< Giô-sua 19 >
1 Thăm thứ hai chỉ định lô đất của con cháu của đại tộc Si-mê-ôn. Lô này nằm trong đất Giu-đa.
౧రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది.
2 Các thành trong đất Si-mê-ôn gồm có: Bê-e-sê-ba, Sê-ba, Mô-la-đa,
౨వారి స్వాస్థ్యం ఏమిటంటే, బెయేర్షెబా, షెబ, మోలాదా,
3 Hát-sa-su-anh, Ba-la, Ê-xem,
౩హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా,
4 Ên-thô-lát, Bê-thu, Họt-ma,
౪సిక్లగు, బేత్, మార్కాబోదు, హజర్సూసా,
5 Xiếc-lác, Bết-ma-ca-bốt, Hát-sa-su-sa,
౫బేత్లబాయోతు, షారూహెను అనేవి,
6 Bết-lê-ba-ốt, và Sa-ru-hên;
౬వాటి పల్లెలు కాకుండా పదమూడు పట్టణాలు.
7 A-in, Rim-môn, Ê-the, và A-san, bốn thành và các thôn ấp phụ cận.
౭అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, అనేవి. వాటి పల్లెలు కాకుండా నాలుగు పట్టణాలు.
8 Phần của con cháu Si-mê-ôn gồm có mười bảy thành và các thôn ấp phụ cận. Ngoài ra, còn có các thành ở xa xôi, Ba-lát Bê-e, Ra-ma ở miền nam. Đó là cơ nghiệp của chi tộc Si-mê-ôn theo từng họ hàng.
౮దక్షిణంగా రామతు అనే బాలత్బెయేరు వరకూ ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ. ఇవి షిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం.
9 Vậy, đất của đại tộc Si-mê-ôn được trích ra từ trong lô đất của đại tộc Giu-đa, vì đất Giu-đa quá rộng.
౯షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది.
10 Thăm thứ ba chỉ định lô đất cho con cháu của đại tộc Sa-bu-luân. Biên giới của Sa-bu-luân bắt đầu từ Sa-rít,
౧౦మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది.
11 một hướng chạy về phía tây đến Ma-rê-anh, đụng Đáp-bê-sết và suối nước ở phía đông Giốc-nê-am;
౧౧వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి
12 hướng kia (cũng từ Sa-rít) chạy về phía đông cho đến biên giới Kít-lốt Tha-bô, từ đó đến Đa-bê-rát, rồi lên Gia-phia.
౧౨శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.
13 Biên giới tiếp tục chạy về phía đông Gát-hê-phe, đến Ết-cát-sin, thẳng đến Rim-môn rồi quay về Nê-a,
౧౩అక్కడ నుండి తూర్పుగా గిత్తహెపెరుకు, ఇత్కాచీను వరకూ సాగి రిమ్మోను వరకూ వెళ్లి నేయా వైపు తిరిగింది.
14 quay lên hướng bắc đến Ha-na-thôn và chấm dứt ở thung lũng Díp-tha-ên.
౧౪దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడనుండి ఇప్తాయేలు లోయలో అంతమయింది.
15 Các thành của lô này còn có Cát-tát, Na-ha-la, Sim-rôn, Y-đa-la, và Bết-lê-hem. Tổng cộng là mười hai thành và các thôn ấp phụ cận.
౧౫వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు.
16 Phần đất này thuộc về con cháu của đại tộc Sa-bu-luân, gồm các thành và những vùng phụ cận.
౧౬ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబూలూను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
17 Thăm thứ tư chỉ định lô đất cho con cháu của đại tộc Y-sa-ca.
౧౭నాలుగవ చీటి వారి వంశం ప్రకారం ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చింది.
18 Biên giới của lô này chạy qua Gít-rê-ên, Kê-su-lốt, Su-nem,
౧౮వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను,
19 Ha-pha-ra-im, Si-ôn, A-na-ha-rát,
౧౯అబెసు, రెమెతు, ఏన్గన్నీము,
20 Ra-bít, Ki-si-ôn, Ê-bết,
౨౦ఏన్‌హద్దా, బేత్పస్సెసు, అనే ప్రదేశాల వరకూ
21 Rê-mết, Ên-ga-nim, Ên Ha-đa, Bết-phát-sết,
౨౧వెళ్లి తాబోరు, షహచీమా, బేత్షెమెషు
22 Tha-bô, Sa-ha-su-ma, và Bết-sê-mết rồi biên giới chấm dứt ở Sông Giô-đan. Vậy, lô này gồm mười sáu thành với các thôn ấp phụ cận.
౨౨చేరి యొర్దాను దగ్గర అంతమయింది.
23 Phần đất này thuộc về con cháu của đại tộc Y-sa-ca, gồm các thành và những vùng phụ cận.
౨౩వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
24 Thăm thứ năm chỉ định lô đất cho con cháu của đại tộc A-se.
౨౪అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.
25 Biên giới của lô này chạy qua Hên-cát, Ha-li, Bê-tên, Ạc-sáp,
౨౫వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు,
26 A-lam-mê-léc, A-mát, Mi-sanh; về phía tây, biên giới chạy từ Cát-mên đến Si-ho Líp-nát,
౨౬అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి
27 rồi chuyển về hướng đông, chạy qua Bết-đa-gôn, Sa-bu-luân, thung lũng Díp-tha-ên, chuyển lên hướng bắc qua Bết-ê-méc và Nê-i-ên, chạy thẳng lên Ca-bun,
౨౭తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ
28 Hếp-rôn, Rê-hốp, Ham-môn, Ca-na, và Si-đôn Lớn,
౨౮ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది.
29 qua Ra-ma, đến thành có hào lũy kiên cố Ty-rơ, chạy qua Hô-sa và chấm dứt ở biển. Lô này còn gồm các thành Ma-ha-láp, Ách-xíp,
౨౯అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది.
30 U-ma, A-phéc, và Rê-hốp. Tổng cộng là mười hai thành với các thôn ấp phụ cận.
౩౦ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు.
31 Phần đất này thuộc về con cháu của đại tộc A-se, gồm các thành và những vùng phụ cận.
౩౧వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.
32 Thăm thứ sáu chỉ định lô đất cho con cháu của đại tộc Nép-ta-li.
౩౨ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.
33 Biên giới của lô này chạy từ Hê-lép, từ cây sồi ở Sa-na-nim, qua A-đa-mi, Nê-hép, Giáp-nê-ên, chạy đến tận Lạc-cum rồi chấm dứt ở Sông Giô-đan.
౩౩వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది.
34 Biên giới phía tây chạy qua Át-nốt-tha-bô, Hục-cốc, phía nam giáp giới Sa-bu-luân, phía tây giáp giới A-se, và phía đông giáp Sông Giô-đan.
౩౪అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది.
35 Lô này gồm các thành có hào lũy kiên cố: Xi-đim-xe, Ha-mát, Ra-cất, Ki-nê-rết,
౩౫ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,
36 A-đa-ma, Ra-ma, Hát-so,
౩౬అదామా, రామా, హాసోరు,
37 Kê-đe, Ết-rê-i, Ên-hát-so,
౩౭కెదెషు, ఎద్రెయీ, ఏన్‌హాసోరు,
38 Di-rôn, Mít-đa-ên, Hô-rem, Bết-a-nát, và Bết-sê-mết. Tổng cộng là mười chín thành với các thôn ấp phụ cận.
౩౮ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేత్నాతు, బేత్షెమెషు అనేవి. వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణాలు.
39 Phần đất này thuộc về con cháu của đại tộc Nép-ta-li, gồm những thành và các vùng phụ cận.
౩౯ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
40 Thăm thứ bảy chỉ định lô đất cho con cháu của đại tộc Đan.
౪౦ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది.
41 Lô này gồm có các thành Xô-ra, Ết-tha-ôn, Y-sê-mết,
౪౧వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా,
42 Sa-a-la-bin, A-gia-lôn, Ích-la,
౪౨ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను,
43 Ê-lôn, Thim-na, Éc-rôn,
౪౩అయ్యాలోను, యెతా, ఏలోను,
44 Ên-thê-kê, Ghi-bê-thôn, Ba-lát,
౪౪తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను,
45 Giê-hút, Bê-nê Bê-rác, Gát-rim-môn,
౪౫బాలాతా, యెహుదు, బెనేబెరకు,
46 Mê-giạt-côn, và Ra-côn cùng phần đất chung quanh Gióp-ba.
౪౬గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం.
47 Ngoài lô đất được Giô-suê bắt thăm chỉ định, con cháu Đan còn đi đánh Lê-sem, giết dân, chiếm thành cho dân mình ở, lấy tên ông tổ mình là Đan đặt cho thành.
౪౭దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు.
48 Phần đất này thuộc về con cháu của đại tộc Đan, gồm những thành và các vùng phụ cận.
౪౮వాటి పల్లెలుగాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.
49 Khi đất đai đã phân chia cho các đại tộc, người Ít-ra-ên lấy một phần đất cấp cho Giô-suê, con của Nun.
౪౯సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచి పెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు.
50 Theo lệnh Chúa Hằng Hữu, họ cấp cho ông thành ông chọn. Đó là thành Thim-nát Sê-ra trên cao nguyên Ép-ra-im. Ông xây lại thành và cư ngụ tại đó.
౫౦యెహోవా ఆజ్ఞను అనుసరించి అతడు అడిగిన పట్టణాన్ని, అంటే ఎఫ్రాయిము కొండ ప్రదేశంలో ఉన్న తిమ్నత్సెరహును వారు అతనికి ఇచ్చారు. అతడు ఆ పట్టణాన్ని కట్టించి దానిలో నివసించాడు.
51 Thầy Tế lễ Ê-lê-a-sa, Giô-suê, con của Nun, và những nhà lãnh đạo các đại tộc Ít-ra-ên thực hiện việc chia đất tại Si-lô, trước cửa Đền Tạm, dưới sự chứng giám của Chúa Hằng Hữu.
౫౧యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల్లో ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సమక్షంలో చీట్ల వేసి పంపకం చేసిన స్వాస్థ్యాలివి. అప్పుడు వాళ్ళు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు.