< Giăng 9 >
1 Đang đi, Chúa Giê-xu gặp một người khiếm thị từ lúc sơ sinh.
౧ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.
2 Các môn đệ hỏi Chúa: “Thưa Thầy, vì tội của ai mà anh này từ lúc mới sinh đã mù lòa như thế? Tội của anh hay của cha mẹ anh?”
౨ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు.
3 Chúa Giê-xu đáp: “Không phải vì tội của ai cả! Đức Chúa Trời muốn dùng anh này để chứng tỏ quyền năng siêu việt của Ngài.
౩అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు.
4 Khi còn ban ngày Ta phải làm những việc Cha Ta giao thác; trong đêm tối không còn cơ hội làm việc nữa.
౪పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు.
5 Khi còn ở trần gian, Ta là Nguồn Sáng cho nhân loại.”
౫ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.
6 Nói xong Chúa nhổ nước bọt xuống đất, hòa bùn thoa vào mắt người khiếm thị.
౬ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు.
7 Ngài phán: “Hãy xuống ao Si-lô rửa mắt cho sạch” (chữ Si-lô có nghĩa là “được sai đi”). Người khiếm thị đi rửa, trở về liền được sáng mắt!
౭“సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు.
8 Hàng xóm láng giềng và người quen biết anh hành khất khiếm thị đều kinh ngạc hỏi nhau: “Đây có phải là người thường ngồi ăn xin không?”
౮అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు.
9 Vài người nói chính là anh ấy, người khác lại bảo: “Không phải đâu, chỉ trông giống anh ấy thôi!” Nhưng người ăn xin lên tiếng xác nhận: “Tôi là người đó!”
౯“వీడే” అని కొందరూ, “వీడు కాదు” అని కొందరూ అన్నారు. ఇక వాడైతే, “అది నేనే” అన్నాడు.
10 Họ hỏi: “Làm sao mắt anh được lành?”
౧౦వారు, “నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని వాణ్ణి అడిగారు.
11 Anh đáp: “Một người tên Giê-xu đã hòa bùn xức mắt tôi và bảo tôi đi rửa dưới ao Si-lô. Tôi vâng lời đến đó rửa nên thấy được!”
౧౧దానికి వాడు, “యేసు అనే ఒకాయన బురద చేసి నా కళ్లపై పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అన్నాడు.
12 Họ lại hỏi: “Ông ấy đâu rồi?” Anh đáp: “Tôi không biết.”
౧౨వారు, “ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే వాడు, “నాకు తెలియదు” అన్నాడు.
13 Họ dắt anh đến trình các thầy Pha-ri-si,
౧౩ఇంతకు ముందు గుడ్డి వాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకు వెళ్ళారు.
14 vì Chúa Giê-xu hòa bùn mở mắt cho anh nhằm ngày Sa-bát.
౧౪యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం.
15 Các thầy Pha-ri-si cũng hỏi anh tại sao mắt được lành. Anh thưa: “Ông ấy thoa bùn vào mắt tôi, tôi rửa đi thì thấy được!”
౧౫వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, “ఆయన నా కన్నులపై బురద పూశాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అని వారికి చెప్పాడు.
16 Các thầy Pha-ri-si nói: “Ông ấy không phải là người của Đức Chúa Trời, vì không tôn trọng ngày Sa-bát.” Nhưng người khác cãi lại: “Người có tội đâu làm nỗi phép lạ ấy?” Vậy, giữa họ có sự chia rẽ.
౧౬“ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి రాలేదు” అని పరిసయ్యుల్లో కొందరు అన్నారు. మరి కొందరు, “ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది.
17 Họ quay lại hỏi anh khiếm thị mới được sáng mắt: “Anh nghĩ thế nào về người đã chữa mắt cho anh?” Anh thưa: “Tôi nghĩ ông ấy là một tiên tri.”
౧౭దాంతో వారు గుడ్డివాడుగా ఉన్నవాడితో, “నీ కళ్ళు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18 Các nhà lãnh đạo Do Thái vẫn không tin chuyện anh khiếm thị được sáng mắt nên gọi cha mẹ anh đến.
౧౮వాడు గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తల్లిదండ్రులను పిలిపించారు.
19 Họ hỏi: “Có phải người này là con ông bà không? Có phải nó bị mù từ lúc mới sinh không? Thế sao bây giờ nó thấy được?”
౧౯“గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని వారిని అడిగారు.
20 Cha mẹ anh đáp: “Nó đúng là con trai chúng tôi, khiếm thị từ lúc mới sinh,
౨౦దానికి వాడి తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు.
21 nhưng chúng tôi không biết tại sao nó thấy được hay ai chữa mắt cho nó. Nó đã khôn lớn có thể trả lời, xin các ông cứ hỏi nó.”
౨౧అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కళ్ళు తెరిచినదెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకోగలడు” అన్నారు.
22 Cha mẹ anh nói thế vì sợ các cấp lãnh đạo Do Thái, là người đã thông báo sẽ khai trừ khỏi hội đường những ai nhìn nhận Chúa Giê-xu là Đấng Mết-si-a.
౨౨వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయనను క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సమాజ మందిరాల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
23 Đó là lý do họ nói: “Nó đã đủ tuổi. Hãy hỏi nó.”
౨౩కాబట్టే వాడి తల్లిదండ్రులు ‘వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి’ అన్నారు.
24 Một lần nữa, họ gọi người khiếm thị mới được chữa lành đến và nói: “Hãy ca tụng Đức Chúa Trời! Chúng ta biết Giê-xu này là người tội lỗi.”
౨౪కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు.
25 Anh đáp: “Tôi không biết ông ấy có tội lỗi hay không, nhưng tôi chỉ biết trước tôi khiếm thị mà nay được sáng!”
౨౫అందుకు వాడు, “ఆయన పాపాత్ముడో కాదో నాకేం తెలుసు? అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను” అన్నాడు.
26 Họ lại hỏi: “Ông ấy làm gì? Chữa mắt anh cách nào?”
౨౬దానికి వారు, “అసలు ఆయన నీకేం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని మళ్ళీ అడిగారు.
27 Anh than phiền: “Này! Tôi đã nói rồi. Sao các ông không lưu ý? Các ông muốn nghe lần nữa? Hay các ông muốn làm môn đệ ông ấy?”
౨౭దానికి వాడు, “ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?” అని వారితో అన్నాడు.
28 Họ mắng: “Hạng người như mày mới làm môn đệ ông ấy, còn chúng ta là môn đệ Môi-se!
౨౮అందుకు వారు “నువ్వే వాడి శిష్యుడివి. మేము మోషే శిష్యులం.
29 Chúng ta biết Môi-se được hầu chuyện Đức Chúa Trời, còn người này chúng ta chẳng biết tông tích từ đâu!”
౨౯దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు” అంటూ వాణ్ణి బాగా దూషించారు.
30 Anh trả lời: “Lạ lùng chưa! Ông ấy đã mở mắt cho tôi được sáng, mà các ông bảo không biết ai sai ông ấy đến?
౩౦అయితే వాడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు.
31 Chúng ta đều biết Đức Chúa Trời không bao giờ nghe lời cầu xin của người tội lỗi, nhưng Ngài chỉ nhậm lời người tôn kính và vâng lời Ngài.
౩౧దేవుడు పాపుల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు.
32 Xưa nay, chưa bao giờ có ai chữa lành người khiếm thị từ lúc sơ sinh. (aiōn )
౩౨గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం మొదలైనప్పటి నుండి ఎవరూ వినలేదు. (aiōn )
33 Nếu ông ấy không do Đức Chúa Trời sai đến thì làm việc này sao được?”
౩౩ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటివి చేయలేడు” అని చెప్పాడు.
34 Họ bực tức mắng: “Mày mới sinh ra tội lỗi đã đầy mình, còn muốn lên mặt dạy đời sao?” Rồi anh bị họ trục xuất khỏi hội đường.
౩౪దానికి వారు, “పాపిగా పుట్టిన వాడివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అని చెప్పి వాణ్ణి తమ సమాజ మందిరం నుండి బహిష్కరించారు.
35 Chúa Giê-xu nghe tin liền tìm anh hỏi: “Anh có tin Con Người không?”
౩౫పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కలుసుకుని, “నువ్వు దేవుని కుమారుడిలో విశ్వాసముంచుతున్నావా?” అని వాణ్ణి అడిగాడు.
36 Anh đáp: “Thưa, Người ấy là ai? Xin ông cho biết để tôi tin.”
౩౬అందుకు వాడు, “ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే” అన్నాడు.
37 Chúa Giê-xu đáp: “Anh đã gặp Người ấy và Người đang nói chuyện với anh đây!”
౩౭యేసు, “ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు.
38 Anh cung kính: “Thưa Chúa, con tin!” rồi quỳ xuống thờ lạy Chúa Giê-xu.
౩౮అప్పుడు వాడు, “నేను నమ్ముతున్నాను ప్రభూ” అంటూ ఆయనను ఆరాధించాడు.
39 Chúa Giê-xu dạy: “Ta xuống trần gian để phán xét, giúp người mù được sáng, và cho người sáng biết họ đang mù.”
౩౯అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు.
40 Mấy thầy Pha-ri-si đứng gần nghe câu ấy, liền chất vấn: “Thầy bảo chúng tôi mù sao?”
౪౦ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, “అయితే మేము కూడా గుడ్డివాళ్ళమేనా?” అని అడిగారు.
41 Chúa Giê-xu đáp: “Nếu các ông biết mình mù thì được khỏi tội. Nhưng các ông cứ cho mình sáng nên tội vẫn còn.”
౪౧అందుకు యేసు, “మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ ‘మాకు చూపు ఉంది’ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పాడు.