< Sáng Thế 28 >

1 Y-sác gọi Gia-cốp vào, chúc phước lành, và căn dặn: “Con đừng cưới vợ người Ca-na-an.
ఇస్సాకు యాకోబును పిలిపించి “నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు.
2 Trái lại, con hãy lên đường, về xứ Pha-đan A-ram, đến nhà Bê-tu-ên, ông ngoại con, và cưới một cô con gái của cậu La-ban làm vợ.
నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో
3 Cầu Đức Chúa Trời Toàn Năng ban phước cho con, cho con đông con, cho dòng dõi con sinh sôi nẩy nở, và trở thành một nước lớn gồm nhiều dân tộc.
సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా
4 Cầu Chúa cho con và dòng dõi con hưởng phước lành của Áp-ra-ham, cho con làm chủ miền đất con đang kiều ngụ mà Đức Chúa Trời đã ban cho ông nội con.”
ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక” అని దీవించి పంపివేశాడు.
5 Vậy, Y-sác sai Gia-cốp đi qua xứ Pha-đan A-ram và đến nhà La-ban, cậu của Gia-cốp, con trai của Bê-tu-ên, người A-ram.
అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ.
6 Ê-sau thấy Y-sác chúc phước cho Gia-cốp và bảo qua xứ Pha-đan A-ram tìm vợ; trong lúc chúc phước, người dặn Gia-cốp rằng đừng cưới vợ trong bọn con gái Ca-na-an.
ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు “నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు” అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది.
7 Ê-sau thấy Gia-cốp vâng lời cha mẹ qua xứ Pha-đan A-ram,
యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ,
8 Ê-sau biết rằng Y-sác không ưa con gái Ca-na-an.
ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు.
9 Ê-sau đi đến Ích-ma-ên, bác mình, và cưới thêm cô vợ thứ ba. Nàng tên là Ma-ha-lát, con Ích-ma-ên, cháu nội Áp-ra-ham, em của Nê-ba-giốt.
అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు.
10 Gia-cốp từ giã Bê-e-sê-ba và đi qua xứ Pha-đan Ha-ran.
౧౦యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ
11 Ông đến một chỗ kia dừng chân và nghỉ đêm tại đó vì mặt trời đã lặn. Gia-cốp chọn một tảng đá gối đầu nằm ngủ.
౧౧ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.
12 Gia-cốp nằm mộng thấy một chiếc thang bắc liền từ đất lên trời, và các thiên sứ của Chúa lên xuống trên thang ấy.
౧౨అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
13 Chúa Hằng Hữu đứng trên đầu thang và gọi Gia-cốp: “Ta là Đấng Tự Hữu Hằng Hữu, Chân Thần của ông nội con là Áp-ra-ham và của cha con là Y-sác. Đất con đang nằm đây thuộc về con. Ta ban miền đất này cho con và cho dòng dõi con.
౧౩యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.
14 Dòng dõi con sẽ đông như cát bụi trên mặt đất. Con sẽ mở rộng biên cương ra bốn hướng đông, tây, nam, bắc. Các dân tộc trên thế giới sẽ nhờ con và hậu tự con mà được phước.
౧౪నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి.
15 Này, Ta ở cùng con luôn, con đi đâu, Ta sẽ theo gìn giữ đó và đem con về xứ này, vì Ta không bao giờ bỏ con cho đến khi Ta hoàn thành lời Ta đã hứa với con.”
౧౫ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.
16 Gia-cốp thức giấc và tự nhủ: “Thật Chúa Hằng Hữu ngự tại đây mà ta không biết.”
౧౬యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు.
17 Ông sợ hãi nói: “Nơi này thật đáng kính sợ. Đây chính là Nhà của Đức Chúa Trời, là cửa dẫn lên trời!”
౧౭అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.
18 Gia-cốp dậy sớm, lấy tảng đá gối đầu đêm qua dựng lên làm trụ kỷ niệm, đổ dầu ô-liu trên đỉnh,
౧౮పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు.
19 và đặt tên địa điểm này là Bê-tên (Nhà Chân Thần), thay tên cũ là Lu-xơ.
౧౯అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.
20 Gia-cốp khấn nguyện: “Nếu Đức Chúa Trời ở với con, gìn giữ con trên đường con đang đi, cho con đủ ăn đủ mặc,
౨౦అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,
21 và đưa con trở về nhà cha con bình an vô sự, con sẽ chọn Chúa Hằng Hữu làm Đức Chúa Trời của con.
౨౧తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు.
22 Còn tảng đá kỷ niệm này sẽ trở thành nơi thờ phượng Đức Chúa Trời, và con sẽ dâng lại cho Đức Chúa Trời một phần mười mọi vật Chúa ban cho.”
౨౨అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.

< Sáng Thế 28 >