tộc Giu-đa, bị chỉ ra.
౧౮అతడినీ అతని ఇంటివారిని పురుషుల వరుస ప్రకారం రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనుమడూ జబ్ది మనుమడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను దొరికాడు.
19 Giô-suê nói với A-can: “Con hãy tôn cao Chúa Hằng Hữu, Đức Chúa Trời của Ít-ra-ên, ngợi khen Ngài và thú tội đi. Đừng giấu giếm gì cả, hãy khai ra mọi điều con đã làm.”
౧౯అప్పుడు యెహోషువ ఆకానుతో “నా కుమారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా, ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో, నీవు చేసినదాన్ని నాకు చెప్పు” అని అన్నాడు.
20 A-can thú nhận: “Thưa đúng, con đã phạm tội với Chúa Hằng Hữu, Đức Chúa Trời của Ít-ra-ên và đây là việc con đã làm.
౨౦అందుకు ఆకాను యెహోషువతో “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే.
21 Con đã sinh lòng tham khi thấy chiếc áo choàng lộng lẫy hàng Ba-by-lôn, 2,3 ký bạc, và một thỏi vàng nặng chừng 570 gam. Con lấy các vật ấy đem giấu dưới đất trong trại, bạc để dưới cùng.”
౨౧దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది” అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు.
22 Giô-suê liền sai mấy người đến trại A-can. Họ tìm thấy các vật chôn trong trại, bạc ở dưới cùng.
౨౨అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరికి పరుగెత్తి చూశారు. వారు ఆ వస్తువులనూ వాటి కింద ఆ వెండినీ కనుక్కున్నారు.
23 Họ đem tất cả về đặt dưới đất trước mặt Giô-suê và mọi người, có Chúa Hằng Hữu chứng giám.
౨౩కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకు యెహోషువ దగ్గరకూ ఇశ్రాయేలీయుల దగ్గరకూ తెచ్చి యెహోవా సన్నిధిలో పోశారు.
24 Giô-suê và mọi người có mặt tại đó bắt A-can, con Xê-rách dẫn đến thung lũng A-cô. Họ cũng đem theo bạc, áo choàng, vàng, con trai, con gái của A-can, cùng với bò, lừa, chiên, trại, và tất cả những gì thuộc về A-can.
౨౪తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానునూ, ఆ వెండినీ పైవస్త్రాన్నీ, బంగారు కమ్మీనీ, ఆకాను కుమారులనూ, కుమార్తెలనూ, ఎద్దులనూ, గాడిదలనూ, మందనూ, డేరానూ, అతనికి కలిగిన సమస్తాన్నీ పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు.
25 Giô-suê nói: “Vì sao con gây họa cho Ít-ra-ên, Chúa Hằng Hữu sẽ giáng họa cho con hôm nay.” Mọi người lấy đá ném, lấy lửa đốt A-can và tất cả những gì thuộc về hắn.
౨౫అప్పుడు యెహోషువ “నీవెందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తాడు” అనగానే ఇశ్రాయేలీయులంతా అతణ్ణి రాళ్లతో చావగొట్టారు.
26 Sau đó, họ lấy đá chất thành một đống lớn trên người và vật vừa bị hỏa thiêu. Cho đến ngày nay, đống đá ấy vẫn còn, và nơi ấy vẫn được gọi là thung lũng A-cô. Sau việc ấy, Chúa Hằng Hữu nguôi giận.
౨౬తరువాత ఆ వస్తువులనూ రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వాటి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకూ ఉంది. అప్పుడు యెహోవా తన కోపోద్రేకాన్ని విడిచిపెట్టాడు. అందుచేత ఇప్పటి వరకూ ఆ చోటికి “ఆకోరు లోయ” అని పేరు.