< Sáng Thế 33 >

1 Ngước mặt lên, Gia-cốp thấy Ê-sau chỉ huy lực lượng 400 người tiến đến. Gia-cốp lập tức chia đàn con cho Lê-a, Ra-chên, và hai nữ tì.
యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు.
2 Hai nữ tì dẫn con họ đi trước, kế đến là Lê-a và sáu con; Ra-chên và Giô-sép đi sau cùng.
అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.
3 Gia-cốp vượt lên trước vợ con để đón Ê-sau và cúi rạp xuống đất bảy lần trước mặt anh mình.
తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకూ ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు.
4 Ê-sau chạy đến ôm choàng Gia-cốp và bá lấy cổ mà hôn. Hai anh em đều khóc.
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
5 Thấy vợ con Gia-cốp tiến đến, Ê-sau hỏi: “Những người đi theo em đó là ai?” Gia-cốp đáp: “Đó là con cái Chúa đã cho em.”
ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి “వీరు నీకేమౌతారు?” అని అడిగాడు. అతడు “వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే” అని చెప్పాడు.
6 Hai nữ tì dẫn đàn con đến cúi xuống chào Ê-sau,
అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరికి వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.
7 kế đến là Lê-a và các con, sau hết là Ra-chên và Giô-sép.
లేయా ఆమె పిల్లలూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.
8 Ê-sau hỏi: “Các bầy súc vật đó em định làm gì?” Gia-cốp đáp: “Em xin kính dâng cho anh để anh rủ lòng thương.”
ఏశావు “నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?” అని అడిగాడు. అతడు “నా ప్రభువు దయ నా మీద కలగడానికే” అని చెప్పాడు.
9 Ê-sau từ khước: “Anh có đủ tài sản rồi; em cứ giữ các bầy súc vật đó.”
అప్పుడు ఏశావు “తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో” అని చెప్పాడు.
10 Gia-cốp khẩn khoản: “Không, em nài xin anh vui lòng nhận các lễ vật ấy. Vì gặp được anh cũng như gặp được Đức Chúa Trời rồi; anh đã vui lòng tiếp đón em.
౧౦అప్పుడు యాకోబు “అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా.
11 Xin anh nhận lễ vật em dâng hiến, vì Đức Chúa Trời đã hậu đãi em và cho em đầy đủ mọi thứ.” Gia-cốp nài nỉ mãi cho đến khi Ê-sau nhận các lễ vật ấy.
౧౧నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది” అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దాన్ని పుచ్చుకుని
12 Ê-sau nói: “Này, anh em ta hãy lên đường; anh sẽ hộ tống em.”
౧౨“మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను” అని చెప్పగా
13 Gia-cốp đáp: “Anh biết đám trẻ con còn yếu; bầy chiên và bò có nhiều con đang bú. Nếu ép đi nhanh, chắc chỉ một ngày là chúng bỏ mạng.
౧౩అతడు “నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.
14 Xin anh cứ đi trước, còn em sẽ chậm rãi theo sau, đi cho vừa sức của trẻ con và thú vật đang bú, cho đến chừng tới nhà anh trên núi Sê-i-rơ.”
౧౪నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరికి శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకుంటూ వస్తాను” అని అతనితో చెప్పాడు.
15 Ê-sau lại nói: “Để anh bảo người ở lại dẫn đường cho em.” Gia-cốp từ khước: “Không cần, anh ạ. Anh đã tỏ lòng thương em là quý lắm rồi.”
౧౫అప్పుడు ఏశావు “నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను” అనగా అతడు “అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు” అన్నాడు.
16 Ngay hôm ấy, Ê-sau quay về núi Sê-i-rơ.
౧౬ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు.
17 Còn Gia-cốp đến Su-cốt, hạ trại, và dựng lều cho các bầy súc vật. Từ đó, người ta gọi địa điểm này là Su-cốt (nghĩa là nhà lều).
౧౭అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి “సుక్కోతు” అనే పేరు వచ్చింది.
18 Kể từ ngày lìa xứ Pha-đan A-ram, Gia-cốp đi đường bình an đến xứ Ca-na-an, và hạ trại trước thành phố Si-chem.
౧౮ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు.
19 Gia-cốp mua một miếng đất của anh em Si-chem, các con trai của Hê-mô, để cắm trại.
౧౯అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు.
20 Gia-cốp lập một bàn thờ tại Si-chem và đặt tên bàn thờ là Ên-ên-ô-hê, tức là Đức Chúa Trời của Ít-ra-ên.
౨౦అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి “ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు” అని పేరు పెట్టాడు.

< Sáng Thế 33 >