< Sáng Thế 44 >

1 Giô-sép ra lệnh cho quản gia: “Hãy đổ thật nhiều lúa cho họ, sức họ chở được bao nhiêu, cứ đổ đầy bấy nhiêu. Còn bạc mua lúa cứ trả lại vào bao mỗi người.
యోసేపు “వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు,
2 Ngươi cũng hãy để chén bạc của ta vào miệng bao của người út, chung với tiền mua lúa.” Quản gia vâng lệnh Giô-sép.
చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు” అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.
3 Sáng sớm hôm sau, các anh em và đoàn lừa lên đường.
తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు.
4 Khi họ ra khỏi thành chưa xa, Giô-sép bảo quản gia: “Hãy đuổi theo những người đó, chặn họ lại hỏi: ‘Tại sao các anh lấy oán trả ân như thế?
వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో “నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, ‘మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి?
5 Sao nhẫn tâm đánh cắp cái chén bạc của chủ ta dùng uống rượu và bói toán? Các anh đã làm một điều ác đó!’”
నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం’ అని వారితో చెప్పు” అన్నాడు.
6 Quản gia đuổi kịp và nói với họ những lời của Giô-sép.
అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు.
7 Họ ngạc nhiên: “Tại sao ông nói thế? Chúng tôi không phải hạng người xấu như ông nghĩ đâu.
వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.
8 Số bạc trong các bao lúa, từ Ca-na-an chúng tôi còn đem xuống trả lại cho ngài đầy đủ, lẽ nào còn ăn cắp vàng bạc trong nhà chủ ông?
చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము?
9 Nếu ông tìm thấy chén bạc nơi ai, người ấy phải chết, còn chúng tôi sẽ làm nô lệ cho chủ ông.”
నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం” అని అతనితో అన్నారు.
10 Quản gia đáp: “Thôi được, chỉ người ăn cắp bị bắt làm nô lệ, còn tất cả vô can.”
౧౦గృహ నిర్వాహకుడు “మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు” అని చెప్పాడు.
11 Các anh em vội vàng hạ các bao lúa trên lưng lừa xuống đất và mở ra.
౧౧అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు.
12 Quản gia lần lượt khám từ bao của anh cả đến bao của em út. Chén bạc được tìm thấy trong bao của Bên-gia-min.
౧౨ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.
13 Các anh em thất vọng, xé áo, chất lúa lên lưng lừa, và trở lại thành.
౧౩వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.
14 Giu-đa và các anh em vào dinh Giô-sép; lúc ấy ông vẫn còn đó. Họ quỳ dưới đất, trước mặt ông.
౧౪అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు.
15 Giô-sép hỏi: “Các anh làm gì thế? Không biết rằng ta có tài bói toán sao?”
౧౫అప్పుడు యోసేపు “మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా” అని వారితో అన్నాడు.
16 Giu-đa thưa: “Chúng tôi không biết phải nói năng thế nào, hay phải tự biện hộ làm sao đây, vì Đức Chúa Trời đã phạt chúng tôi về những tội ác của chúng tôi rồi. Chúng tôi và người lấy chén bạc xin trở lại làm nô lệ cho ông.”
౧౬యూదా “మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం” అన్నాడు.
17 Giô-sép đáp: “Không, ta chỉ giữ người lấy chén bạc làm nô lệ cho ta, còn các anh được tự do về nhà cha.”
౧౭యోసేపు “అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి” అని చెప్పాడు.
18 Giu-đa bước đến gần và phân trần: “Xin cho đầy tớ ngài được biện bạch đôi lời. Xin đừng nổi giận với kẻ hèn này, vì uy quyền ngài ngang hàng với vua Pha-ra-ôn.
౧౮యూదా అతని సమీపించి “ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా.
19 Trước đây, ngài hỏi chúng tôi còn cha hay anh em nào nữa không.
౧౯నా యజమానులైన మీరు, ‘మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?’ అని తమ దాసులను అడిగారు.
20 Chúng tôi thưa là còn cha già và đứa em út ra đời lúc cha đã cao tuổi. Anh nó đã chết. Trong số các con cùng một mẹ, nó là đứa duy nhất còn sống, nên cha cưng nó lắm.
౨౦అందుకు మేము, ‘మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు’ అన్నాము.
21 Ngài dạy chúng tôi đem nó đến cho ngài thấy mặt.
౨౧అప్పుడు తమరు, ‘నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకు రండి’ అని తమ దాసులతో చెప్పారు.
22 Chúng tôi thưa: ‘Nó không thể lìa cha; nếu nó đi, cha sẽ chết.’
౨౨అందుకు మేము, ‘ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు’ అని నా యజమానులైన మీతో చెప్పాము.
23 Ngài lại bảo nếu em út không đến, chúng tôi không được gặp ngài nữa.
౨౩అందుకు తమరు, ‘మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని తమ దాసులతో చెప్పారు.
24 Chúng tôi về trình lại với cha những lời ngài dạy.
౨౪కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము.
25 Sau đó, cha bảo chúng tôi trở lại mua ít lương thực.
౨౫మా తండ్రి, ‘మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కుని రండి’ అని చెబితే
26 Chúng tôi thưa: ‘Nếu em út không đi cùng, chúng con không thể xuống đây. Vì chúng con không thể gặp tể tướng nếu không có nó.’
౨౬‘మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము’ అని చెప్పాము.
27 Cha chúng tôi than: ‘Vợ ta sinh cho ta hai con trai,
౨౭అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు.
28 một đứa đi mất, chắc đã bị thú dữ xé xác, vì đến nay vẫn chưa thấy về.
౨౮వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు.
29 Nếu chúng bay đem đứa này đi nữa, rủi nó bị nguy hiểm, thân già này sẽ sầu khổ mà chết.’ (Sheol h7585)
౨౯మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు’ అని మాతో చెప్పాడు. (Sheol h7585)
30 Thưa ngài, mạng sống cha tôi tùy thuộc nơi mạng sống đứa trẻ. Bây giờ, nếu tôi không đem nó về nhà,
౩౦కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే
31 khi thấy tôi mà không thấy nó, chắc chắn cha tôi sẽ chết. Vậy, chính chúng tôi làm cho cha già chết trong sầu khổ. (Sheol h7585)
౩౧మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము. (Sheol h7585)
32 Kẻ hèn này đã xin cha cho bảo lãnh đứa trẻ: ‘Nếu không đem em về cho cha, con sẽ mang tội với cha suốt đời.’
౩౨తమ సేవకుడినైన నేను, ‘ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పాను.
33 Vậy, xin ngài cho tôi ở lại làm nô lệ thay cho em tôi, để nó về nhà với các anh nó.
౩౩కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి.
34 Làm sao tôi có thể về với cha mà không có nó? Lẽ nào tôi phải chứng kiến thảm họa xảy đến cho cha tôi sao?”
౩౪ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది” అని చెప్పాడు.

< Sáng Thế 44 >