< Sáng Thế 47 >

1 Giô-sép vào tâu vua Pha-ra-ôn: “Cha và anh em tôi đã từ xứ Ca-na-an đến đây, với bầy chiên, bầy bò, và mọi tài sản. Hiện nay họ ở Gô-sen.”
యోసేపు వెళ్ళి ఫరోతో “మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు” అని తెలియచేసి,
2 Giô-sép đưa năm anh em đến yết kiến vua Pha-ra-ôn.
తన సోదరుల్లో ఐదు గురిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు.
3 Vua Pha-ra-ôn hỏi: “Các ngươi làm nghề gì?” Họ tâu: “Chúng tôi chăn nuôi súc vật, cũng như tổ tiên chúng tôi.
ఫరో, అతని సోదరులను చూసి “మీ వృత్తి ఏంటి?” అని అడిగితే వారు “నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం” అని ఫరోతో చెప్పారు.
4 Xứ Ca-na-an bị đói lớn, chẳng còn đồng cỏ cho súc vật nên chúng tôi đến đây cư trú. Xin vua cho chúng tôi ở xứ Gô-sen.”
వారు “కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి” అని ఫరోతో అన్నారు.
5 Vua Pha-ra-ôn bảo Giô-sép: “Cha và anh em ngươi đã đến đây.
ఫరో యోసేపును చూసి “మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు.
6 Trong cả nước Ai Cập, hãy chọn nơi nào tốt nhất cho họ. Ta nghĩ đất Gô-sen rất thích hợp. Ngươi cũng hãy tuyển người tài giỏi trong vòng họ để chăn bầy súc vật của ta.”
ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు” అని చెప్పాడు.
7 Giô-sép cũng đưa cha đến gặp vua. Gia-cốp chúc phước cho vua.
యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు.
8 Vua hỏi thăm Gia-cốp về tuổi tác.
ఫరో “నీ వయసెంత?” అని యాకోబును అడిగాడు.
9 Gia-cốp đáp: “Thưa vua, tôi được 130 tuổi, đời du mục của tôi rất ngắn ngủi và cực nhọc so với đời du mục của tổ tiên tôi.”
యాకోబు “నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు” అని ఫరోతో చెప్పి,
10 Trước khi từ giã, Gia-cốp lại chúc phước cho vua Pha-ra-ôn.
౧౦ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.
11 Giô-sép chọn chỗ tốt nhất trong nước Ai Cập cho cha và các anh em định cư, tại miền Ram-se, đúng theo lệnh vua.
౧౧ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు.
12 Tùy theo số khẩu phần, Giô-sép cung cấp lương thực cho cha và các anh em.
౧౨యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
13 Nạn đói trở nên quá trầm trọng. Cả xứ Ai Cập và xứ Ca-na-an đều kiệt quệ, chẳng còn lương thực.
౧౩కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి.
14 Giô-sép bán lúa, thu hết tiền bạc trong xứ Ai Cập, xứ Ca-na-an, và chứa trong kho hoàng cung Pha-ra-ôn.
౧౪యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు.
15 Khi tiền bạc đã hết, người Ai Cập và người Ca-na-an đến kêu cầu Giô-sép: “Xin cấp lương thực cho chúng tôi, không lẽ vì hết tiền mà chúng tôi phải chết đói sao?”
౧౫ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి “మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
16 Giô-sép đáp: “Nếu hết tiền, các ngươi đem gia súc đến đổi lấy lương thực.”
౧౬అందుకు యోసేపు “మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను” అని చెప్పాడు.
17 Vậy họ đem gia súc đến, nào là chiên, bò, ngựa, lừa, để đổi lấy lương thực nơi Giô-sép.
౧౭కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు.
18 Qua năm sau, người Ai Cập lại đến xin Giô-sép: “Ông thừa biết tiền bạc chúng tôi đã cạn, gia súc ông cũng mua rồi, chúng tôi chẳng còn gì ngoài bản thân và ruộng đất.
౧౮ఆ సంవత్సరం గడిచాక, తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు.
19 Tại sao ông để chúng tôi chết và đất ruộng hoang vu? Hãy mua chúng tôi và ruộng đất bằng lương thực. Chúng tôi làm nô lệ cho vua Pha-ra-ôn để đổi lấy lúa, nhờ đó chúng tôi thoát chết, đất ruộng khỏi hoang tàn.”
౧౯మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి” అని అడిగారు.
20 Vì nạn đói quá lớn, mọi người Ai Cập đều bán ruộng. Giô-sép mua tất cả ruộng đất cho vua; ruộng đất Ai Cập trở thành tài sản của nhà vua;
౨౦ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది.
21 và toàn dân Ai Cập từ nam đến bắc đều phải dọn về thành phố.
౨౧అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను దాసులుగా చేశాడు.
22 Tuy nhiên, Giô-sép không mua ruộng của các thầy tư tế, vì họ được vua Pha-ra-ôn cấp phát lương thực, khỏi phải bán ruộng.
౨౨యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు.
23 Giô-sép tuyên bố với dân: “Ngày nay, ta mua các ngươi và ruộng đất cho vua Pha-ra-ôn. Đây, ta giao hạt giống để các ngươi gieo trồng.
౨౩యోసేపు “ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి.
24 Đến mùa gặt, hãy nạp một phần năm cho vua; còn bốn phần thuộc về các ngươi, để làm hạt giống cho mùa sau và làm lương thực cho gia đình các ngươi.”
౨౪నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు.
25 Dân chúng đáp: “Ông đã cứu mạng chúng tôi. Được ông thương xót, chúng tôi vui lòng làm nô lệ cho vua Pha-ra-ôn.”
౨౫వారు “నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉండుగాక. మేము ఫరోకు బానిసలమవుతాం” అని చెప్పారు.
26 Vậy, Giô-sép lập ra luật này cho nước Ai Cập (đến bây giờ hãy còn): một phần năm hoa lợi của đồng ruộng phải nạp cho vua, ngoại trừ ruộng của các thầy tư tế.
౨౬అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకూ నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు.
27 Ít-ra-ên định cư tại Gô-sen, nước Ai Cập, gây dựng sự nghiệp, và họ sinh sôi nẩy nở nhanh chóng.
౨౭ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు.
28 Gia-cốp sống mười bảy năm tại Ai Cập, thọ 147 tuổi.
౨౮యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు.
29 Ngày gần qua đời, Gia-cốp sai gọi Giô-sép đến bảo: “Con vui lòng giúp cha việc này: Con hãy đặt tay lên đùi cha, lấy lòng ngay thẳng thành thật mà thề là sẽ không chôn cha tại Ai Cập.
౨౯ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి “నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు.
30 Khi cha qua đời, hãy đem thi thể cha ra khỏi Ai Cập, và đem chôn bên phần mộ của tổ tiên.” Giô-sép thưa: “Con sẽ làm mọi điều cha dặn.”
౩౦నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి, వారి సమాధిలో నన్ను పాతిపెట్టు” అని అతనితో చెప్పాడు.
31 Gia-cốp bảo: “Con hãy thề.” Vậy Giô-sép thề, còn Ít-ra-ên quỳ bên đầu giường.
౩౧అందుకు యోసేపు “నేను నీ మాట చొప్పున చేస్తాను” అన్నాడు. ఇశ్రాయేలు “నాతో ప్రమాణం చెయ్యి” అంటే, యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు.

< Sáng Thế 47 >