< Giê-rê-mi-a 40 >
1 Chúa Hằng Hữu ban một sứ điệp cho Giê-rê-mi sau khi Nê-bu-xa-ra-đan, quan chỉ huy thị vệ, trả tự do cho Giê-rê-mi tại Ra-ma. Ông sai tìm Giê-rê-mi đang bị xiềng chung với đoàn phu tù Giê-ru-sa-lem và Giu-đa bị lưu đày qua xứ Ba-by-lôn.
౧రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుంచి, యూదాలో నుంచి బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరి దగ్గర నుంచి, సంకెళ్లతో బంధించి ఉన్న యిర్మీయాను రమా నుంచి పంపించేసినప్పుడు యెహోవా నుంచి అతనికి వచ్చిన వాక్కు.
2 Quan chỉ huy thị vệ gọi Giê-rê-mi đến và nói: “Chính Chúa Hằng Hữu, Đức Chúa Trời của ông đã giáng tai họa trên đất nước này,
౨రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్ళి, అతనితో “ఈ స్థలానికి ఈ విపత్తు తెస్తానని నీ దేవుడైన యెహోవా ప్రకటించాడు గదా,
3 như lời Ngài đã cảnh cáo. Vì dân này phạm tội nghịch cùng Chúa Hằng Hữu và bất tuân với Ngài. Đó là lý do việc này đã xảy ra.
౩తాను చెప్పిన ప్రకారం యెహోవా ఆ విపత్తు రప్పించాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినలేదు కాబట్టి ఆయన చెప్పినట్టే చేశాడు. అందుకే మీకు ఇలా జరిగింది.
4 Nhưng tôi đã tháo gỡ xiềng xích cho ông và để ông đi. Nếu ông muốn cùng tôi qua Ba-by-lôn, thì cùng đi. Tôi sẽ chăm sóc cẩn thận cho ông. Nhưng nếu ông không muốn đến đó, thì cứ ở lại đây. Cả xứ ở trước mắt ông—muốn đi đâu tùy ý.
౪కాని ఇప్పుడు చూడు! ఈ రోజు నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించాను. నాతోబాటు బబులోను రావడం మంచిదని నీకు అనిపిస్తే నాతో రా. నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. అయితే మంచిది కాదనిపిస్తే రావద్దు. దేశమంతా నీ ఎదుట ఉంది. ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళు.”
5 Nhưng nếu ông quyết định ở lại, ông hãy về ở với Ghê-đa-lia, con A-hi-cam, cháu Sa-phan. Vì ông ấy vừa được vua Ba-by-lôn chỉ định làm tổng trấn Giu-đa. Hãy ở đó cùng với đoàn dân dưới sự cai trị của ông ấy. Nhưng tùy ý ông; ông có thể đi nơi nào ông thích.” Rồi Nê-bu-xa-ra-đan, quan chỉ huy thị vệ, cung cấp cho Giê-rê-mi lương thực và tiền rồi để người đi.
౫యిర్మీయా ఏ జవాబూ చెప్పకుండా ఉన్నప్పుడు, నెబూజరదాను అతనితో ఇలా అన్నాడు. “షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాను యూదా పట్టణాల మీద అధికారిగా బబులోను రాజు నియమించాడు. అతని దగ్గరికి వెళ్లు. అతనితో ఉంటూ, ప్రజల మధ్య నివాసం ఉండు. లేదా, ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లు.” అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి ఆహారం, ఒక బహుమానం ఇచ్చి పంపించాడు.
6 Vậy, Giê-rê-mi trở về cùng Ghê-đa-lia, con A-hi-cam tại Mích-pa, và người sống trong Giu-đa với dân còn sót trong xứ.
౬యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వెళ్లి అతనితోబాటు దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు.
7 Các thủ lĩnh của nhóm quân lưu tán Giu-đa ở miền thôn quê nghe tin vua Ba-by-lôn đã chỉ định Ghê-đa-lia, con A-hi-cam, làm tổng trấn cai trị những người nghèo còn sót lại trong Giu-đa—gồm đàn ông, phụ nữ, và trẻ em là những người không bị đày qua Ba-by-lôn.
౭ఇప్పుడు, అక్కడ పల్లెటూళ్ళల్లో ఉన్న కొంతమంది యూదయ సేనల అధిపతులూ, వారి మనుషులూ, బబులోను రాజు అహీకాము కొడుకు గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించాడనీ, బబులోనుకు బందీలుగా వెళ్ళకుండా అక్కడే మిగిలిన వాళ్ళలో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని నిరుపేదలను అతనికి అప్పగించాడనీ విన్నారు.
8 Họ liền đến yết kiến Ghê-đa-lia tại Mích-pa. Những người này gồm: Ích-ma-ên, con Nê-tha-nia, Giô-ha-nan, và Giô-na-than, con Ca-rê-át, Sê-ra-gia, con Tân-hu-mết, các con trai của Ê-phai ở Nê-tô-pha-tít, và Giê-xa-nia, con của Ma-ca-thít, cùng tất cả quân lính đi theo họ.
౮కాబట్టి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకులైన యోహానాను, యోనాతాను, తన్హుమెతు కొడుకు శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి కొడుకులు, మాయకాతీయుడి కొడుకు యెజన్యా, వాళ్ళ మనుషులు, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు.
9 Ghê-đa-lia dùng lời thề trấn an họ: “Đừng sợ phục vụ họ. Hãy sống ở đây và phục vụ vua Ba-by-lôn, thì ai nấy sẽ được an cư lạc nghiệp.
౯అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. “మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది.
10 Tôi sẽ phải ở lại Mích-pa để đại diện anh em tiếp người Ba-by-lôn khi họ đến. Nhưng anh em hãy thu hoạch rượu, trái mùa hạ, dầu dự trữ trong bình và sống tại những thành mà anh em được chiếm đóng.”
౧౦చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.”
11 Khi những người Do Thái kiều ngụ tại Mô-áp, Am-môn, Ê-đôm, và các nước lân bang nghe tin rằng vua Ba-by-lôn đã để lại vài người sống sót trong Giu-đa và Ghê-đa-lia là tổng trấn,
౧౧మోయాబులో, అమ్మోనీయుల ప్రజల మధ్య, ఎదోములో, ఇంకా మిగతా ప్రదేశాలన్నిటిలో ఉన్న యూదులందరూ, బబులోను రాజు యూదయలో కొంతమంది ప్రజలను విడిచిపెట్టాడనీ, షాఫాను కొడుకు అహీకాము కొడుకైన గెదల్యాను వాళ్ళ మీద అధికారిగా నియమించాడని విన్నారు.
12 họ bèn rời các xứ tị nạn để trở về Giu-đa. Trên đường về, họ dừng tại Mích-pa để gặp Ghê-đa-lia và vào vùng thôn quê Giu-đa để thu hoạch nhiều rượu nho và trái mùa hạ.
౧౨కాబట్టి యూదయ వాళ్ళందరూ తాము చెదిరిపోయి ఉన్న స్థలాలన్నిటినీ విడిచి, గెదల్యా దగ్గరికి మిస్పా తిరిగి వచ్చారు. వాళ్ళు ద్రాక్షారసం, వేసవికాలపు ఫలాలు అత్యంత సమృద్ధిగా సమకూర్చుకున్నారు.
13 Ít lâu sau, Giô-ha-nan, con Ca-rê-át, và một số thủ lĩnh quân lưu tán đến gặp Ghê-đa-lia tại Mích-pa.
౧౩కారేహ కొడుకు యోహానాను, పల్లెటూళ్ళల్లో నున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చి,
14 Họ nói với ông: “Ông có biết rằng Ba-a-lít, vua Am-môn, đã bí mật sai Ích-ma-ên, con Nê-tha-nia, đến ám sát ông không?” Tuy nhiên, Ghê-đa-lia không tin lời họ.
౧౪“నిన్ను చంపడానికి అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కొడుకు ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?” అన్నారు. కాని, అహీకాము కొడుకు గెదల్యా వాళ్ళ మాట నమ్మలేదు.
15 Sau đó Giô-ha-nan nói riêng với Ghê-đa-lia và tình nguyện ám sát Ích-ma-ên. Giô-na-than hỏi: “Tại sao chúng ta để hắn đến đây giết ông? Chuyện gì sẽ xảy ra khi người Giu-đa trở về đây? Tại sao phải để những người còn sống sót bị tàn sát?”
౧౫కారేహ కొడుకు యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా “నెతన్యా కొడుకు ఇష్మాయేలును నేను చంపుతాను. నన్ను ఎవరూ అనుమానించరు. అతడు నిన్నెందుకు చంపాలి? నీ దగ్గరికి కూడివచ్చిన యూదులందరూ ఎందుకు చెదిరిపోవాలి? మిగిలిన ప్రజలందరూ ఎందుకు నాశనం కావాలి?” అన్నాడు.
16 Nhưng Ghê-đa-lia nói với Giô-ha-nan: “Ta cấm anh làm bất cứ điều gì, vì điều anh nói về Ích-ma-ên không đúng.”
౧౬కాని అహీకాము కొడుకు గెదల్యా, కారేహ కొడుకు యోహానానుతో “నువ్వు ఈ పని చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఇష్మాయేలు గురించి అబద్ధాలు చెబుతున్నావు” అన్నాడు.