< Gióp 29 >
౧యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.
2 “Ước gì tôi được trở về những ngày tháng trước, khi Đức Chúa Trời còn chăm sóc tôi,
౨గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది! దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు!
3 khi ngọn đèn Chúa còn soi sáng trên đầu tôi và tôi bước đi an toàn trong tối tăm.
౩అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను.
4 Khi tôi còn tráng kiện tình bạn của Đức Chúa Trời thân thiết trong nhà tôi.
౪నా పండు ముసలి దినాల్లోనూ దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది!
5 Khi Đấng Toàn Năng còn ở với tôi, và con cái quây quần bên tôi.
౫సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండే వారు.
6 Khi lối tôi đi ngập kem sữa, và đá tuôn ra suối dầu ô-liu cho tôi.
౬నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది.
7 Thời ấy, khi tôi ra cổng thành và chọn ngồi giữa những lãnh đạo danh dự.
౭పట్టణ ద్వారానికి నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు,
8 Người trẻ tuổi đứng sang một bên khi thấy tôi, còn người lớn tuổi đứng lên chào đón.
౮యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు.
9 Các hoàng tử đứng lên im tiếng, và lấy tay che miệng lại.
౯అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు.
10 Các quan chức cao của thành đứng yên lặng, giữ lưỡi mình trong kính trọng.
౧౦ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది.
11 Ai nghe tôi nói đều khen ngợi, Ai thấy tôi đều nói tốt cho tôi.
౧౧నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు.
12 Vì tôi giải cứu người nghèo khổ khi họ cần đến, và trẻ mồ côi cần nơi nương tựa.
౧౨ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.
13 Những người đang hấp hối cũng chúc tụng tôi. Và người góa bụa nhờ tôi mà tâm hồn ca hát.
౧౩నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను.
14 Mọi thứ tôi làm là chân thật. Tôi mặc lấy công chính như áo, và công lý như khăn quấn trên đầu tôi.
౧౪నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది.
15 Tôi là mắt cho người mù và chân cho người què
౧౫గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను.
16 Tôi là cha của người nghèo khó, và tra xét hoàn cảnh cho khách lạ.
౧౬దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను.
17 Tôi bẻ nanh vuốt bọn gian manh vô đạo và rứt các nạn nhân ra khỏi răng chúng nó.
౧౭దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాను. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను.
18 Tôi tự bảo: ‘Chắc tôi sẽ được chết trong nhà tôi, khi những ngày của tôi đã nhiều như cát.
౧౮అప్పుడు నేను ఇలా అనుకున్నాను. నా గూటి దగ్గరనే నేను కన్ను మూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినౌతాను.
19 Vì tôi như rễ sẽ ăn ra cho đến dòng nước, cả đêm sương đọng trên cành lá tôi.
౧౯నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది.
20 Vinh quang tôi sẽ mãi sáng chói trong tôi, và sức mạnh tôi tiếp tục mới mẻ.’
౨౦నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది.
21 Mọi người lắng tai nghe ý kiến tôi. Họ im lặng nghe tôi khuyên nhủ.
౨౧మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు.
22 Sau khi tôi nói, họ không còn gì để thêm, vì lời tôi nói làm hài lòng họ.
౨౨నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి.
23 Họ mong tôi nói như người ta đợi mưa. Họ uống lời tôi như uống nước mưa xuân.
౨౩వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు.
24 Khi họ nản lòng tôi cười với họ. Mặt tôi rạng rỡ làm khích lệ họ.
౨౪వారు ఉహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు.
25 Như một thủ lãnh, tôi chỉ dẫn điều họ phải làm. Tôi sống như nhà vua giữa đạo binh mình và an ủi những ai sầu khổ.”
౨౫నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించే వారిని ఓదార్చే వాడి వలే ఉన్నాను.